essay on sparrow in telugu
Answers
Explanation:
పిచ్చుక చిన్నదే అయినా దీన్ని బ్రతికించుకోవాలి “ పిచుకంతలేవు. ఎందుకురా అలా ఎగురుతావు?” అనేది పల్లెటూరి జీవనంలో ఊతపదం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పిచ్చుకే పిచ్చుకంతయి పోయింది. కాబట్టి మనం అందరం కలసే పిచ్చుకని బ్రతికించుకోవాలి. పిచ్చుక సాధారణంగా మన ఇళ్లలోనే తిరుగుతాయి. మనుషులమద్య కలివిడిగా తిరుగుతూవుంటాయి. మనలోఒకటిగా కలసి పోతుంది. కాని ఇళ్లు ఇరుకై వాకిలి పెరడు హరించిపోయి చెట్లు కనిపించకుండా పోతూవుంటే ఈ పిచ్చుక ఎక్కడ బ్రతుకుతుందు? బ్రతకడానికే దారి లేకపోతే పెగుతున్న సాంకేతిక విప్లవం వలన పిచ్చుక పూర్తిగా కనుమరుగై భావితరానికి “పిచ్చుక బొమ్మ”ను చూపించి ఈ పిచ్చుక అనే పక్షి మన ఇళ్లలోనే తిరిగేదని చెప్పల్సిన పరిస్థితి రాకుండా, వున్న పిచ్చుకలునైనా బ్రతికించుకుందాం. దీనికి అందరూ సహకరించాలి. ముఖ్యంగా పిచ్చుకలు హరించుకు పోవడానికి కారణాలు:
Answer:
ᎻᏆ ᏴᎡᎪᏆΝᏞᎽ ՏႮᏢᎬᎡ ᏀᏆᎡᏞ ᎻᎬᎡᎬ
ᎽϴႮᎡ ᎪΝՏᏔᎬᎡ ⤵
నిజమైన పిచ్చుకలు పేసరిఫార్మిస్ క్రమంలో పేసరిడే కుటుంబానికి చెందిన చిన్న పక్షులు. ఇవి సాధారణం చిన్నగా బొద్దుగా గోధుమ-ఊదా రంగులో ఉండి చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కు కలిగివుంటాయి. వివిధ జాతుల మధ్య భేదాలు అల్పంగా ఉంటాయి. పిచ్చుకలు ముఖ్యంగా గింజలను తింటాయి, కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను కూడా తింటాయి. గల్స్ లేదా కొండ పిచ్చుకలు పట్టణాలలో నివసించి ఏదైనా తింటాయి. ఇవి నుండి . మధ్యలో ఉంటాయి. పిచ్చుకలు శరీర నిర్మాణంలో ఇతర గింజలను తినే పక్షుల లాగే ఉండి, పృష్ఠ బాహ్య ఈకలు అవశేషాలుగా మారతాయి, నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది.
ఈ నిజమైన ప్రాచీన పిచ్చుకలు యూరప్, ఆఫ్రికా, ఆసియాలో విస్తరించాయి. ఆస్ట్రేలియా, అమెరికా ఖండాలలో విస్తరించి, పట్టణాలలో బాగా స్థిరపడ్డాయి. అమెరికా పిచ్చుకలు లేదా ఆధునిక పిచ్చుకలు వీనికి కొన్ని పోలికలున్నా, చాలా భిన్నమైనవి. ఇవి ఎంబరిజిడే కుటుంబానికి చెందినవి. ఇలాగే హెడ్జ్ పిచ్చుక లేదా డన్నక్ కూడా అసలు పిచ్చుకలకు సంబంధించినది కాదు.