Essay on jatheeya pathakam in telugu fir grade5
Answers
Answered by
1
Answer:
mark as brain list
Explanation:
భారత జాతీయపతాకం ప్రస్తుతమున్న రూపంలో 1947 జూలై 22వ తేదీన జరిగిన రాజ్యాంగసభ ప్రత్యేక సమావేశంలో ఆమోదించబడింది. మన దేశంలో త్రివర్ణపతాకమంటే జాతీయపతాకమే. దీంట్లో పైనుంచి కిందకు అడ్డపట్టీలవలె వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. మధ్యభాగంలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో అశోకచక్రం ఉంటుంది. ఈ చక్రం నమూనాను సారనాథ్ లోని అశోకస్థంభం నుంచి తీసుకున్నారు. దీని వ్యాసం తెలుపు రంగు పట్టీ యొక్క ఎత్తులో నాలుగింట మూడొంతులు. జెండా ఎత్తు, వెడల్పుల నిష్పత్తి 2:3. ఇది భారత సైన్యం యొక్క యుద్ధపతాకం కూడా.
భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది ఆంధ్రుడైన పింగళి వెంకయ్య. జాతీయపతాకాన్ని ఖాదీ బట్టతో మాత్రమే చేయాలని జాతీయపతాక నిబంధనలు తెలియజేస్తున్నాయి. పతాకావిష్కరణ, వాడకాల గురించి కచ్చితమైన నియమావళి]] అమల్లో ఉంది.
Similar questions