Essay on friendship in telugu language
Answers
స్నేహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే మంచి అనుభంధం. స్నేహంలో వారి మధ్య ఏ విధమైన కల్మషం, అపార్ధం లెకుండా ప్రేమ, శ్రద్ద, ఆప్యాయతలు కలిగి ఉంటారు. సాధారనంగా ఒకే విధమైన భావాలు, మనోభవాలు, అభిరుచులు ఉన్న వారి మధ్య స్నేహం పుడుతుంది. స్నేహానికి వయసు, లింగము, స్థానం, కులము, మతము అనే ఏ విధమైన భెధాలు ఉండవు. కానీ కొన్నిసార్లు ఆర్ధిక అసమానతలు, లేదా ఇతర భేధాలు స్నేహాన్ని పాడుచేస్తాయి. అందువల నిజమైన స్నేహం ఒకే విధమైన మనసు, స్థాయి కలిగిన వారి మధ్య కలుగుతుందని చెప్పవచును.
లాభ సమయాల్లో కలిసి ఉండే స్నేహితులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కాని నిజమైన, విశ్వాసనీయమైన స్నేహితులు మాత్రమే కష్ట సమయాల్లోను, శ్రమల్లోను మనతో కలిసి ఉంటారు. మన కష్ట సమయాలు మంచి స్నేహితులు ఎవరో చెడ్డ స్నేహితులు ఎవరో తెలుసుకునేల చేస్తాయి. సహజంగా ప్రతీ ఒక్కరికి ధనం వైపు వ్యామోహం ఉంటుంది కాని నిజమైన స్నేహితులు మనల్ని ఎప్పుడూ అవసారాల్లో వదిలిపెట్టి వెల్లిపోరు. అయినప్పటికి స్నేహితుల వద్దనుండి డబ్బును వడ్డీకి తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం అనేది కొన్నిసార్లు స్నేహాన్ని ప్రమ్మదంలో పడేస్తుంది. ఇతరుల వల్ల గానీ లేదా మన వల్ల గానీ ఎప్పుడైనా ప్రభావం చెందవచ్చు కాబట్టి స్నేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
కొన్ని సార్లు స్వీయ గౌరవం, అహంకారం వంటి వాటివల్ల స్నేహం విడిపోవచ్చును. నిజమైన స్నేహానికి సరిగా అర్ధం చేసుకోవడం, సంత్రుప్తి, సహాయ స్వభావం, నమ్మకం అవసరం. నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ మంచిపనులు చేయడానికి ఒకరిని ఒకరు ఉరిగొల్పుకుంటారు. కానీ కొంతమంది స్నేహితులు ఒకరిని ఒకరు చెడ్డపనులు చేయడానికి ఉపయోగించుకుంటూ స్నేహానికి చెడ్డపేరును తీసుకొస్తున్నారు. కొంతమంది అవసరాన్ని బట్టి వీలైనంత త్వరగా కలిసిపోతూ, విడిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో మంచి స్నేహితులను వెదకడం అనేది చాలా కష్టం. ఎవరైనా మంచి నిజమైన స్నేహితుడిని కలిగి ఉంటే వారి కంటే అద్రుష్టవంతులు మరెవరూ ఉండరు.
మంచి స్నేహితులు కష్ట సమయాల్లో సహాయపదతారు అన్నదానిలో ఏ విధమైన సందేహం లేదు. నిజమైన స్నేహితులు మన జీవితాల్లో అత్యంత గొప్ప ఆస్తులు.
Answer:
benrrnkktndjhbevfrhhrhrhhrrhhrgeh