India Languages, asked by man2raogmmain, 1 year ago

Essay on parrot in telugu language

Answers

Answered by ankitasharma
378
చిలుక ఒక చాలా రంగురంగుల అందమైన పక్షి. ఇది ఎరుపు వక్ర ముక్కుతో మరియు నాలుగు వేళ్ళు ముగుస్తుందని బలమైన కాళ్లు కలిగి ఉంది. దాని ఈకలు ఆకుపచ్చ ఉన్నాయి. చిలుకలు కొన్ని ఎగువన ఎరుపు ఈకలు కలిగి. ఇది మెడ చుట్టూ ఒక బ్లాక్ రింగ్ ఉంది. ఇది చెట్ల హాలోస్ లో నివసిస్తున్నారు. ఇది గూడు ఆధారమై మరియు అది దాని గుడ్లు కూడా సూచిస్తుంది. ఇది చాలా ధాన్యాలు, పండ్లు, ఆకులు, విత్తనాలు మరియు ఉడికించిన అన్నం తింటుంది. ఇది వంటి మామిడి కాయలు, బేరి పండ్లు ఇష్టం, etc.It చాలా వేగంగా ఎగురుతూ మరియు తరచుగా మందలు లో ఎగురుతూ. చిలుక ఒక తెలివైన పక్షి. ఇది మానవ స్వరాన్ని అనుకరిస్తూ సామర్థ్యం ఉంది. చాలా మంది అద్భుతమైన పనులను చిలుకలు శిక్షణ.
Answered by kvnmurty
150

      రామచిలుక  ఎంతో అందమైన పక్షి.  ఆకుపచ్చని చిలుకలు ఎన్నో మనం రోజూ చూస్తుంటాం. బలే చక్కగా ఉంటాయి కదూ. వాటిని చూడగానే మన మనస్సు లోని కలకలం అంతా ఎగిరిపోతుంది.  ముఖ్యంగా చిన్నపిల్లలకు రామచిలుకలు ఎంతో నచ్చుతాయి. 

 

   కొన్ని రామచిలుకలు ఎర్రరంగు, ఆకుపచ్చ రంగులు కలిసి ఉంటాయి. కొన్ని బూడిద రంగు, నీలం,పసుపు రంగుల్లోకూడా కనిపిస్తాయి. కొన్నిటికి తలపైన కిరీటం లాగా కూడా ఉంటుంది.  రామచిలకలు ఎంతో తెలివైన పక్షులు.  మన మాటలని, రకరకాల శబ్దాలని అనుకరిస్తాయి.  చిలుకల కిలకిలారావాలు, కిచ్ కిచ్ లు వినసొంపుగా ఉంటాయి.  చిలుకలని ఎంతోమంది చిన్న చిన్న మందిరాలలో పెట్టి తమ ఇండ్లలో పెంచుకొంటారు.  చిలకలు  పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు బ్రతుకుతాయి.  ఆఫ్రికా ఖండంలో అయితే పెద్ద పెద్ద చిలుకలుంటాయి.

 

   రామచిలుకలు చాలవేగం గా ఎగురుతాయి. కానీ చాలా ఎక్కువ ఎత్తుకి ఎగరలేవు.  మామిడిపండ్లు, జామ పండ్లు, అన్నం, పప్పులు, బియ్యం, జీడిమామిడి పండ్లు , ఆకులు రేగు పండ్లు , వాటి అన్నిటిలోని గింజలు ఇష్టం గా తింటాయి. చిలుకలని మనం పెంపుడు పక్షుల దుకాణం లో కొనవచ్చు. 

    
రామచిలుకలు చెట్ల తొర్రల్లో, కొమ్మల మధ్యలో గూడు కట్టుకొని నివాసం ఉంటాయి.  అందులో గుడ్లు పెట్టి అవి పొదిగి పెద్దవైయ్యెదాకా వాటిని రక్షించి  ఆ తరవాత వాటిని ఆకాశం లో కి ఎగరడం నేర్పుతాయి. గుంపు గుంపులు గా ఎగురుతాయి కూడా. ప్రపంచం లో మూడు వందల రకాల పైగా చిలుకలున్నాయి. చిలుకా గోరింకా జంటల గురించి కవులు పాటల్లో ఎంతో చక్కగా రాస్తారు. చూడ చక్కనైన జంటని చిలుక గోరింక లతో పోలుస్తారు కదా.

 

   మన అందరి వినోదం కోసం రామచిలుకలని సర్కస్ లో ఆట పాటలలో శిక్షణ ఇచ్చి ప్రదర్శన చేయిస్తారు.  జూ లో పెంచుతారు కూడా, చూసారా ఎపుడైనా ? అవి సైకిలు తొక్కి , పల్టీలు కొట్టి బలే తమాషా చేస్తాయి.  కొన్ని రామచిలుకలు వందల శబ్దాలు గుర్తుంచుకోగలవు.  ఆఫ్రికా లోని అమెజాన్  ప్రాంతం లో ని చిలుకలు మంచి తెలివి, జ్ఞ్యాపక శక్తి కలవి.

 

    పక్షులను సంరక్షించడం మన ధర్మం. అది గుర్తుంచుకొందాం.
Similar questions