essay on waterfalls in telugu
plz I need it fast I have exam tomorrow the ques is for 10 marks
I will mark u as brainliest
Answers
ఆంధ్ర ప్రదేశ్ లోనే అతి ఎత్తయిన కుంటాల జలపాతం ఆదిలాబాదు జిల్లాలో 44వ నెంబరు జాతీయ రహదారి సమీపంలో ఉంది. ఇది ఆదిలాబాదు జిల్లాలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో నేరడిగొండ మండలంలో గోదావరికి ఉప నది అయిన కడెంనదిపై కుంటాల గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉన్నది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మల్ నుండి ఆదిలాబాదు పోవు మార్గానికి కొద్దిగా కుడివైపునకు, మండల కేంద్రము నేరడిగొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. 45 మీటర్ల ఎత్తు నుంచి జలజల పారే నీళ్ళు, ఆ చప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాదు నుండి ఇది 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జలపాతానికి ఈ పేరు దుష్యంతుడి భార్య శకుంతల నుంచి వచ్చిందని స్థానిక ప్రజల విశ్వాసం. ఈ జలపాతం మరియు పరిసరాల దృశ్యం చూసి శకుంతల మైమరిచిపోయి, తరుచుగా ఈ జలపాతంలో స్నానం చేసేదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
ఈ ప్రాంతములో మూడు జలపాతాలు, గుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా వ్యవహరిస్తారు. జలపాతం వద్ద ప్రకృతిసిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ప్రతిష్టమై ఉండటంవల్ల ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఈ శివలింగాలను దర్శించుకొని పూజలు నిర్వహించడాన్ని సోమన్నజాతరగా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో రెండు రోజులపాటు ఈ జాతర జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం..