India Languages, asked by ayushman6284, 11 months ago

Essay on village atmosphere in Telugu

Answers

Answered by titiksha06
3

Answer:

గ్రామం (Village) లేదా పల్లె అనేది కొన్ని నివాసాల సముదాయం. ఇది నగరం లేదా పట్టణం కంటే చిన్నది. గూడెం (Hamlet) కంటే పెద్దది[1].

మనిషి సంఘజీవి కనుక ఇతరులతో అవసరాలను అనుసరించి దగ్గరగా జీవించుటకు కొందరు ఒకే చోట లేదా ఒకే ప్రాంతమును కేంద్రముగా చేసుకొని వారి వారి నివాసాలను ఏర్పాటు చేసుకోగా ఏర్పడినది ఒక గ్రామం. గ్రామాలు వాటి మధ్య వ్యాపార సంబంద కార్యకలాపాలు నెరపేందుకు వాటి కూడలిగా కొన్ని పట్టణాలు ఏర్పడతాయి. ఆయా పట్టాణాలను కేంద్రీకృతం చేసుకొని దగ్గర దగ్గరలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువ గ్రామాలు శాశ్వతంగా ప్రజలు నివాసం ఉండేవి. కాని కొన్ని గ్రామాలు తాత్కాలికం కావచ్చును. అలాగే ఎక్కువ గ్రామాలలో ఇండ్లు దగ్గర దగ్గరగా ఉంటాయి. గుడేంలో ఎక్కువగా హరిజనులు ఉంటారు కాని కొన్ని గ్రామాలలో ఇండ్లు దూర దూరంగా ఉండవచ్చును[2].

చారిత్రికంగా వ్యవసాయం గ్రామాల ఏర్పాటుకు పట్టుకొమ్మ కాని కొన్ని గ్రామాలు ఇతర వృత్తులు ఆధారంగా ఏర్పడ్డాయి. రాజకీయ, పరిపాలనా ప్రయోజనాల కారణంగానూ, పారిశ్రామిక విప్లవం అనంతరం పరిశ్రమలు విస్తరించడం వలనా అనేక గ్రామాలు పట్టణాలుగానూ, నగరాలుగానూ వృద్ధి చెందాయి.

ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది గ్రామాలు ఉన్నందున వీటిలో ఎంతో వైవిధ్యం ఉంది. కనుక గ్రామం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం. సుమారుగా 10 నుండి 1000 వరకు కుటుంబాలు ఉండే గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం 6,38,365 గ్రామాలు (నిర్జన గ్రామాలతో కలిపి) ఉన్నాయి[3]. అధికంగా గ్రామాలలో నివాసాలు అక్కడి అవసరాలను బట్టి ఉంటాయి.

రక్షణ అవుసరమైన చోట (దొంగల భయం వంటివి ఉన్నట్లయితే) నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి.

అక్కడి వాతావరణాన్ని బట్టి, అక్కడ దొరికే వస్తువులను బట్టి నివాసాల నిర్మాణం జరుగుతుంది. ఉదాహరణకు కేరళలో వర్షాలను తట్టుకొనే ఇళ్ళు, హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతాన్ని తట్టుకొనేవిధంగా నిర్మించిన ఇళ్ళు కొండలపై దూరదూరంగా ఉంటాయి. రాజస్థాన్ ఎడారిలో ఇళ్ళలో కలప కంటే మట్టి వినియోగం ఎక్కువ.

అక్కడి వృత్తులు కూడా ఇళ్ళ నిర్మాణాన్ని, ప్రజల జీవనాన్ని బాగా ప్రభావితం చేస్తాయి.

దగ్గరలో ఉండే నగరాల వనరులు, అవసరాలు, వాణిజ్య సంబంధాలు గ్రామ జీవనంపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంటాయి. ఉదాహరణకు నగరం దగ్గరలో ఉన్న గ్రామాలలో పాల ఉత్పత్తికి, కూరగాయల పెంపకానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో గ్రామపాలన పూర్వం కరణం మునసబు పటేల్ పట్వారీలు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు.1985 లో వీరిని తీసేసి గ్రామపాలనాధికారుల్ని (వి.ఏ.వో ) ప్రవేశపెట్టారు.పంచాయతీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది. జనాభా ప్రాతిపదికన వారిని నియమించారు. 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి వీ.ఆర్.వోలు ఉండడానికి అనుమతి ఇచ్చారు. కానీ పంచాయతీ కార్యదర్శులను వీఆర్వోలుగా తీసుకున్న సమయంలో 'ఎక్కడి వారు అక్కడే' అన్న పద్ధతిలో వారిని ఉంచేశారు. ఫలితంగా కొన్ని చోట్ల ఉండవలిసిన వారికంటే ఎక్కువ మంది ఉంటే.. ఇంకొన్ని చోట్ల అసలే లేకుండాపోయారు. ఈ అసమానత కారణంగా ప్రజలకేగాక పాలనపరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఎవరినీ సొంత గ్రామానికి బదిలీ చేసేది లేదు.ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది.. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్)గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉండగా 17,008 వీఆర్వోలు అవసరం. ప్రస్తుతం సుమారు 14,800 మంది వీఆర్వోలే ఉన్నారురాష్ట్రంలోని 21,943 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక కార్యదర్శి ఉండాలి. ప్రతి పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.ఒక కార్యదర్శికి ఒక పెద్ద పంచాయతీ లేదా ఏడు చిన్నపంచాయతీల బాధ్యతలను అప్పగించారు. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామ కార్యదర్శిని కలవాలంటే 40-50 కిలోమీటర్లు ప్రజలు పయనించాలి. అడవుల మధ్యలో ఉన్న చిన్నపంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యంలేదు. కనీసం గ్రామానికి ఒకరుండాలంటే పూర్వంలాగానే పంచాయతీ రెవిన్యూశాఖలను ఏకంచెయ్యాలి.మన రాష్ట్రంలో 1127 రెవిన్యూ మండలాలు,1094 మండలపరిషత్తులు,21943 గ్రామపంచాయితీలు,28124 రెవిన్యూ గ్రామాలు,26614 నివాసితగ్రామాలు,1510 నివాసులులేనిగ్రామాలు ఉన్నాయి.రక్షణ అవుసరమైన చోట (దొంగల భయం వంటివి ఉన్నట్లయితే) నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి.

plz mark me as brainliest plz

Similar questions