Environmental Sciences, asked by gyanvijuhi8691, 1 year ago

Essay on sahaja vanarula samrakshana main points and matter

Answers

Answered by shaivaj67
2
పర్యావరణంలో లభించే బొగ్గు, నీరు, గాలి, చెట్లు మొదలైనవి మనకు సహజ వనరుల రూపంలో లభిస్తా యి. ఇవి మానవ మనుగడకు ఎంతో తోడ్పడుతాయి ఇవి లేని మానవ జీవనం శూన్యం. మానవ జీవనంలో ఇంత ప్రాధాన్యం ఉన్న సహజ సంపదను మనం ఏవిధంగా వాటిని మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాం అన్నది తెలిసి ఉండాలి. మనిషి ఏ విధంగా సహజ వనరుల వినాశనానికి కారణనమౌవుతున్నాడో, తద్వరా మానవ మనుగడ రాబోయేరోజుల్లో ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాలో, నవ నాగరీకతపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మనకు తెలి యాలి. ముఖ్యంగా యువత దీన్ని అర్థం చేసుకోవాలి. అలాగే సహజ వనరులకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని, వాటి నాణ్యతకు భంగం కలిగించకూడదని తెలుసుకోవాలి.

కొన్నేళ్లుగా భూ మండలంపై సహజ వనరుల శాతం చాలా వేగంగా తగ్గిపోతున్నది. రోజురోజుకు ఎన్నో మరగున పడిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసా గి తే.. భవిష్యత్తు అంధకార బందురం కాగలదని ప్రతి ఒక్కరూ తెలుసుకుని మసలుకొన్న నాడే మన మను గడ ఉంటుంది. అయితే మాటలు చెప్పినంత మాత్రాన సహజ వనరులు మనకోసం ఈ భూమండలంపై చిరస్థాయిగా నిలిచిపోవు. వాటిని కాపాడుకోవడాని కోసం మనం మనవంతు కృషిచేయాలి. జాగ్రత్తలు తీసుకోవా లి. అవసరమైనంతవరకే వనరులను మనం వాడుకోవాలి. అంతేగాని చీటీకి మాటీకి చెట్లను నరకడం, బొగ్గు ను తవ్వడం, నీటిని వృథాగా ఉపయోగించడం చేయకూడదు. భవిష్యత్తరాల కోసం అందించాలి. 

వాటిని సరిగా వాడటం వల్ల ముందుతరాల వారు ఉపయోగించుకునే అవకాశం ఉందని బోధన చేయాలి. ప్రభుత్వం అవసరమున్నంత వరకే బొగ్గు గనుల్లోనుంచి బొగును తీసి విద్యుదుత్పత్తి కోసం వాడాలి. కావున మనం వాటి ని సద్వనియోగం చేసుకొంటూ ముందుకు సాగాలి. ఒక్కసారి మన అవసరాలకు ఉపయోగించిన నీటిని తిరిగి మొక్కలకు అందించడానికి వాడాలి. తద్వరా నీటిని కాపాడుకునే అవకాశం అధికంగా ఉంటుంది. వీటినే కాకుండా ఇలా ఎన్నోరకాలైన సహజ వనరుల ను కాపాడుకునే బాధ్యత మనదే. ఈ విధంగా మనవంతు ప్రయత్నం చేసి సహజ వనరులను సంరక్షిం చు కోవాలి. పర్యావరణ సమస్యలు తలెత్తకుండా జాగ్ర త్తలు తీసుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకుసాగి 

hope it helps
Similar questions