Essay on mahatma gandhi in telugu
Answers
మహాత్మాగాంధీ గారు మన దేశ జాతి పిత. ఎంతోమంది గొప్పగొప్ప వాళ్ళు పుట్టిన ఇరవైయవ శతాబ్దానికే మహా మనిషిగా ప్రపంచ ప్రజలందరూ ఎన్నుకొన్న అవతార పురుషుడు.
మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ గారు గుజరాత్ లో పోరుబందరు లో 1869(౧౮౬౯) లో అక్టోబర్ 2(౨) న జన్మించారు. ఒక సాధారణమైన జీవితాన్ని గడిపారు. ఆయన అంతా తెలివైన విద్యార్థి కాదు. పదహారేళ్లకే పెళ్ళిచేసికొన్నారు. తరవాత ఇంగ్లండు లో బారిస్టరు (లాయరు) చదువుకొన్నారు. తరువాత బొంబాయిలోను, దక్షిణ ఆఫ్రికా లోనూ ఒక (లా) న్యాయశాస్త్ర సంబంధమైన సంస్థలో ఉద్యోగం చేశారు.
ఆయన జీవితచరిత్ర పేజీలు ఊరికే చదవి , ఓహో, అనుకొని రేపు మరిచిపోడానికి కాదు ఇవన్నీ మనం గుర్తు చేసుకొనేది. ఆయన నమ్మిన ఆదర్శాలకోసం, అవి సాధించడానికి ఆయన చేసిన కృషి గురించి తెలుసుకొని మనం కూడా అలాంటి కృషి చేసి మనపేరు, మన కుటుంబం పేరు, జాతి పేరు, దేశంపేరు చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించబడేలా చేసుకోవాలి. అందుకు మనం ఆయన గురించి తెలుసుకొందాం.
దక్షిణాఫ్రికాలో ఆయనను తెల్ల టికెట్టు కలెక్టర్ అవమానించి రైలుబండి నుంచి దింపేసిన సంఘటన భారత దేశానికి ఎంతోమేలు చేసింది. భారత దేశం చేసిన స్వతంత్రపోరాటం మాదిరిగా అనేక దేశాలు అనుకరించి స్వతంత్రాన్ని పొందాయి. మన రూపాయి నోటు పై ఆయన చిత్రం ప్రచురించడం ఒకటే కాదు. మనం చేసే పనులలో గాంధీయతను అనుకరించి ఆయన కలలు కన్న దేశాన్ని తయారు చేయడమే మనం చేయాల్సింది.
గాంధీగారంటే స్వచ్ఛత, ఆత్మనిర్భరత, ధైర్యం, సర్వ మతసమానత్వం, శాంతి, మానవతావాదం,వీటన్నిటికీ ఒక ప్రతీక. బాపూజీ ఒక ఆదర్శ జీవి. గొప్పసిద్ధాంతి. సత్యం, న్యాయం, మానవత,అహింసల కోసం పోరాడిన వీరుడు. బ్రిటిష్ వారి తుపాకి గుళ్ళ కెదురుగా తన గుండెనేకాక నిరాధుయులైన లక్షలాది గుండెలను నడిపించిన ధీరుడు. తన మాటలతో, తన తెలివితేటలతో,చేష్టలతో తెల్లవాళ్లను తికమక పెట్టి వాళ్ళని వెనక్కు పంపించిన ప్రజ్ఞాశాలి.
విద్యావిధానం విద్యార్ధుల రూపకల్పనా శక్తి పెంపొందించెలా ఉండాలని, ప్రాక్టికల్ గా ప్రయోగాలు చేస్తూ, బొమ్మలతో, పరికరాలతో, చిత్రాలతో ఆలోచనలను వాస్తవంగా మలచి స్వయంగా నేర్పరితనాన్ని , కళా నైపుణ్యాన్ని వృద్ధి చేసుకొనేలా ఉండాలని ఆయన కోరుకొన్నారు. పరిపూర్ణ విద్య అంటే మంచి గుణం, క్రమశిక్షణ, మన దేశ సంప్రదాయం లోని మంచిని నేర్పుతూ సమాజానికి పనికొచ్చేలా ఆదర్శ పౌరుడు గా తీర్చి దిద్దాలని ఆయన ఉద్దేశ్యం.
పల్లెటూళ్లలోని ప్రజలందరూ శుచి, శుభ్రత నేర్చుకోవాలని, ఆరోగ్య సూత్రాలు తెలుసుకొని వాటిని పాటించాలని, బీద ప్రజలు అందరూ ఆనందం గా జీవితం గడపాలని గాంధీగారి కోరిక. అందుకనే కదా నరేంద్ర మోడి గారు స్వచ్ఛతా ఉద్యమం మొదలుపెట్టారు.
గాంధీగారు ఒకసారి ప్రభుత్వ కార్యాలలో సామాన్య ప్రజలకు ఆదరణ సరిగా లేక, ప్రజలిబ్బందులు పడుతుంటే ఆయన ప్రభుత్వోద్యోగులకు ఇలా మంచి గుణపాఠం చెప్పారు. ప్రజలు ప్రభుత్వాసంస్థ కు వినియోగదారులు. వినియోగదారులు పన పనికి అడ్డు కాదు. వారే మన పని. ప్రజలను గౌరవంగా ఆదరించి వారి పని చేయాలి. ప్రజలపైననే ప్రభుత్వం ఆధారపడి ఉంది.
ఇంకొక మంచి మాట. చెప్పేటందుకే నీతులున్నాయి. పాటించేందుకు కాదు అని ఉండే ఎంతోమంది మోసగాళ్లకు, గాంధీగారు చెప్పిన మాట “నీతులు ఆదర్శాలు చెప్పే ముందర అవి పాటించి చూడు అని. ప్రపంచం లో ఏదైనా మంచి చూడాలనుకొంటే , ఏదైనా జరగాలని అనుకొంటే, ముందర ఆ మంచి నువ్వే అవ్వాలి. ఆ మార్పు నువ్వే అయ్యి, వెలుగు లోకి తేవాలి. అప్పుడు ఆ మార్పు ఆచరణ లోకి వస్తుంది. ఇది మనం అందరం గుర్తుంచుకోవలసిన మాట, వేదవాక్కు. మనం ఆయన చెప్పిన మాటలనుకరించడం, శాంతియుతంగా, వినయం, విజ్ఞ్యత తో దేశాన్ని ఉన్నతి, వృద్ధి లోకి తీసుకెళ్ళడం మన కర్తవ్యం. మనం మన ఆదర్శాలను మన కుటుంబ వ్యక్తులతో పంచుకొని మనకి వారికి మేలు కలిగేలా చేసుకోవడం ఈనాటి మన కర్తవ్యం.