India Languages, asked by mantrhip21drm, 11 months ago

Essay on Corona virus in TELUGU !!

Answers

Answered by dia190
24

Explanation:

చైనాలో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. పాముల కారణంగా వచ్చిన ఈ వైరస్ పెంపుడు జంతువులకి త్వరగా వస్తుంది. వాటి ద్వారా మనుషులకి వ్యాపిస్తోంది. అదే విధంగా మనుషుల నుంచి మనుషులకు వచ్చే ఈ వ్యాధి.. దగ్గు, తుమ్ములు, షేక్ హ్యాండ్ వంటి చర్యలతోనే ఎక్కువగా వస్తోంది..

Also Read : ఈ సమయంలో పెరుగు కచ్చితంగా తినాలి.. ఎందుకంటే..

వ్యాధి లక్షణాలు..

వ్యాధి రాగానే ముందుగా జలుబు వస్తుంది. తుమ్మడం, దగ్గడం, జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు వస్తాయి. ఇది ఇక్కడితో ఆగకుండా ఊపిరితిత్తుల వరకూ చేరుతుంది. ఇది న్యూమోనియాకి దారి తీస్తుంది. ఇది ముందుగానే గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి.

Answered by senayelek
59

Answer:

కరోనా.. ఈ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఎందుకంటే రోజురోజుకీ ఇది వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. మరి నిజంగానే ఈ వ్యాధి రాగానే ప్రాణాలు పోతాయా.. దీనిని అడ్డుకోలేమా.

Explanation:

మనిషి నుంచి మనిషి వ్యాపించే వ్యాధి..

చైనాలో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. పాముల కారణంగా వచ్చిన ఈ వైరస్ పెంపుడు జంతువులకి త్వరగా వస్తుంది. వాటి ద్వారా మనుషులకి వ్యాపిస్తోంది. అదే విధంగా మనుషుల నుంచి మనుషులకు వచ్చే ఈ వ్యాధి.. దగ్గు, తుమ్ములు, షేక్ హ్యాండ్ వంటి చర్యలతోనే ఎక్కువగా వస్తోంది..

వ్యాధి లక్షణాలు..

వ్యాధి రాగానే ముందుగా జలుబు వస్తుంది. తుమ్మడం, దగ్గడం, జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు వస్తాయి. ఇది ఇక్కడితో ఆగకుండా ఊపిరితిత్తుల వరకూ చేరుతుంది. ఇది న్యూమోనియాకి దారి తీస్తుంది. ఇది ముందుగానే గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ వ్యాధి ప్రభావం తగ్గడం లేదు. ముఖ్యంగా.. ఈ వైరస్‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. లాటిన్‌లో కరోనా అంటే కిరీటం అని అర్థం. అయితే.. ఈ వైరస్‌ని మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకారంలోనే ఉంటుంది. దీంతో దానికి ఆ పేరు పెట్టారు.

28 రోజుల్లోనే మరణమా..

కరోనా వైరస్‌కి ఇప్పటి వరకూ ఎలాంటి మందు కనిపెట్టలేకపోవడం దురదృష్టకరం. ఈకారణంగా వ్యాధి సోకిన వారు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా వ్యాధి సోకిన వారిలో వారి రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది. ఈ కారణంగానే వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ముందుగానే ఇది గమనించి చికిత్స తీసుకోకపోతే ప్రాణాలమీదకే వచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో 28 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతారని చెబుతున్నారు నిపుణులు. ఇతర ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అంతకంటే తక్కువ సమయంలోనే మరణానికి చేరువ అవుతున్నారని చెబుతున్నారు.

ఇక కరోనా వైరస్ వస్తే దీనికి ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్స్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ వ్యాధి సోకిన వారికి రోజురోజుకి మరణానికి దగ్గరవుతారని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వారిలో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. దీంతో పాటు ఇప్పటికే వేరే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు త్వరగా ప్రాణాలు కోల్పోతారని చెబుతున్నారు. చాలా మంది 28 రోజుల్లోనే ప్రాణం పోతుందని చెబుతున్నారు. మిగతా ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఇంతకు ముందు ఉన్న ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు అంతకు ముందుగానే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

Plzz..Mark me as the Brainliest...Hope it helps..

Similar questions