India Languages, asked by shreyaswi76, 1 year ago

Essay on save environment in telugu

Answers

Answered by sdtm123
24

వాయువులో కలసియున్న మానవులకు మరియు పర్యావరణమునకు హాని కలిగించు ఏదైనా పదార్ధమును వాయు కాలుష్య కారకం అంటారు. కాలుష్య కారకాలు, ఘన, ద్రవ లేదా వాయు రూపములో ఉండవచ్చును.అంతేకాక అవి సహజముగా ఏర్పడవచ్చును లేక మానవ నిర్మితమై ఉండవచ్చును.[1]

కాలుష్య కారకాలు అవి ఉత్పన్నమగు విధానము ప్రకారము రెండు రకములుగా విభజింపవచ్చును - ప్రాథమిక లేదా ద్వితీయ రకాలు. సాధారణంగా ప్రాథమిక కాలుష్య కారకాలు ఏదైనా ప్రక్రియ నుండి నేరుగా ఉత్పన్నమైయ్యే పదార్ధాలు. ఉదాహరణకి అగ్ని పర్వతముల నుండి వచ్చే బూడిద, మోటారు వాహనముల నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ లేక ఫ్యాక్టరీ ల నుండి వచ్చే సల్ఫర్ డై ఆక్సైడ్ లాంటివి.

ద్వితీయ రకపు కాలుష్య కారకాలు నేరుగా ఉత్పన్నం కావు. ప్రాథమిక కాలుష్య కారకాలు చర్యలకు లోనవ్వడం వల్ల లేక వాయువులో కలిసినందు వల్ల ద్వితీయ కాలుష్య కారకాలు ఏర్పడును. ద్వితీయ రకపు కాలుష్య కారకాలకు ఒక ముఖ్యమైన ఉదాహరణ -భూమిని అంటిపెట్టుకుని ఉండే ఓజోన్ - ఫోటోరసాయనిక స్మోగ్ ఏర్పడుటకు కారణమైన ఎన్నో ద్వితీయరకపు కాలుష్య కారకములలో ఒకటి.

కొన్ని కాలుష్య కారకాలు రెండు రకాలుగా ఉండవచ్చును. అనగా అవి సరాసరిగాను (ప్రాథమిక) మరియు ఇతర ప్రాథమిక కాలుష్య కారకాల చర్యల వల్లనూ ఉత్పన్నమగును.

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారి పర్యావరణ శాస్త్ర ఇంజినీరింగ్ ప్రోగ్రాం ప్రకారము యునెటెడ్ స్టేట్స్ లోని మరణాలలో 4 శాతం వరకు వాయు కాలుష్యం వల్లనే జరుగుచున్నవి.

ముఖ్యమెన ప్రాథమిక కాలుష్య కారకాలు మానవ చర్యల కారణముగా ఏర్పడినట్టివి. వాటిలో:

సల్ఫర్ ఆక్సైడ్ (Sulfur oxide)లు (SOx) - ముఖ్యముగా సల్ఫర్ డై ఆక్సైడ్, SO2 ఫార్ములా కలిగిన ఒక రసాయనము మిశ్రమము.అగ్నిపర్వతాలు మరియు పెక్కు పారిశ్రామిక ప్రక్రియల వలన SO2 ఏర్పడుతుంది. బొగ్గు మరియు పెట్రోలియం లలో సల్ఫర్ మిశ్రమాలు కలిసి ఉండటంతో వాటిని మండించినప్పుడు సల్ఫర్ డై ఆక్సైడ్ ఉత్పన్నమవుతుంది. SO2 ఇంకా ఆక్సీకరణ చెందినప్పుడు, మామూలుగా NO2 అనే ఉత్ప్రేరకము ఉన్నచో,సల్ఫ్యూరికామ్లం ( H2SO4 ) ఉద్భవించును, అనగా ఆమ్ల వర్షము కురియును. అందుకే ఈ ఇంధనములను శక్తి వనరులుగా వాడినచో పర్యావరణంపై దీని ప్రభావం ఏ విధముగా ఉండగలదో అని ఆలోచించుట ఎంతైనా అవసరము.

నైట్రోజన్ ఆక్సైడ్ (Nitrogen oxide)లు (NOx) - ముఖ్యంగా నైట్రోజన్ డై ఆక్సైడ్ (nitrogen dioxide) అధిక వేడిగల మంటలలో ఉద్భవించును.ఇవి పట్టణాలలో పైన బూదర రంగు కప్పులాగా లేదా కిందకు వీచు ప్ల్యూమ్ (plume) గాలిలాగాను కనిపించును. నైట్రోజెన్ డై ఆక్సైడ్ (NO2) ఫార్ములా కలిగిన రసాయనిక మిశ్రమము.పెక్కు విధములైన నైట్రోజన్ ఆక్సైడ్ లలో ఇదీ ఒకటి. ఈ ఎర్ర-గోధుమ రంగు విష వాయువు స్వాభావికమైన మిక్కిలి చెడు వాసన కలిగి ఉండును. NO2 అతి ముఖ్యమైన వాయు కాలుష్య కారకములలో ఒకటి.

కార్బన్ మోనాక్సైడ్ (Carbon monoxide) - ఒక రంగు, వాసన రుచి లేని మిక్కిలి విషపూరితమైన వాయువు. సహజ వాయువు, బొగ్గు, చెక్క / కట్టెలు మొదలగు ఇంధన వనరులు అసంపూర్తిగా మండుటవలన ఇది తయారవుతుంది.వాహనాల వ్యర్థ వాయువులలో కార్బన్ మోనాక్సైడ్ మిక్కిలి మెండుగా లభించును.

కార్బన్ డయాక్సైడ్ (Carbon dioxide) (CO2) - మండుట వలన ఏర్పడు ఒక గ్రీన్ హౌస్ వాయువు (greenhouse gas) కాని అది జీవ జాతుల (living organisms) మనుగడకు కూడా ఎంతో ముఖ్యము.ఇది వాతావరణంలో ఉండే సహజ వాయువు.

త్వరిత సేంద్రీయ మిశ్రమములు (Volatile organic compounds) - (VOC)లు ముఖ్యమైన బాహ్య వాయు కాలుష్య కారకములు.ఈ విభాగంలో వీటిని తరచుగా మిథేన్ (CH4) మరియు నాన్ మిథేన్ (NMVOC) లుగా విభజిస్తారు.అత్యంత వేడిని పంచే బహు సమర్థ గ్రీన్ హౌస్ వాయువు మిథేన్ వయువువాతావరణంలో ఓజోన్ సృష్టించడంలో మరియు దాని జీవనకాలమును పోడిగించుటలో ఇతర హైడ్రోకార్బన్ (VOC)లు ధరించే పాత్ర ద్వారా ఇవి కూడా ముఖ్యమైన గ్రీన్ హౌస్ వాయువులు. ఏదిఏమైనను వీటి ప్రభావము ఆ పరిసరములలోని వాయు లక్షణాలపై ఆధారపడుతుంది.

(NMVOC)లకు చెందు ఆరోమ్యాతిక్ మిస్రమములైన బెంజీన్, తోలుఈన్ మరియు క్సైలీన్ అనునవి క్యాన్సర్ కారకాలని అనుమాన పడుచున్నారు. వీటి ప్రభావములో ఎక్కువ కాలము ఉన్నచో ల్యూకేమియా కలగవచ్చును. ఇండస్ట్రియల్ వాడకంలో ఉన్న మరొక అపాయకరమైన మిశ్రమము 1, 3- బ్యుతడైయిన్.

నలుసు పదార్ధము (Particulate matter) - నలుసులు / రేణువులు, లేక అతి సన్నని బిందువులు అని కూడా పిలువబడు నలుసు పదార్దములు గాలిలో చేరిన అతి చిన్న ఘన లేక జల నలుసులు.ఏరోసోల్ అనగా వాయువు మరియు అందులో మిళితమైన నలుసులు.లేసమాత్రమైన పదార్థము యొక్క మూలము మానవ నిర్మితము లేక సహజ సిద్ధము కావచ్చును.కొన్ని నలుసులు సహజ సిద్ధముగా అగ్నిపర్వతములు, గాలిడుమారములు, అడవి మరియు గడ్డి ప్రదేశముల మంటలు, చెట్లూ చేమల జీవక్రియలు మరియు సముద్రములలోనించి పైకి చెదిరే నీళ్ళ వలన ఏర్పడును.వాహనములలో మండే భూగర్భము నుండి తీసిన ఇంధనములు, పవర్ ప్లాంట్స్ మరియు పెక్కు పారిశ్రామిక విధానములు మున్నగు మానవ ప్రక్రియలు కూడా మెండుగా ఏరోసోల్ లను ఉద్భావింపచేయును.నేడు ప్రపంచం మొత్తం మీద, మొత్తము వాతావరణంలోని ఏరోసోల్ లలో 10 శాతం, అన్త్రోపోజేనిక్ ఏరోసోల్ లు - మానవ సంబంధిత ప్రక్రియల వలన ఏర్పడినవి. గాలిలో చిన్న రేణువుల కలయిక పెరుగుట గుండె జబ్బులు, మారిన శ్వాస కోస ప్రక్రియ మరియు ఉపిరితిత్తుల క్యాన్సర్ మున్నగు పెక్కు ఆరోగ్య సమస్యలకు దరి తీయుచున్నది.





Similar questions