Essay on republic day of india in telugu
Answers
మనమందరం ప్రతి సంవత్సరం జనవరి 26(౨౬) న భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకొంటాం. ప్రొద్దున్నే లేచి తయారయి బడిలో కళాశాల లో ఆఫీసుల్లో పేరేడు జరిగేస్థలాలలో జరిగే జెండా వందన కార్యక్రమానికి హాజరు అవుతాం. ఎందుకంటే 1950 (౧౯౫౦) యవ సంవత్సరంలో జనవరి 26 నుండి హిందూదేశం ఒక స్వతంత్ర గణతంత్ర దేశంగా మారింది. మన దేశ చట్టం, దేశ పరిపాలన జరిగే విధానం, ఇంకా పాలనకి కావలసిన వన్నీ ఆ రోజుకి సమకూరేయన్నమాట. డాక్టర్ అంబేత్కర్ గారి అధ్యక్షతలో చట్టం రూపొందింది. ఆరోజునుండి డాక్టర్ రాజేంద్రప్రసాదు గారు భారత్ తొలిఅధ్యక్షుడు గా పదవీబాధ్యతలను స్వేకరించారు.
గణతంత్ర దినోత్సవం రోజున న్యూఢిల్లీ లో, ప్రతి రాష్ట్ర రాజధానిలో, జిల్లారాజధానిలో జాతీయ గీతాలాపన, జెండా వందనం, సైనికుల కవాతు బహు చూడచక్కదనం గా జరుగుతాయి. పిల్లలు, పెద్దలు ఆ కవాతు తరవాత మన దేశ సంస్కృతులు , ఆట పాటలు ప్రదర్శిస్తూ మనల్ని అలరిస్తారు. మన సైనిక , వైమానిక, నావికా దళాలని వాటి శక్తి సామర్ధ్యాలని ప్రదర్శిస్తారు. ప్రభుత్వ రంగాలసంస్థలు కూడా తమ సృజనశక్తి జోడించి రకరకాలుగా ఆ సంవత్సరంలో వారు చేసిన పనిగురించి , ప్రజలకి ఒక సందేశం అందిస్తూ వాహనాలను వాటిపైన సన్నివేశాలను చూపిస్తారు.
ఆ తరవాత సైనికులకు, రక్షకభటులకు (పోలీసులకు) వారి విశిష్ట సేవలకు పతకాలను అందిస్తారు. దేశంలోని ప్రసిద్ధి చెందిన వారికి, వివిధ రంగాలలో సేవలందించినవారికి పద్మ, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలని ప్రకటిస్తారు. చిన్న పిల్లలకు వారి ధైర్యసాహసాలకు మెచ్చి పతకాలను కూడా ఇస్తారు. అమర వీరులైన మన జవాన్లకు వందనం ఆర్పిస్తారు.
మన దేశపు త్రివర్ణ జెండాలు గాలిలో రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది కదా. ఈ రోజుకోసం బడులన్నీ శుభ్రపరచి అందంగా తీర్చి దిద్దుతారు. రోడ్లన్ని శుభ్రపరుస్తారు. బడులలో గణతంత్ర దినం కోసం ఎన్నో పోటీలు కూడా జరుపుతారు. దేశం లో అందరికీ ఈ రోజు తప్పక సెలవు ఉంటుంది. చక్కగా సంతోషంగా కుటుంబంతో కాలం గడుపుతారు అందరూ.
ఈరోజు సందర్భాన్ని చేసుకొని మన అధ్యక్షుడు దేశ ప్రజలందరిని ఉద్దేశ్యించి రేడియో,టెలివిజన్లలో ప్రసంగిస్తారు. మనం మన దేశ స్వాతంత్ర్యం కోసంపోరాడిన వారందరినీ గుర్తు చేసుకొని, ఇంక పురోభివృద్ధి కోసం మనం ఇంకేమి చేయాలో నిర్ణయించుకొని ముందుకు సాగుదాం.
కలసి పాడుదాం తెనుగు పాట, కలసి సాగుదాం వెలుగు బాట !
Answer:
Explanation:
మనమందరం ప్రతి సంవత్సరం జనవరి 26(౨౬) న భారతదేశ గణతంత్రదినోత్సవం జరుపుకొంటాం. ప్రొద్దున్నే లేచి తయారయి బడిలో కళాశాల లో ఆఫీసుల్లో పేరేడు జరిగేస్థలాలలో జరిగే జెండా వందన కార్యక్రమానికి హాజరు అవుతాం. ఎందుకంటే 1950 (౧౯౫౦) యవ సంవత్సరంలో జనవరి 26 నుండి హిందూదేశం ఒక స్వతంత్ర గణతంత్ర దేశంగా మారింది. మన దేశ చట్టం, దేశ పరిపాలన జరిగే విధానం, ఇంకా పాలనకి కావలసిన వన్నీ ఆ రోజుకి సమకూరేయన్నమాట.
గణతంత్ర దినోత్సవం రోజున న్యూఢిల్లీ లో, ప్రతి రాష్ట్ర రాజధానిలో, జిల్లారాజధానిలో జెండా వందనం, సైనికుల కవాతు బహు చూడచక్కదనం గా జరుగుతాయి. పిల్లలు, పెద్దలు ఆ కవాతు తరవాత మన దేశ సంస్కృతులు , ఆట పాటలు ప్రదర్శిస్తూ మనల్ని అలరిస్తారు. మన సైనిక , వైమానిక, నావికా దళాలని వాటి శక్తి సామర్ధ్యాలని ప్రదర్శిస్తారు. ప్రభుత్వ రంగాలసంస్థలు కూడా తమ సృజనశక్తి జోడించి రకరకాలుగా ఆ సంవత్సరంలో వారు చేసిన పనిగురించి , ప్రజలకి ఒక సందేశం అందిస్తూ వాహనాలను వాటిపైన సన్నివేశాలను చూపిస్తారు.
ఆ తరవాత సైనికులకు, రక్షకభటులకు (పోలీసులకు) వారి విశిష్ట సేవలకు పతకాలను అందిస్తారు. దేశంలోని ప్రసిద్ధి చెందిన వారికి, వివిధ రంగాలలో సేవలందించినవారికి పద్మ, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలని ప్రకటిస్తారు. చిన్న పిల్లలకు వారి ధైర్యసాహసాలకు మెచ్చి పతకాలను కూడా ఇస్తారు. అమర వీరులైన మన జవాన్లకు వందనం ఆర్పిస్తారు.
మన దేశపు త్రివర్ణ జెండాలు గాలిలో రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది కదా. ఈ రోజుకోసం బడులన్నీ శుభ్రపరచి అందంగా తీర్చి దిద్దుతారు. రోడ్లన్ని శుభ్రపరుస్తారు. బడులలో గణతంత్ర దినం కోసం ఎన్నో పోటీలు కూడా జరుపుతారు. దేశం లో అందరికీ ఈ రోజు తప్పక సెలవు ఉంటుంది. చక్కగా సంతోషంగా కుటుంబంతో కాలం గడుపుతారు అందరూ.
ఈరోజు సందర్భాన్ని చేసుకొని మన అధ్యక్షుడు దేశ ప్రజలందరిని ఉద్దేశ్యించి రేడియో,టెలివిజన్ లలో ప్రసంగిస్తారు. మనం మన దేశ స్వాతంత్ర్యం కోసంపోరాడిన వారందరినీ గుర్తు చేసుకొని, ఇంక పురోభివృద్ధి కోసం మనం ఇంకేమి చేయాలో నిర్ణయించుకొని ముందుకు సాగుదాం.
కలసి పాడుదాం తెనుగు పాట, కలసి సాగుదాం వెలుగు బాట !