India Languages, asked by pashamkrishnareddygh, 1 year ago

Essay on water resourses in telugu

Answers

Answered by kdraika188
0

ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. పల్లెకైనా, నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా అనూహ్యంగా అధికమవుతోంది. రానున్న కాలంలో నీటి డిమాండ్‌ భారీగా ఉండే సూచనలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు భూమిపై ఉన్న నీటి వనరుల్లో సుమారు 97 శాతం సముద్రాల్లోనే ఉంది. అంటే మనకు పనికొచ్చే నీరు కేవలం 3 శాతమే. ఈ నేపథ్యంలో జల వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఈ రోజు (మార్చి 22) ‘ప్రపంచ జల దినోత్సవం’ సందర్భంగా నీటి సంరక్షణ కోసం ప్రతిన పూనాల్సిన తరుణమిదే.

మనకు తెలిసీ తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్‌ను అలాగే వదిలేస్తుంటారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకన్‌కు లీకయ్యే నీటి చుక్క.. రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. అందువల్ల ఉపయోగించిన వెంటనే ట్యాప్‌లను జాగ్రత్తగా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. మీ పిల్లలకూ ఇలాంటి అలవాట్లను నేర్పించాలి. వేసవి రాగానే తాగు నీరు లభించక పశుపక్ష్యాదులు మృత్యువాత పడే ఉదంతాలను అనేకం చూసే ఉంటారు. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన పిల్లలు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

వీలైనంతవరకూ స్నానం చేయడానికి షవర్లను ఆశ్రయించకపోవడమే ఉత్తమం. కొత్తగా నిర్మించే ఇళ్లలో విభిన్న రకాల ట్యాప్‌లను అమరుస్తున్నారు. వీటిలో కొన్ని ఆఫ్ చేయడమెలాగో.. ఆన్ చేయడమెలాగో తెలియకుండా ఉంటున్నాయి. కుళాయి నుంచి నీరు రాని సమయాల్లో.. వీటిని తిప్పి అలాగే వదిలేసి, బయటకి వెళ్లిపోతే చాలా నీరు వృథాగా పోతుంది. కాబట్టి ఆధునికత కంటే అవసరానికే ప్రాధాన్యమివ్వడం ప్రయోజనకరం.

నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా.. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం, వృథాను అరికట్టడం, పొదుపుగా వాడటం, పునర్వినియోగం.. తదితరాలన్నింటికీ ప్రాధాన్యమివ్వాలి. మనసుపెట్టి ఆలోచిస్తే మురుగునీటిని కూడా శుద్ధి చేసి, మళ్లీ వినియోగించుకునే మార్గాలు అనేకం కనిపిస్తాయి. అలాంటి నీటితో పూల మొక్కలు, నీడనిచ్చే చెట్లను పెంచుకోవచ్చు. తద్వారా పచ్చదనాన్ని పెంపొందించుకునే వెసులుబాటు కలుగుతుంది.

సాధారణంగా గ్రామాల్లో.. కుళాయిల దగ్గర నీరు వృథాగా పోవడం గమనించే ఉంటారు. చాలా చోట్ల పంచాయతీ కుళాయిలను ఆపేయడానికి సరైన విధానాలే ఉండవు. ఈ విషయంలో మనమే బాధ్యతగా చొరవ తీసుకోవాలి. కోతి చేష్టలతో కవ్వించే వానరాలు కూడా.. దాహం తీర్చుకున్న తర్వాత జాగ్రత్తగా కుళాయిని కట్టేసే ఉదంతాలను అనేకసార్లు చూసే ఉంటారు. మరి మనిషిగా ప్రపంచానికి మనం ఏం సందేశాన్ని ఇస్తున్నాం. అందువల్ల నీటి సంరక్షణ కోసం తక్షణమే గట్టి నిర్ణయం తీసుకోండి.

Answered by shailutumma09
0

Hello

జల వనరులు అనేవి మానవులకు ఉపయోగపడే లేదా మూలాధార నీటి సముదాయాలు. వ్యవసాయక, పారిశ్రామిక, గృహ, పునరుత్పాదక మరియు పర్యావరణ సంబంధిత కార్యకలాపాలు సహా నీటి వల్ల పలు ప్రయోజనాలున్నాయి. నిజానికి అన్ని రకాల మానవ అవసరాలకు స్వచ్ఛమైన నీరు అవసరం.

భూమిపై 97% ఉప్పు నీరు ఉండగా, మిగిలిన 3% స్వచ్ఛమైన నీటిలో సుమారు మూడింట రెండొంతులు హిమనీనదాలు, ధ్రువ హిమవేష్టనం వద్ద గడ్డకట్టుకుంటోంది.మిగిలిన గడ్డకట్టని స్వచ్ఛమైన నీరు భూగర్భజలంగా లభ్యమవుతుండగా, అతి తక్కువ భాగం మాత్రమే భూమిపై లేదా గాలిలో ఉంటోంది.

ప్రపంచంలో శుభ్రమైన, స్వచ్ఛమైన నీరు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, స్వచ్ఛమైన నీరు పునరుత్పాదక వనరు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో నీటి అవసరం ఇప్పటికే అదనపు సరఫరాను మించిపోయింది. మరియు ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉండటం కూడా నీటి అవసరతను పెంచుతోంది. పర్యావరణవ్యవస్థ పరిస్థితులకు నీరును నిల్వ చేయాలన్న భౌగోళిక ప్రాముఖ్యతపై ఇటీవలే అవగాహన వచ్చింది. 20వ శతాబ్దిలో ప్రపంచంలోని సగానికిపైగా చిత్తడినేలలు తమ విలువైన పర్యావరణ పరిస్థితులతో పాటు నాశనమైపోయాయి. జీవోవైవిద్య సంబంధిత స్వచ్ఛమైన నీటి పర్యావరణవ్యవస్థలు ప్రస్తుతం సముద్ర లేదా భూ పర్యావరణ వ్యవస్థల కంటే శరవేగంగా క్షీణిస్తున్నాయి.జల వినియోగదారులకు నీటి వనరులను కేటాయించే ముసాయిదాను (ముసాయిదా అమల్లో ఉన్న చోట) జల హక్కులు అని అంటారు.

Similar questions