Essay on Bharatha Desam in telugu
Answers
Answer:
భారత దేశం కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న సువిశాల దేశం. విభిన్న మతాలు,భాషలు, సంస్కృతులతో విలసిల్లుతూ, ప్రపంచాన భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్న దేశం.
భారతదేశం, వివిధ సంస్కృతుల , భాషల, మతాల,వన్యప్రాణుల వైవిధ్యం గల దేశం.
భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది జంబూ ద్వీపం. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, మేరో దక్షిణభాగే, శ్రీశైల ఉత్తర భాగే, కృష్ణా గోదావారీ మధ్య స్థానే...). జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది.ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు.
తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధుానది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధుానదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు.
తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది, ప్రస్తుతము భారతదేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు ఉన్నాయి. అవి ఇండియా, భారతదేశం. ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూదేశం యొక్క రూపాంతరమే.
hope it helps u..
plz mark it as brainliest
Explanation: