essay onfarmer in telugu language
Answers
Answer:
భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి పనిచేస్తున్నారు. కానీ అందులో ఎక్కువ ఆదాయం రావడం లేదు. అందుకే ఏటేటా ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రకటిస్తున్నా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆగడం లేదు. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు చీవాట్లు పెట్టినా ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికలు ఆలోచించడం లేదు. రైతు చనిపోతే రైతుకు ఎంతో ఆర్థిక సాయం ప్రకటిస్తున్న సందర్భాలే ఎక్కువ. ఈ వైఖరి కచ్చితంగా మారాల్సిందేనని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ప్రభుత్వ ప్రాధాన్యాలు మరెవో ఉన్నప్పుడు రైతును తన కాళ్ల మీద నిలబడేలా ప్రభుత్వాలు ఏదో చేస్తాయని ఆశించడం తప్పులా కనిపిస్తోంది. అయితే అందరూ అలానే చింతిస్తూ కూర్చోరు. వ్యవసాయంతో సంబంధం ఉన్నా లేకపోయినా వీళ్లంతా వైవిధ్యంగా ఆలోచించారు. రైతు ఆదాయం పెరిగేలా, మార్కెటింగ్ అవకాశం మెరుగుపడేలా ప్రయత్నాలు చేశారు. దేశంలో స్టార్టప్ ప్రభంజనం కొనసాగుతున్న ఈ రోజుల్లో వ్యవసాయానికి సంబంధించిన స్టార్టప్‌లను మొదలుపెట్టారు. ప్రారంభించడం మాత్రం సులువే. కానీ ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొని విజయంతమైన అగ్రి స్టార్టప్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Explanation:
అగ్రిహబ్
దిఅగ్రిహబ్.కామ్ సంప్రదాయ వ్యవసాయ పద్దతులను, ఆధునిక సాంకేతికతను ముడిపెట్టేందుకు చేసిన ఒక చిరు ప్రయత్నం. ఈ స్టార్టప్ ఏ నిజమైన వ్యాపారులు, కంపెనీలను, డిస్ట్రిబ్యూటర్లను రైతులతో అనుసంధానిస్తుంది. ఈ స్టార్టప్ 2016లో రూ. 10 లక్షల నిధులతో ప్రారంభమై ప్రస్తుతం అంచెలంచెలుగా ఎదుగుతున్నది. పూర్తిగా పట్టణ స్థాయి కలిగిన టౌన్లు, నగరాల్లో ట్రేడర్లకు కొత్త వ్యవసాయ యంత్ర పరికరాల గురించి తెలియడం పెద్ద సమస్య ఏమీ కాదు. అదే టైర్-2, టైర్3 నగరాల విషయానికి వస్తే కొత్త సాంకేతికత గురించి తెలియాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. మామూలుగా అయితే వారు అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లకు వెళ్లాల్సిందే. ఈ కష్టాన్ని ఈ వెబ్‌సైట్ తగ్గిస్తోంది.
ఈ కంపెనీ రైతుల కోసం ఒక టోల్‌ఫ్రీ నంబరును సైతం నిర్వహిస్తోంది. వెబ్‌సైట్ కోసం అగ్రిహబ్
డిజిటల్ గ్రీన్
డిజిటల్ గ్రీన్ అనేది ఒక లాభాపేక్ష లేని అంతర్జాతీయ సంస్థ. దక్షిణాసియాతో పాటు, సబ్‌సహారా ఆఫ్రికా ప్రాంతాల్లో ఇది పనిచేస్తోంది. ఈ సంస్థ 2008లో ప్రారంభమైంది. 2008 నుంచి 2016 మధ్య దాదాపు 10 లక్షల వ్యక్తులను చేరుకోగలిగింది. 13,592 గ్రామాలను కవర్ చేసింది. గ్రామాలు వెళ్లినప్పుడు వీడియోలు తీయడం కూడా చేస్తారు. ఆ విధంగా ఇప్పటివరకూ 4426 వీడియోలను తీసి అప్‌లోడ్ చేశారు. అయితే అన్ని వీడియోలు అందరికీ అందుబాటులో లేవు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1230 వీడియోలను పబ్లిక్ యాక్సెస్‌లో ఉంచగా దాదాపు 5,88,388 వీక్షణలు వచ్చాయి. అందులో భారత్ నుంచే 3,82,739 వచ్చాయంటే భారతదేశంలో ఎంత ప్రభావవంతంగా తమ పనిచేసుకుపోతున్నారో అర్థం అవుతుంది.వెబ్‌సైట్ కోసం డిజిటల్ గ్రీన్