Essay on village games in Telugu
Answers
Answer:
Village Games
INDIAN TRADITIONAL GAMES - గ్రామీణ ఆటలు / పల్లెటూరి ఆటలు
Explanation:
Village Games
INDIAN TRADITIONAL GAMES - గ్రామీణ ఆటలు / పల్లెటూరి ఆటలు
నా ఊరు పల్లెటూరు, ప్రకృతి అందాల పల్లెటూరు ..
నే తిరిగిన వీధులు, నే నెరిగిన మనుషులు, నే నెక్కిన చెట్లు -ఇళ్ల మెట్లు , దిగిన కాలువ గట్లు , ఆడిన అల్లి చెరువు గట్లు ,
పరుగులెత్తిన, పడిలేచిన పొలం గట్లు, నేలను దున్నే ఎడ్లు,-నే తిన్న వడ్లు, నే తొక్కిన రేగడి మట్టి , నే మెక్కిన తెల్లమీగడ జున్ను ,
మా గురువులు ,మా పుస్తకాల బరువులు, మా బడి, గంటల గుడి .
మొత్తం నా బాల్యం సాక్షిగా ....నా ఊరు పల్లెటూరు.
నా ఊరు పల్లెటూరని రొమ్ము విరుస్తాను ,నా తల వంచుతాను .......:!!
బొంగరాల ఆట (BONGARALATA): బొంగరాల ఆట మొగపిల్లలు ఎక్కువుగా ఆదుకునే ఆట. ఇందుకు ప్రత్యేకంగా బొంగరాలు తయారు చేయించుకొంటారు . చిన్నవి పెద్దవి బొంగరాలుంటాయి .బొంగరం దారం ఆధారంగా తిరుగుతుంది. ఈ దారాన్ని జాల అంటారు. జాలను బొంగరానికి చుడతారు జల జారిపోకుండా బొంగరానికి కొన్ని గీతలుంటాయి. ఆ జీతాల చుట్టూ చుట్టాలి.తరువాత జాల చివర గట్టిగ బొటనవేలుకు,చూపుడు వేలుకు మధ్య బంధించి నెల ఫై విసురుతారు. అప్పుడు బొంగరం ములికి ఆధారముగా తిరుగుతూ ఉంటుంది. దీని ఆడించటమేకాదు, దీనిపై పందాలు కూడా ఆడతారు. ఓ గుండ్రని గీతలో బొంగరాలు ఉంచి పంటలూ వేసి ఎన్నికైనవాడు ముందుగా ఆట ప్రారంభిస్తారు.
అతను తన బొంగరం ద్వారా ఎదుటివాడి బొంగరాన్ని గీత బయటకు దాటించాలి. అప్పుడు ఆ బొంగరం అతను ఓడినట్టు లేదా ఆ బొంగరం కొట్టిన వాడి సొంతమవుతుంది. ఈ ఆటకూడా చాల చోట్ల రకరకాల పద్ధతుల్లో ఆడుతారు. ఆటలో ఒక్కసారి బొంగరం ములికి దెబ్బలు తినడమే కాదు రెండు ముక్కలు అవుతుంది. ఎన్ని నొక్కులుంటే అన్నిసార్లు ఓడినట్టు గుర్తుకూడ. ఈ ఆట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా వేసవి సెలవుల్లో పిల్లలు ఆడుతూ కనిపిస్తుంటారు. [ Video of Bhongaralata ]
కోతికొమ్మచ్చి (KOTHI KOMMACHI): కోతి చేష్టలు కనిపించే ఆట అంటే కోతికొమ్మచ్చి . కోతిలా గెంతడం దూకడం ఈ ఆటలో ఆనందం కలిగిస్తాయి. చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణములో ఈ ఆట ఆడుకోవచ్చు. ఎక్కువుగా మగపిల్లలు ఆడే ఆట ఇది.
ఆడే విధానం: ఉరిబయట ఓ పెద్దచెట్టును చూసుకొని చెట్టు ముందు గుండ్రని గీత పరిదిగా గీస్తారు. తరువాత ఆడుకునేవాళ్ళదరు పంటాలు( ముగ్గురు చేతులో తీసికొని ఒక్కసారి వేస్తారు కొందరు వెల్లకిలా ,కొందరు బోర్లా వేస్తారు. అదులో ఒకరు ఎటువైపు వేస్తారో వాళ్ళు పంట అయినట్టు . మిగిలినవాళ్లు కూడా ఇలాగే వేస్తారు చివరకి ఒకరు మిగులుతారు ). ద్వారా దొంగను గుర్తిస్తారు. దొంగ తప్ప మిగతా వాళ్లంతా చెట్టు ఎక్కుతారు.కింద గీత లో ఒక కర్ర పెడతారు. ఒకరు ఆకర్ర దూరంగా విసిరేస్తారు . ఆ దొంగ వెళ్లి కర్ర తెచ్చే లోపల ఆ కర్ర విసిరేసిన అతను చెట్టు ఎక్కాలి. చెట్టు ఎక్కేలోపే ఆ దంగా వచ్చి పట్టుకుంటే ఆటను దొంగ కావాల్సిఉంటుంది. దొంగ తిరిగి వచ్చి చెట్టెక్కి మిగతా వాళ్ళను పట్టుకోవాలని చూస్తాడు. వాళ్ళు కొమ్మలో కోతుల్లా అటుఇటు దొరకకుండా దూకుతారు. దొంగ మరి దగ్గరికివస్తే కింద గుండ్రని గీతలో దూకుతారు. కింద దూకేటప్పుడు చెట్టుక్కేటప్పుడు దాని లెక్కించారు. దొంగ ముట్టుకునే వరకు ఆటకనసాగుతుంది. పల్లెటూరిలో వేసవి వస్తే అందరు ఈ అట ఆడుతుండారు. పుల్లాట ( PULLATA / Chuk Chuk pulla): దీనిని ఇసుకకుప్ప ఆట అని కూడా పిలుస్తారు. ఇసుకలో పుల్లను దాచి కనుక్కోవడం యీ ఆట లక్షణం . దీనిని ఆడపిల్లలు మొగపిల్లలు అందరు ఆడుకొంటారు
ఆడే విధానం:ఓ చోట చేరిన పిల్లలు ఈ ఆటాకుకు ఇసుక ఉన్న ప్రదేశమును చూసుకొంటారు . ఒకరు తల్లి పాత్ర వహిస్తారు. లేదా ఎండవాన వేసి ఒక నాయుడిని ఎన్నుకుంటారు. తల్లి పాత్రధారి ఆడుకొనేవాళ్లను తన సమీపంలో కూచోబెట్టి వాళ్ళు చూడకుండా చిన్న పుల్లను ఇసుకలో దూర్చి అటుఇటు అంటుంది .ఆడుకునేవాళ్లలో ఒకరు ముందుగా పొడుగ్గా ఉండే ఇసుక కుప్పపై పుల్ల ఉంచిన ప్రాంతం గీర్తిచి రేడు చేతులు దానిపై వేయాలి . ఆ ప్రదేశం సరిగ్గా గుర్తిస్తే ఆటను గెలిచినట్లు లేకపోతే తల్లి పాత్రధారి ఆ ఇసుక కుప్ప పుల్లతోసహా ఎత్తి అతని దూసట్లో పోసి ఆటను కళ్ళను చేతులతో మూసి దారి తెలియకుండా అటుఇటు తిప్పి ఓచోట పోయించి తీసుకువస్తుంది.తరువాత ఇసుక తీసుకువెళ్లిన వ్యక్తి వెళ్లి తనెక్కడ ఇసుకపొశాడో గుర్తించి అందులోని పుల్లను తల్లికి తీసుకువచ్చి ఇవ్వాలి . యీ విధముగా ప్రతి ఆటగాడు ఆడాలి. పుల్ల తెచ్చిన వాళ్ళ ఆట ముగుస్తుంది