India Languages, asked by Tiny8suwalsssha, 1 year ago

Essay on dr sarvepalli radhakrishnan in telugu

Answers

Answered by kvnmurty
45

    డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన స్వతంత్ర గణతంత్ర భారత్ దేశానికి మొట్టమొదటి ఉపాధ్యక్షుడు.  ఆ తరువాత మన రెండవ అధ్యక్షుడు గా కూడా బాధ్యతలను నిర్వహించారు.  ఆయన బ్రిటిష్ రాణి నుండి ఎంతో ప్రతిష్ఠాకరమైన “నైట్ హుడ్” (knighthood) బిరుదుని, ఇంకా గౌరవ బ్రిటిష్ రోయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ (Royal Order of Merit) ని పొందారు.  మన దేశం ఆయనను అత్యంత గౌరవ ప్రదమైన “భారత రత్న” బిరుదునిచ్చి సత్కరించింది.

   

     డా. రాధాకృష్ణన్ గారు ఆయన జీవితం మనకందరికీ ఒక మంచి ఆదర్శం. ఒక మధ్యతరగతి కుటుంబం లో పుట్టి  గొప్ప విద్యాశిఖరాగ్రలను అధిరోహించారు.  మన దేశం లో పుట్టిన ఆయన లాంటి కొద్ది మంది విద్వాన్ లు , పండితులు, మేధావుల వల్లెనే మన దేశ గౌరవం, మన సంస్కృతి విలువ, మన హిందూ మత సంప్రదాయపు ఉన్నతి  ప్రపంచం లోనూ, ముఖ్యం గా  పాశ్చాత్య దేశాలలోనూ ఎవరెస్టు శిఖరం అంతా ఎత్తున నిలచింది.  సర్వేపల్లివారి హుందాకరమైన చిత్రం (ఫోటో) చూస్తే నే  ఆయన ముఖ తేజస్సు ఆయన పాండిత్యం, కుశాగ్ర బుద్ధి ని తెలియ జేస్తుంది.  ఆ ఫోటోని చూసి ప్రభావితులు కానివారెవ్వరు?

 

     రాధాకృష్ణన్ గారు విద్యార్ధి గా ఉన్నప్పుడు విద్యార్ధి ప్రతిభా ఉపవేతనాన్ని (స్కాలర్ షిప్) పొందేవారు. రాధాకృషన్ మద్రాసులో తన పోస్ట్ గ్రాడ్యుయషన్ ఫిలాసఫీ (తత్వశాస్త్రం, తర్కం, logic, వేదాంతం) లో చేశారు. తన కాలేజీ లో అందరి కన్నా ఎక్కువ ప్రతిభ చూపించారు.  ఆయన రాసిన (హిందూ) మత  వేదాంతం లోని విలువలు (ఎథిక్స్) అనే పరిశోధనాంశాన్ని ఆయన తో పాటు పని చేసే బ్రిటిష్ ప్రొఫెసరులు ఎంతో మెచ్చు కొన్నారు.  ఆ కాలంలో మన దేశం గురించి మన హిందూ మతము గురించి తెల్లవాళ్ళల్లో ఉన్న అపోహలన్నీ తొలగించారు మన గౌరవాన్ని కాపాడారు. 

 

    ఆయన చాలా గొప్ప వేదాంతి, వాక్ప్రతిభ (వాక్పటిమ) కలిగిన వారు, మంచి మనిషి. మరి ఇంకా ఇరవైయ్యవ శతాబ్దంలోని వేద్యావేత్తలలో మేధావులలో ను అంతులేని కీర్తి సాధించారు.  ఆయన భారతదేశానికి పశ్చిమ దేశానికి మధ్యన ఉన్న అపోహలను తొలగించి మంచి అవగాహన ను కలిగించారు.  రాధాకృష్ణన్ గారు రాజకీయాలలో అంతా పాల్గొపోయినా శాంతియుతంగా విద్యాపరంగా ఎంతో సేవ చేశారు.  

    ఆయన చెప్పిన కొన్ని వాక్యాలు చాలా మంచివి. అందరికీ వర్తిస్తాయి.  “నిజమైన సమర్ధవంతమైన మంచి గురువులు ఎవరంటే మనలని ఆలోచింపచేసేవారు, మన ఆలోచనాశక్తిని పెంపొందించే వారు.”  ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో మనం అందరం ఎల్లప్పుడూ కొత్త కొత్త విషయాలను గ్రహించాలని ఇలా చెప్పారు, ”ఎప్పుడైతే మనం మనకు అన్నీ తెలుసునని అనుకొంటామో, అప్పుడే మనం ఇంకా నేర్చుకోవడం మానేస్తాం ".  ఒకసారి అయిన్స్టెయిన్ కూడా “మనకు ప్రపంచం లో తెలిసినది సముద్రం లోని ఒక చుక్క మాత్రమే “ అని. 

 

   “మతం అంటే మన ప్రవర్తన, మనం ఉండే విధానం, అంటే కానీ ఒక నమ్మకం మాత్రమే కాదు. “ అన్నారు. అంటే మతం అంటే గుడికెళ్ళడం, మత సంప్రదాయాలు పాటించడం మాత్రమే కాదు మన నడవడి కూడా మతం  లో భాగమే అని.  “మన లోపలి ఆత్మ మనలను మనం చేసే పనులను వీక్షించే ఒక సాక్షి (మనస్సాక్షి) అని చెప్పారు. కానీ మనం దానిని ప్రక్కకు నెట్టి మన పనులు మనం చేసుకు పోతాం.  “స్కామ్ లు (కుంభకోణం) గురించి ఆయన ఏమన్నారంటే “మనిషే ఒక స్కామ్: అతని లోని స్వార్ధం-కుంభకోణం- మంచి-కీర్తి ఎప్పుడు విరుద్ధంగా కలిసే ఉంటాయి పోరాడుతూనే ఉంటాయి “ అని.

 

     డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టిన తేదీ 5 సెప్టెంబర్ 1888. ఆయన తెలుగు వారి బిడ్డ.  మైసూరు లో విశ్వవిద్యాలయం లో వేదాంతం, తర్కశాస్త్రం బోధించే ప్రోఫెసర్ గా పనిచేశారు.  ఆయన పేరుని ప్రపంచ ప్రసిధ్హి గాంచిన నోబెల్ బహుమతి కోసం ప్రతిపాదన కూడా చేశారు.  బెనారస్ కాశీ విశ్వవిద్యాలయానికి ఉప కులపతి (వైస్ చాన్స్సెలర్) గా కూడా ఉన్నారు.

 

   ఆయన గౌరవార్ధం 5 సెప్టెంబర్ రోజున గురువుల, ఉపాధ్యాయుల రోజు గా భారత దేశం అంతా జరుపుకొంటాం కదా.  మనం కృషి చేసి ఆయన లాగ ఎంతో ఎత్తుకు ఎదగగలం.  ఆయన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి కి చెందిన యునెస్కో విభాగానికి మన దేశంనుండి  రాయబారి గా ఉన్నారు.  మన దేశానికి అంబేద్కర్ గారి తో పాటు రాజ్యాంగాన్ని రచించారు.  పదహారవ ఏట శివకాము అనే దగ్గర బంధువుని పెళ్లిచేసుకొన్నారు.  మన వి వి ఎస్ లక్ష్మణ్ ఆయన సంతతి వాడే.  రాధాకృష్ణన్ గారు “An Idealist view of Life  (జీవితం గురించి ఒక ఆదర్శ వంతుని అభిప్రాయం) అనే పుస్తకాన్ని కూడా రాశారు.  ఆయన ఏప్రిల్ 17, 1975 న కాలం చెందారు.

 

     రాధాకృష్ణన్ గారిని గుర్తు చేసుకోవడం మనలను మనం గౌరవించు కోవడమే.

Attachments:

kvnmurty: clik on thanks. select best abs
Similar questions