Essay telugu swathantra udyamam ghandiji pathra
Answers
Answer:
భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు.
మహాత్మ
మోహన్
మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది. కాని ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితిలోను అంగీకరించవద్దని గాంధీజీ పట్టుపట్టాడు. ముస్లిమ్ మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశవిభజనకు నాంది అని గాంధీజీ భయం. గాంధీజీ మాటను కాంగ్రెసు త్రోసిపుచ్చిన కొద్ది ఘటనలలో ఇది ఒకటి. క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనను నిరాకరిస్తే అధికారం క్రమంగా ముస్లిమ్ లీగ్ చేతుల్లోకి జారుతుందని నెహ్రూ, సర్దార్ పటేల్ అభిప్రాయపడ్డారు. 1946-47 సమయంలో 5000 మంది హింసకు ఆహుతి అయ్యారు. హిందువులు, ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులు ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మతప్రాతిపదికన విభజించడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాంటి ఆలోచన సామాజికంగానూ, నైతికంగానూ, ఆధ్యాత్మికంగానూ కూడా గాంధీ తత్వానికి పెనుదెబ్బ. కాని ముస్లిమ్ లీగ్ నాయకుడైన ముహమ్మద్ ఆలీ జిన్నాకి పశ్చిమ పంజాబు, సింధ్, బలూచిస్తాన్, తూర్పు బెంగాల్లో మంచి ప్రజాదరణ ఉంది. కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢ వాంఛ. కాని జిన్నా - "దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి" - అని హెచ్చరించాడు. చివరకు హిందూ - ముస్లిం కలహాలు ఆపాలంటే దేశవిభజన కంటే గత్యంతరము లేదని తక్కిన కాంగ్రెసు నాయకత్వము అంగీకరించింది. అయితే గాంధీ పట్ల ప్రజలకూ, పార్టీ సభ్యులకూ ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే ఏ నిర్ణయమూ తీసుకొనే అవకాశం లేదు. అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేదని గాంధీని ఒప్పించడానికి పటేల్ శతవిధాల ప్రయత్నించాడు. చివరకు హతాశుడైన గాంధీ ఒప్పుకొనక తప్పలేదు. కాని అతను పూర్తిగా కృంగిపోయాడు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా దేశవిభజన వల్ల విషణ్ణుడైన గాంధీ మాత్రము కలకత్తాలో ఒక హరిజనవాడను శుభ్రము చేస్తూ గడిపాడు. అతని కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిమ్ మత విద్వేషాలు పెచ్చరిల్లి అతన్ని మరింత శోకానికి గురిచేశాయి.