essay speech on mu environment-my responsibility in telugu
Answers
Answer:
పర్యావరణం అంటే అర్థం భూమి, నీరు, గాలి, చెట్లు, జీవ జంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్నది ప్రకృతి. ఇది మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకం. భారతీయ మహర్షులు పర్యావరణాన్ని రెండు రకాలుగా అభివర్ణించారు. ఒకటి మన చుట్టూ ఉన్న బాహ్య పర్యావరణం, రెండవది అంతర్గత పర్యావరణం. ఈ రెండింటినీ కూడా భగవంతుడే సృష్టించాడు. ఈ రెండింటి మధ్య సంబంధం ఉంది. దానిని మనం అర్ధం చేసుకోవాలి.
పర్యావరణంలో జీవనానికి హాని కలిగించే భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన పదార్థాలు అవసరానికి మించిన పరిమాణంలో పోగయ్యాయి. దీనివల్ల ప్రతీ చోట వీటి సాంద్రత పెరిగి, పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడి కాలుష్యం సంభవిస్తోంది.
నేడు ఈ పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది, దీనికి కారణం కాలుష్యం. దీన్నే ఆంగ్లంలో పొల్యూషన్ అంటారు. కాలుష్యానికి అర్థం పర్యావరణంలో అసమతుల్యతలు సంభవించడమే.
భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చరిత్ర ప్రాచీనమైనది.
(క) హరప్పా నాగరికత సంస్కృతి పర్యావరణహితమైనదిగా ఉంది . వైదిక సంస్కృతి పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించబడింది.
- జూన్ 5 ప్రత్యేకత ఏమిటి?
జూన్ 5న విశ్వవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. దీన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమాలు(UNEP) నిర్వహిస్తూ జాగృతపరిచే ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 1972లో ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రపంచ సమ్మేళనం ఒకటి నిర్వహించింది. అన్ని దేశాలను ఆహ్వానించింది. స్వీడన్ లో నిర్వహించిన ఈ సమ్మేళనంలో సుమారు 119 దేశాలు పాల్గొన్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 5న ఈ సమ్మేళనం జరుగుతుంది.
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎందుకు?
- ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన కలిగించడం.
- ఐక్యరాజ్యసమితికి చెందిన సద్భావనా రాయబారులు (బ్రాండ్ అంబాసిడర్స్) పర్యావరణ దినోత్సవంలో భాగస్వాములు కావాలని ప్రజలకు సందేశం పంపుతారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా పర్యావరణ ప్రతినిధులుగా మారి వాస్తవ పరిస్థితులు, జల వాయు కాలుష్యం ఎదుర్కోవడానికి ఉపాయాలను ఆలోచిస్తారు.
- మనమంతా మెరుగైన భవిష్యత్ కోసం ఈ కార్యక్రమంలో భాగస్వాములై పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది.
- కాలుష్య నియంత్రణకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నం
- పెరుగుతున్న జనాభా, తరుగుతున్న ఉత్పాదకత మానవ జాతి మనుగడకే ప్రమాదం. దీని ప్రభావం పర్యావరణంపై పడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 10 మార్చి 2019 లో జరిగిన ప్రతినిధుల సభలో ఒక నిర్ణయం తీసుకుంది. సంఘం పర్యావరణ పరిరక్షణ సంకల్పాన్ని ప్రారంభించింది. స్వయంసేవకులు తమ తమ స్థాయిలో క్షేత్రాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తూనే సమాజాన్ని జాగృతం చేస్తారు. నిర్ధిష్టమైన పద్ధతిలో కార్యక్రమాలు కూడా చేపడతారు. సంఘ్ దేశవ్యాప్తంగా విభిన్నమైన గతివిధుల సహకారంతో పనులు చేపడుతోంది.
- 2018 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 15 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు చేపట్టిన ఒక అభియాన్ ద్వారా దేశ రాజధాని ఢిల్లీలో 10 లక్షలకు పైగా మొక్కలు నాటారు. పరిసరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా నీడనిచ్చే, ఔషధ గుణాలున్న మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ లోని ప్రతి ప్రాంతంలో చేపట్టారు. దీనిలో స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లు, సామాజిక సంస్థలు, ప్రముఖ వ్యక్తులు, విద్యాలయాలు, ఇతర శిక్షణా సంస్థలను భాగస్వాములు చేశారు. స్థానికంగా ప్రజల సహకారంతో పర్యావరణ కమిటీలు ఏర్పాటు చేసి నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత అప్పగించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్యమాన్ని 2016 జూన్ 20న ప్రారంభించింది. పట్టణాలలో పెరుగుతున్న కాలుష్యానికి దృష్టిలో ఉంచుకొని ఐదు వేల కంటే ఎక్కువ మొక్కలు నాటడానికి సంకల్పించారు. ఈ కార్యక్రమంలో సమాజంలోని ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రయత్నిస్తూ 93 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సంఘ్ జీవనాన్ని ప్రసాదించే మాతృ స్వరూపంగా ప్రకృతిని భావిస్తూ, ఆ ప్రకృతిని రక్షించే బాధ్యతను పోషించడం కర్తవ్యంగా భావిస్తోంది.