India Languages, asked by bindu5, 1 year ago

essy on yses of yoga in telugu pls help me with this

Answers

Answered by saketh3
1
yoga valla manaki chala upayogalu unnai
manamu churukuga untamu.
mana covvu thaghutundi.
mana shareeram loni prati kandaram kadaladam valana mana shareeram lo rakta prasana baga jarugutundi.
oopiri teesukuni vadiliveyatam valana mana oopirithittulu shubra badutai.
Answered by kvnmurty
3

లాభాలు:

   
యోగా వల్ల మనకేన్నో లాభాలు ఉన్నాయి.  ప్రత్యేకంగా ఎవరైతే ఆటలు ఆడలేరో, ఆడడం కుదరాదో, లావుగా ఉంటారో, ప్రొద్దున్నే బయటకు నడవడానికి కుదరదో , ఏక్షరాసైజ్ చేయలేరో, అనారోగ్యం గా ఉన్నారో,  వారందరికి  యోగా వల్ల చాలా ఉపయోగం ఉంది.  
   
   
యోగా వల్ల ఆస్త్మా రొగులకు ఉపశమనం కలుగుతుంది.  యోగా వల్ల మన శారీరిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చక్కబడతాయి.  యోగా మన మానసిక శక్తి ని పెంచుతుంది, ఆలోచనా శక్తి ని పెంచుతుంది.  ఏకాగ్రత ను పెంచుతుంది.  అధైర్యాన్ని, కలవరాన్ని, నిద్ర లేమితనాన్ని, వాటివల్ల వచ్చే ఇబ్బందిని ప్రతికూలతని  తగ్గిస్తుంది.  మన శరీరం లోని అవయవాలు, లోపల ఉన్న హృదయం , కాలేయం, గాలి తిత్తులు  ఇలా అన్నీ సరిగ్గా పని చేసేలా చేస్తుంది.

   
మనం మానసికం గా ఒక తృప్తి ని పొందుతాం.  మన మెదడుని ఆలోచనను, మనసు ను  అదుపు లో ఉంచుకో గలుగుతాం.   కోపం, అలాంటి భావాలు తొలగి  చల్లబడతాం.  అంతే కాదు కాలు పట్టేయకుండా , నొప్పులు రాకుండా, ఉంటాయి.  యోగా , ప్రాణాయామాలు  రోజు చేసే పురాణ కాలం లో ఋషులు వందల వేల సంవత్సరాలు బ్రతికేవారు. 

   
రక్త ప్రసారం చక్కగా జరుగుతుంది.  శరీరం లోని అన్నీ ప్రదేశాలకు  రక్తం సమంగా ప్రసరించి అవయవాలన్నీ ఆరోగ్యం గా పని చేసెట్లు చేస్తుంది  యోగా.   గాలి లోని ఆక్సీజెన్ అన్నీ అవయయాలకు సరిగ్గా అంది అన్నీ శక్తివంతంగా పని చేస్తాయి.  బద్దకం పోతుంది.   ఆయువు పెరుగు తుంది.  మలబద్దకం తగ్గుతుంది.  కొవ్వు (ఫేట్) పెరగకుండా ఉంటుంది.  నలుగురిలో మనకు  గౌరవం కూడా.  నడుము వంగిపోకుండా ఉంటుంది. శీర్షాసనం వేస్తే తలకు రక్త ప్రసారం మెదడు కి అధికంగా కావలసినంత అందతుంది. 


యోగా  అంటే

   
యోగా మన ప్రాచీన భారత దేశం లో అనాది గా ప్రాచుర్యం లో ఉన్నటువంటి తపస్సు , ధ్యానం చేసేటందుకు సువిధమైన విధి  విధానం.  యోగా లో ఎన్నో ఆసనాలు ఉన్నాయి.  ఆసనం అంటే కాళ్ళు, చేతులు , నడుము, మెడ, తల అన్నీ ఒక్కొక్క స్థ్తితి లో, పొజిషన్ (భంగిమ) ప్రత్యేక విధానం అనుసరించి  ఉంచాలి. ఒక నిముషం నించి అనేక నిముషాల వరకు అలా ఒకే  పోజు (భంగిమ) లో కదలకుండా ఉండాలి.  ఒక్కొక్క ఆసనానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి . వాటికి ఒక నిర్దుష్టమైన  వరుసక్రమం  ఉంటుంది. 

     
వేల సంవత్సారాల క్రిందట  మహానుభావులైన  మన ఋషులు  యోగా ని కనిపెట్టారు.  యోగా  ఒక అందమైన కళ.   ఖర్చు లేని  మందు , వైద్యం.  .ఎవరిని ఏది అడుగక్కరలేదు. మనంతట మనం గాలి వెలుతురు చక్కగా వచ్చే చోట ఒక దుప్పటి గాని చాప గాని  పరచి  అరగంట రోజు చేయడమే. 

   
యోగా చేసుకోడానికి ఎక్కువ చోటు గాని , పరికరాలు గాని అవసరం లేదు.  ఖాళీ కడుపు తో చేయడం మంచిది.  అన్నం తిన్న తరువాత చేయద్దు.  మన స్నేహితులతో కలిసి యోగా చేస్తే మనకు సంతోషం గా ఉంటుంది.  కాలక్షేపం అవుతుంది.  

   
అంతర్జాతీయ సమైక్య రాజ్య సమితి  (UNO) యోగా ని  అంగీకరించి ప్రతి సంవత్సరం 21,జూన్ న  అంతర్జాతీయ యోగా దినం గా ప్రకటించింది.  ఇప్పటికీ అపుడే రెండు యోగా దినాలు గడిచేయి.  లక్షలాదిమంది  సామూహికంగా యోగా చేశారు.  ప్రపంచం లో అందరూ  యోగా కి జోహార్లు అర్పించారు.  

 
యోగా ఆసనాలు నెమ్మదిగా చేయాలి. గాలి ఎక్కువగా పీల్చాలి, లోపల పట్టి ఉంచాలి.  తరువాత నెమ్మదిగా వదలాలి.  ప్రాణాయామం అంటే ఇదే.  చాలామంది గురువులు ఇంకా పతంజలి గారు యోగా ని కనిపెట్టి అందులో ఆసనాలు తయారు చేసి అవి గ్రంథాలలో నో ఫలకాలలోనో పొందు పరిచారు.  బుద్దుడు , ఇంకా జైన మాట గురువులు కూడా యోగాసనాలు పాటించి, మెళకువలు తెలిసి యోగని అభివృద్ధి చేశారు.


      
బమ్ చికి  బమ్ చికి  చేయి యోగా   , ఒంటికి యోగా మంచి దేగా ,   అన్నాడు  ఒక మహా కవి అందరికీ అర్ధం అయ్యే భాషలో.


kvnmurty: please click on THANKS link above..... select brainliest answer
bindu5: thanks
kvnmurty: thanks for selecing brainliest
Similar questions