India Languages, asked by maanyathasirra08, 1 year ago

Essay on how library is useful for students in telugu .​

Answers

Answered by rajdutta426
4

Explanation:

ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయము అని అంటారు. తెలుగులో గ్రంథాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి గ్రంథాలయ పితామహుడు అనే పేరు పొందినవాడు అయ్యంకి వెంకట రమణయ్య. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.

అత్యంత ప్రాచీన గ్రంథాలయం

జాతీయ గ్రంథాలయాలు

ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయాలు

తెలంగాణాలో గ్రంథాలయాలు

అంతర్జాల గ్రంథాలయము

ఇవి కూడా చూడండి

Answered by Csv1121
3

దేవుళ్ళను పూజించే చోటు ఆలయం. ఆలయం పవిత్రమైన చోటు. గ్రంథాలయం కూడా పవిత్రమైనది. అక్కడ గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలలో ఎంతో నిగూఢమైన జ్ఞానం దాచి ఉంటుంది. గ్రంథాలయాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

గ్రంథాలయాలలో ప్రతి ఒక్కరు గ్రంథాలను చదవి తమ జ్ఞానాన్నిపెంపొందించుకోవచ్చు. మన ముందు తరాలవారు తమ జ్ఞానం తమతోనే ఆగిపోకుండా ఉండటానికి గ్రంథాలు రచించారు. జ్ఞానం మనకు ఎన్నో విధాలుగా మనకి ఉపయోగపడతుంది. మన జీవితంలో ఉన్న పరిసస్థితులను ఎలా ఎదుర్కోవాలో మనకు నేర్పిస్తుంది. జ్ఞానం మనకు మార్గదర్శనం చేస్తుంది.

గ్రంథాలయాలు అందరిని గ్రంధాలను చదవమని ప్రోత్సహిస్తుంది. పేదవారికి ఎంతో సహాయం చేస్తుంది. ధనవంతులు అన్ని గ్రంధాలు కొనుక్కోరు కనుక గ్రంథాలయలు వారికి కూడా సహాయపడుతుంది. జాతి కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు గ్రంథాలను చదువుకోవచ్చు.

చదవడమనే అనే మంచి లక్షణాన్ని అలవర్చుకోవటానికి సహాయపడతుంది. ఏ రోజు పుస్తకం మనల్ని చెడు మాట్లాడమని గాని చెడు చూడమని గాని చెడు వినమని గాని చెడు చేయమని గాని పుస్తకం మనల్ని ప్రోత్సహించదు. పుస్తకం మనకు మంచి స్నేహితుడు. చిరిగిపోయిన చొక్కానైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోమని పెద్దలు అందుకే అన్నారు.

గ్రంథాలు చరిత్ర యొక్క భాగాలు. వాటి ద్వారా పూర్వంలో జరిగిన సంఘటలను తెలుసుకోవచ్చు. ఈనాటికి ఆనాటికి జరిగిన మార్పులను గ్రంథాలను చదవడం ద్వారా తెలుసుకోవచ్చు

Similar questions