India Languages, asked by chandhanapolam5, 2 months ago

essay on farming in telugu

Answers

Answered by swethajanarthanam
1

Answer:

వ్యవసాయం

Explanation:

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి (Agriculture) అంటారు

వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం,సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది. ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే.

చరిత్ర

ఆదిమ మానవులు మొదటగా జంతువుల మాంసం, దుంపలు, కాయలు, పండ్లు మొదలైన వాటిని ఆహారంగా తీసుకునేవారు. కొంత కాలమైన తర్వాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని కొద్ది మొత్తంలో ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు.ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పప్పుదినుసులు మొదలైన ఆహార పదార్థాలు, పశుపోషణ మొదలైన వృత్తులు క్రీపూ 7000 లోనే మధ్యధరా ప్రాంతానికి చెందిన దేశాల్లో బాగా వ్యాప్తి చెంది ఉండేవి. క్రీ.పూ 3000 నాటికి ఈజిప్షియన్లు, మెసపుటేమియన్లు పెద్ద ఎత్తున వ్యవసాయ పద్ధుతులు, ఎరువుల వాడకం, సాగునీటి పద్ధతులు చేపట్టారు.

హరిత విప్లవం

భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ఒక కారణం వ్యవసాయంలో పురాతన పద్ధతులు పాటించడం. వ్యవసాయంలో యాంత్రీకరణం ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పాదకతలను పెంచే నిమిత్తమై మూడో ప్రణాళికా కాలం నుంచే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించడం ఈ ప్రణాళిక యొక్క ముఖ్యోద్దేశం.

భారతదేశంలో వ్యవసాయం

భారతదేశంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు. అవి

ఖరీఫ్ పంట కాలం : జూన్ నెల నుంచి అక్టోబరు వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్క జొన్న, పత్తి,చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరు శనగ.

రబీ పంటకాలం : అక్టోబరు నుంచి మార్చి, ఏప్రిల్ వరకు సాగయ్యే పంటలు - గోధుమ, బార్లీ, మినుములు, ప్రొద్దు తిరుగుడు, ధనియాలు, ఆవాలు మొదలైనవి.

జైద్ పంటకాలం : మార్చి నుంచి జూన్ వరకు సాగయ్యే పంటలు - పుచ్చకాయలు, దోస కాయలు, కూరగాయలు, మొదలైనవి

Similar questions