Essay on cricket in telugu
Answers
Answer:
అంతర్జాతీయ క్రీడ ఐన క్రికెట్ లో వాడేది కూకాబురా అనే చెక్క తో తయారు చేసిన బ్యాటు, బంతి తో అడతారు.ఈ ఆట రెండు జట్ల మధ్య లేదా రెండూ దేశాల మధ్య జరుగుతుంది . ప్రతి జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు. ఈ ఆట మొదటి సారిగా 14వ శతాబ్దంలో అవిర్భవించింది. ప్రస్తుతం సుమారుగా 100 కు పైగా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు. సాధారణంగా క్రికెట్ ను గడ్డి మైదానాల్లో అడుతారు.మైదానం మధ్యలో 20 మీటర్లు పొడవు కలిగిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చెక్కతో తయారు చేయబదిన వికెట్లు పిచ్ కు రెండు చివర్లలో అమరుస్తారు. ఆట లోని ప్రతి దశను ఒక ఇన్నింగ్స్ అంటారు. ఒక్కో దశలో ఒక జట్టు బ్యాటింగ్ చేస్తూ వీలైనన్ని పరుగులు సాధిస్తారు, మరో జట్టు బౌలింగ్ చేస్తూ తక్కువ పరుగులు సమర్పించడానికి ప్రయత్నిస్తుంది. ఒక ఇన్నింగ్స్ తరువాత మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే విజేత అవుతుంది, లేని పక్షంలో మరో జట్టు విజేత అవుతుంది.
ఒక జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఒక ఆటగాడి ప్రాథమిక నైపుణ్యాన్ని బట్టి ఆటగాణ్ణి బ్యాట్స్ మన్ లేదా బౌలర్ గా వర్గీకరిస్తారు. సాధారణంగా ఒక సమతూకమైన జట్టు 5 లేదా 6 మంది బ్యాట్స్ మన్లు, 4 లేదా 5 మంది బౌలర్లు ఉంటారు. ప్రతి జట్టులో ఇంచుమించు తప్పనిసరిగా ప్రత్యేక వికెట్ కీపర్ ఉంటాడు. ప్రతి జట్టు ఒక సారథి ( కెప్టెన్ ) చేత నడిపించబడుతుంది. జట్టు తీసుకొనవలసిన తార్కిక నిర్ణయాలకు, బ్యాటింగ్ ఆర్డర్ మార్పులకు, ఫీల్డింగ్ అమరికకు, బౌలింగ్ మార్పులకు సారథియే బాధ్యుడు. జట్టులో మొత్తం 11 మంది ఆడుతారు అయితే బ్యాట్టింగ్ మాత్రమే ఆడేవారు కొందరుంటారు, అలాగే బౌలింగ్ మాత్రమే చేసే వారు కొందరుంటారు, అలాగే రెండూ చేయగలిగేవారు కొందరుంటారు. జట్టు బ్యాట్టింగ్ చేసేటప్పుడు ముందుగా జట్టు వివరాలను నాయకుడు (కెప్టెన్) ప్రకటిస్తాడు ఆ ప్రకటించిన వివరాలలో ముందుగా బ్యాట్టింగ్ మాత్రమే ఆడే వారిని ప్రకటిస్తాడు వారినే టాప్ ఆర్డర్ బ్యాట్సమ్యాన్ అంటారు తరువాత వచ్చేవారిని మిడిలార్డర్ అని తరువాతి వారిని టెయిలెండర్లు (బౌలర్లు మాత్రమే ) అని అంటారు.
బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని ఆల్-రౌండర్ గా వ్యవహరిస్తారు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింటిలో సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని వికెట్ కీపర్/బ్యాట్స్ మన్ గా వ్యవహరిస్తారు. కానీ నిజమైన ఆల్-రౌండర్లు అరుదుగా ఉంటారు. ఎక్కువ మంది ఆల్-రౌండర్లు బ్యాటింగ్ లేదా బౌలింగ్ పైన దృష్టి కేంద్రీకరిస్తారు.
అంపైర్లు సవరించు
Answer:
muje telgu nhi aati bruh! Hindi, English,haryanvi atti h b$$