Essay on the service of police in Telugu
Answers
Answer:
పోలీసులు యొక్క మొదటి కర్తవ్యం ప్రజలను న్యాయ చట్టాలు పాటించేలా నియంత్రణ చేయడమే. ఎవరైనా వాటిని తప్పితే మొదటిగా చర్యలు తీసుకునేవారు పొలీసులే. వారు ప్రజలను న్యాయానికి అంటుకుని ఉండేలా చూస్తారు. ఎవరైతే న్యాయాన్ని పాటించరో వారిని శిక్షిస్తారు. మన జీవితాలను, ఆస్తులను కాపాడడం పోలీసుల కర్తవ్యం. అందువలన పోలీసుల పాత్ర చాలా ముఖ్యమైనది.
చట్టలు ప్రతీ ఒక్క దేషంలో అవసరం. చట్టం సమాధానం పాటించేలా సహాయం చేస్తుంది. ప్రతీ వ్యక్తి చట్టాన్ని పాటించాలి. సమాధానాన్ని, చట్టాన్ని కాపాడే వ్యక్తి పొలీసు. అతను కాకీ దుస్తులు ధరించి, చేతిలో లాఠీ పట్టుకుని ఉంటాడు. భారత దేషంలోని వివిధ రాస్ట్రాల పోలీసులను వారి అధికారక చిహ్నాన్ని బట్టి గుర్తించవచ్చును.
పోలీసులు పోలిసు స్టేషన్ లోను, చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహిస్తారు. అప్పుడప్పుడు వారు ఎక్కడైనా గొడవలు, తగాదాలు జరుగుతుంటే అక్కడ కూడా విధులు నిర్వహిస్తారు. అంతే కాకుండా ప్రజలు రాద్దాంతాలు, బందులు చేస్తున్నప్పుడు కుడా వారు ముఖ్యమైన పాత్ర వహిస్తారు. గొడవల్లు తారాస్తాయికి చేరినప్పుడు వాటిని నియంత్రించడానికి వారు లాఠీచార్జి కూడా తీసుకుంటారు. పరిస్థితి మరింత ఉద్రిక్త స్థాయికి చేరినప్పుడు పై అధికారుల ఆజ్ఞ మేరకు కాల్పులు కూడా జరుపుతారు.
పొలీసు ఉద్యోగం చాలా కష్టం ఎందుకంటే వారు విడతల వారీగా పనిచేస్తున్నప్పటికి 24 గంటలు సిద్దంగా ఉండాలి. పోలిసును శాంతి భద్రతలను కాపాడే వ్యక్తిగా భావిస్తారు. అతను శాంతి మరియు సామరస్యాన్ని కొనసాగిస్తాడు. వారు క్రమశిక్షణ ఉల్లంఘించే వారి యెడల, గందరగోళం సృష్టించే వారియెడల కఠినంగా వ్యవహరిస్తారు. వారు ఎండా వాన మంచు అని తేడా లేకుండా పనిచేస్తారు. సీతాకాలపు చలిలో రాత్రులు కూడా పనిచేస్తరు. రోడ్ల మధ్య కాలుష్యపు వాతావరనంలో ఎండలో నిలుచుని రవాణాను నియంత్రిస్తారు. వారు ఇంకా వివిధ రకాల పనులను చేస్తారు.అంతే కాకుండా వివిధ వర్గాల మధ్య వివాధలను కూడా స్థిరపరుస్తారు. వారు మతపరమైన పవిత్ర ఊరేగింపులను ఇబ్బంది పెట్టే వారి నుండి కాపాడతారు. అల్లర్లు, దొంగతనాల్లో మునిగిపోయిన వారికి వీరు శత్రువులు. పోలిసు పేద ప్రజలకు రక్షకులు.
వారి జీతాలు ఇతరులతో పోలిస్తే తక్కువ. అయినప్పటికి వారు కష్టపడుతూ పనిచేస్తారు. పోలీసు వారికి మంచి జీతము, గౌరవము ఇవ్వాలి ఎందుకంటే వారే సమాజాన్ని కాపాడే నిజమైన రక్షకులు.