India Languages, asked by BrainlyGood, 1 year ago

Essay on importance of rivers in telugu
నదుల ప్రాముఖ్యత

Answers

Answered by kvnmurty
342

                         నదుల ప్రాముఖ్యత  (Importance of Rivers)

 

     నదులు  మన జీవనధారలు. ఒక ప్రాంతంలోని నది ఆ ప్రాంతపు ప్రజలకు గుర్తింపు, గౌరవం.  ప్రపంచం లో మనుషులతో సహా సకల ప్రాణులు నదుల దయ వల్లనే అందరూ  బ్రతుకుతున్నారు.  సంవత్సర కాలం అంతా నీరుండే నదులని జీవ నదులంటారు, గంగ, గోదావరి లాగ అన్నమాట. చిన్న నదులు వర్షాకాలంలోను శీతాకాలం లోనూ మాత్రమే ప్రవహిస్తాయి.

 

    ఎత్తైన కొండల ప్రాంతాలలోంచి వర్షపు నీరు ప్రహహించి నదిగా మారుతుంది. చాలా వేగంగా పారుతుంది. ప్రహహించే దారిలో చిన్నచిన్న పాయలు గా నీరు వచ్చి చేరడంతో నది ప్రహహించే కొద్దీ పెద్దది గాను, వెడల్పు గాను మారుతుంది. సముద్రంలో కలిసే ముందర “డెల్టా” ప్రాంతంలో చాలా విశాలంగా ఉండి నెమ్మదిగా ప్రవహిస్తుంది. భూమి తుర్పు నుండి పడమటికి తిరుగుతుంది కనుక ఆ ప్రభావం తో చాలా నదులు తూర్పు వైపు ప్రవహిస్తాయి.  చాలా తక్కువ  నదులు మాత్రం తూర్పునుండి పడమటికి ప్రవహిస్తున్నాయి.

 

     నదిలోని నీరు దాహం తీర్చడానికి పనికొస్తుంది. మన పట్టణాలలో మునిసిపల్ వారు సరఫరా చేసే నీరు చాలా వరకు నదులనుండే వస్తాయి. నదులలో నీరు సముద్రంలోలా ఉప్పగా కాకుండా తీయగా ఉంటాయి. కానీ దారిలోని మట్టి ఇతర మలినాలు ఉండడంతో వాటిని శుభ్రం చేసుకొని, (ఫిల్టర్ లో) వడబోసుకొని గాని మరగ బెట్టి గాని త్రాగాలి.  నదులలో నీరు వ్యవసాయం చేయడానికి, మొక్కలకి, పైరులకి నీరు సరఫరా చేయడానికి రైతులు వాడతారు.

 

   క్రీస్తు పూర్వకాలం నుండి కూడా మనుషులు ఎల్ల్పపుడు నదులకు దగ్గరగానే నివాసాలు ఏర్పరచుకొన్నారు. ప్రాచీన సంస్కృతులు అన్నీ (మొహంజొదారో, హరప్పా, సింధు) అలాగే ఏర్పడ్డాయి.  నదులు ప్రవహించిన ప్రాంతాలు , ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు ఎంతో సారవంతం గా ఉంటాయి.

 

   ప్రపంచం లో “ఇకో సిస్టమ్ (ecosystem)” లో నదులు ఒక భాగం. నదులలో నీరు సూర్యుని వేడిమికి ఆవిరయ్యి ఆకాశంలో మేఘాలుగాను, గాలిలో తేమ గాను మారుతుంది.  చుట్టుప్రక్కల ప్రదేశాలన్నీ చల్లగా ఉంటాయి. ఎన్నో జంతువులు, పక్షులు నదీతీరానికి దగ్గరగా ఉంటాయి. వలసపక్షులు ఎన్నో నది తీరాలకు, నదీ జలాశయ ప్రాంతాలకే వస్తుంటాయి.

 

   నదీ ప్రవాహంలోని వేగాన్ని అందులోని శక్తిని ఎత్తైన జలపాతాల దగ్గర విద్యుత్తుగా మారుస్తారు. నదులలో పడవలలో బెస్తలు చేపలు పడతారు. నదులు ఎన్నో జీవరాశులకు నివాసం. నదీ మార్గాల ద్వారా సరుకుల రవాణా కూడా సాగుతుంది.  చాలా గ్రామాలకు నదిమధ్యంలోని లంకలకు నదీ మార్గమే దారి.  నదుల మధ్యలో కట్టిన బాక్రానంగల్, నాగార్జునసాగర్ లాంటి ఆనకట్టలు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. విహారయాత్రల స్థలాలుగాను, బొటానికల్ (అనేక వివిధ రకాల మొక్కలకు సంబంధించిన తోట)  గార్డెన్ గాను ఎంతో మేలు చేస్తున్నాయి.

 

   నదీ ప్రాంతంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిశాయి. ఉదాహరణకు కాశీ, బదరి, హరిద్వార్, ప్రయాగ (అలహాబాదు), రాజమహేంద్రవరం, భద్రాచలం, నాసిక్, విజయవాడ ఇలా ఎన్నో.  మన హిందూ పురాణాలలో నదులన్నీ దేవతలుగా పరిగణింపబడతాయి.  కవులెందరో నదుల గురించి, నడిప్రాంతపు పల్లెలలోని ప్రజల కవితలు, వ్యాసాలు, విలాపాలు, కధలు ఇలా ఎన్నో వ్రాసారు. నదిలో స్నానం ఎంతో పవిత్రమైనది గా హిందువులు భావిస్తారు.  నది ప్రాంతంలో పండ్లు, కాయలు, వ్యవసాయపు పంటలు చవకగాను రుచి గాను ఉంటాయి.

 

   ఇలాంటి నదులను మనం కాపాడుకోవాలి. కానీ ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఉత్తరంలోనో దక్షిణంలోనో వరదల మూలంగా ఇళ్లకు, గ్రామాలకు, ఆస్తులకు, పజా జీవనానికి, వ్యవసాయ భూములకి ఎన్నో నష్టాలు కలుగుతున్నాయి. వీటిని అపగలగాలి. ఇంకా నదుల ఉపయోగాలు తగ్గకుండా ఉండాలంటే వాటిలో వ్యర్ధ పదార్ధాలు విసిరి మలినం చేయకూడదు.  నదుల దగ్గర మల మూత్ర విసర్జనము చేయరాదు.

Answered by rajprasad80
8

Answer:

ok na

Explanation:

please mark me as brainlist

Attachments:
Similar questions