India Languages, asked by Taamanaswatrachiru, 1 year ago

Essay on paryavarana parirakshana in telugu

Answers

Answered by sureshb
906

పర్యావరనం దేవుడు ఇచ్చిన ఒక గ్గొప్ప అందమైన సృష్టి. పర్యావరనం మనిషి ఆనందంగా ఆహ్లాదంగా జీవించడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ గాలి, నీరు, నేల, వెలుతురు, అడవులు మొదలగునవి మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తాయి. ఈ సృష్టిలో భూమి మాత్రమే జీవానికి కావలసిన వాతావరనం కలిగి ఉన్నదని భావిస్తారు. చక్కని పర్యావరనం లేకుండా ఇక్కడ జీవితం ఎలా ఉంటుందొ మనం అంచనా వేయలేము కాబట్టి పర్యావరనాన్ని కాపాడడం ఎంతో అవసరం. మనం పర్యావరనాన్ని శుభ్రంగా, సురక్షితంగా ఉంచాలి. పర్యావరనాన్ని కాపాడవలసిన భాధ్యత భూమి మీద నివసిస్తున్న ప్రతీ మనిషి మీద ఉన్నధి. ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి పర్యావరనాన్ని కాపాడేలా ఉద్యమాలు చేపట్టాలి.

మనిషి సృస్టించే రక రకాల సాంకేతిక పరికరాల ద్వారా వాతావరనం ప్రతీ రోజూ క్షీనిస్తూ వస్తున్నది. అందువలన వాతావరన కాలుష్యం అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. అంతే కాకుండా వాతావరన కాలుష్యం మనిషి ఆరొగ్యాన్ని కూడా దెబ్బ తీస్తున్నది. రేడియో, టివి మరియు సెల్ టవర్ల నుండి విడుదలయ్యే రేడియో కిరణాలు జీవన మనుగడను దెబ్బతీస్తున్నయి. అనేక పక్షులు ఏటా రేడియేషన్ ద్వారా చనిపోతున్నయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వాహనాలు, ఫ్యాక్టరీలు, అనేక పరిశ్రమల నుండి వెలువడే వ్యర్ధ పదార్ధాల ద్వారా నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. ఫ్యాక్టరీలు, పరిశ్రమల నుండి విడుదల అయ్యే వ్యర్ధపదర్ధాలు నదులలో వదలడం వల్ల జలచరాలు రోజు రోజు క్షీనితున్నాయి. ఇంకా పంట పొలాలకు కలుషిత నీరు ఇవ్వడం ద్వారా ఆహార సంపద, నాన్యత తగ్గుతూ వస్తున్నది. ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల అవి నేలను, నీరును కలుషతం చేస్తున్నయి. వివ్ధ రకాల రసాయనాలు ఆహారం ద్వారా శరీరంలో పేరుకుపోతున్నాయి.

రోడ్లు, భవనాలు విస్తరించుట వల్ల వర్షపు నీరు భూమిలోనికి ఇంకటంలేదు. దాని ద్వారా భూగర్భ జలాలు తుగ్గుతున్నాయి. చెట్లను వివిధ కారణాల మూలంగా నరికివేయడం ఓజోన్ పొర క్షీనించడానికి కారణమవుతున్నది.

ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్తులో మానవ మనుగడ భూమి మీద ఎలా ఉండనున్నదో మనం అంచనా వేయలెము. అందువలన పర్యావరనాన్ని కాపాడడమే దీనికి పరిష్కార మార్గము. పర్యావరనాన్ని అవసరమున్నంతవరకు సద్వినియోగం చేసుకుంటూ కాపాడుకోవడమే సరైన పరిష్కారం. వ్యాపార, పారిశ్రామిక వేత్తలు స్వార్ధపరంగా ఆలోచించకుండా పర్యావరనాన్ని పరిరక్షించే కార్యక్రమాలు చేపట్టాలి. సాద్యమైనంత తక్కువ నీటిని వాడడం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం, పంటలకు కృత్రిమ రసాయనాలు వినియోగించకుండా సహజ ఎరువులు వినియోగించడం, చెట్లను నాటడం మొదలగు వాటి ద్వారా పర్యావరనాన్ని కాపాడవచ్చును. పర్యావరన పరిరక్షనే మానవ మనుగడకు మంచి మార్గం అని అందరూ తెలుసుకోవాలి.

Answered by umavaishnavi09
62

here is your answer

about paryavarana parirakshana

Attachments:
Similar questions