World Languages, asked by sreeja889900, 5 months ago

Essay on parrot in Telugu

Answers

Answered by Anonymous
12

Explanation:

రామచిలుక ఎంతో అందమైన పక్షి . ఆకుపచ్చని చిలుకలు ఎన్నో మనం రోజూ చూస్తుంటాం . బలే చక్కగా ఉంటాయి కదూ . వాటిని చూడగానే మన మనస్సు లోని కలకలం అంతా ఎగిరిపోతుంది . ముఖ్యంగా చిన్నపిల్లలకు రామచిలుకలు ఎంతో నచ్చుతాయి . కొన్ని రామచిలుకలు ఎర్రరంగు , ఆకుపచ్చ రంగులు కలిసి ఉంటాయి . కొన్ని బూడిద రంగు , నీలం , పసుపు రంగుల్లో కూడా కనిపిస్తాయి . కొన్నిటికి తలపైన కిరీటం లాగా కూడా ఉంటుంది . రామచిలకలు ఎంతో తెలివైన పక్షులు . మన మాటలని , రకరకాల శబ్దాలని అనుకరిస్తాయి . చిలుకల కిలకిలారావాలు , కిచ్ కిచ్ లు వినసొంపుగా ఉంటాయి . చిలుకలని ఎంతోమంది చిన్న చిన్న మందిరాలలో పెట్టి తమ ఇండ్లలో పెంచుకొంటారు . చిలకలు పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు బ్రతుకుతాయి . ఆఫ్రికా ఖండంలో అయితే పెద్ద పెద్ద చిలుకలుంటాయి .

రామచిలుకలు చాల వేగం గా ఎగురుతాయి . కానీ చాలా ఎక్కువ ఎత్తుకి ఎగరలేవు . మామిడిపండ్లు , జామ పండ్లు , అన్నం , పప్పులు , బియ్యం , జీడిమామిడి పండ్లు , ఆకులు రేగు పండ్లు , వాటి అన్నిటిలోని గింజలు ఇష్టం గా తింటాయి . చిలుకలని మనం పెంపుడు పక్షుల దుకాణం లో కొనవచ్చు . రామచిలుకలు చెట్ల తొర్రల్లో , కొమ్మల మధ్యలో గూడు కట్టుకొని నివాసం ఉంటాయి . అందులో గుడ్లు పెట్టి అవి పొదిగి పెద్దవైయ్యెదాకా వాటిని రక్షించి ఆ తరవాత వాటిని ఆకాశం లో కి ఎగరడం నేర్పుతాయి . గుంపు గుంపులు గా ఎగురుతాయి కూడా . ప్రపంచం లో మూడు వందల రకాల పైగా చిలుకలున్నాయి . చిలుకా గోరింకా జంటల గురించి కవులు పాటల్లో ఎంతో చక్కగా రాస్తారు . చూడ చక్కనైన జంటని చిలుక గోరింక లతో పోలుస్తారు కదా .

మన అందరి వినోదం కోసం రామచిలుకలని సర్కస్ లో ఆట పాటలలో శిక్షణ ఇచ్చి ప్రదర్శన చేయిస్తారు . జూ లో పెంచుతారు కూడా , చూసారా ఎపుడైనా ? అవి సైకిలు తొక్కి , పల్టీలు కొట్టి బలే తమాషా చేస్తాయి . కొన్ని రామచిలుకలు వందల శబ్దాలు గుర్తుంచుకోగలవు . ఆఫ్రికా లోని అమెజాన్ ప్రాంతం లో ని చిలుకలు మంచి తెలివి , జ్ఞ్యాపక శక్తి కలవి .

Similar questions