evarikina telugu vacha ikkada
Answers
English Version
images/logo.jpg
హోం
జనరల్ ఎస్సే
అంతర్జాతీయం
జాతీయం
రాష్ట్రీయం
ఆర్ధిక వ్యవహారాలు
ఇండియా & వరల్డ్
సైన్స్ & టెక్నాలజీ
పాలిటి
ముఖ్యమైనవి
కరెంట్ అఫైర్స్
వీడియో లెక్చర్స్
జనరల్ నాలెడ్జ్
ఈ బుక్స్
ప్రాక్టీస్ టెస్ట్స్
2017 | 2016
2015
ప్రాథమిక విద్య.. మిథ్యే
ప్రతి పిల్లవాడి సంపూర్ణ వికాసానికి సరైన విద్య ఎంతో కీలకమన్నారు మహాత్మ గాంధీ.మరి దేశీయ విద్యావ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు జాతిపిత ఆకాంక్షలను సాకారం చేస్తున్నాయా అంటే? లేదనే చెబుతోంది.. వార్షిక విద్యాస్థితి (అసర్) నివేదిక - 2016. స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ విద్యాట్రస్ట్ విడుదల చేసిన ఈ నివేదిక..
Career Guidance
దేశంలోని ప్రాథమిక విద్యా వ్యవస్థలో లోపాలను మరోసారి ఎత్తిచూపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక పాఠశాలలు పిల్లలకు కనీసం అక్షరాలు నేర్పడంలోనూ విఫలం అవుతున్నాయని పేర్కొంది. మూడో తరగతి పిల్లలు ఒకటో తరగతి, ఐదో తరగతి పిల్లలు రెండో తరగతి పాఠాలను చూసి కూడా చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సాధారణ తీసివేతలు, భాగాహారాలు చేయలేకపోతున్నారని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యావ్యవస్థ పరిశీలన కోసం 2005 నుంచి ప్రథమ్ విద్యాట్రస్ట్ ఏటా సర్వే నిర్వహిస్తుంది. 2016 సంవత్సరానికి గాను ట్రస్టు సభ్యులు దేశంలోని 589 జిల్లాల్లో పర్యటించారు. మొత్తం 17,473 గ్రామాలను సందర్శించి 3,50,232 కుటుంబాల వివరాలు సేకరించారు. ఆయా కుటుంబాల్లో ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 5,62,305 మంది పిల్లల స్థితిగతులను మదింపు చేసి నివేదిక రూపొందించారు.
సర్వేలో భాగంగా అన్ని రాష్ట్రాల నుంచి కలిపి మొత్తం 15,630 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల స్థితిగతులను లెక్కగట్టారు. ఈ పాఠశాలల్లో అభ్యాసన స్థాయి, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల చేరికలు తదితర అంశాల్లో పరిస్థితులను నమోదు చేశారు.
అక్షరాలు, అంకెలను గుర్తించలేని దుస్థితి
దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు.. అక్షరాలు చదలేకపోతున్నారని.. చిన్న చిన్న లెక్కలను చేయలేకపోతున్నారని అసర్ నివేదిక పేర్కొంది. ఈ అంశాల్లో మూడు, నాలుగు రాష్ట్రాలు పర్వాలేదనిపించినా.. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బిహార్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 3వ తరగతిలో ఉన్న పిల్లల్లో కేవలం 30 శాతం మంది ఒకటో తరగతి పాఠ్యాంశాలు చదవగలుగుతున్నారు. అంటే మిగతా 70 శాతం మంది కనీసం ఒకటో తరగతి పుస్తకాలను కూడా చదవలేకపోతున్నారన్నమాట. ఈ అంశంలో 61-70 శాతం స్కోరుతో కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఈ శాతం 31 - 60 మధ్య ఉంది.
కేవలం మణిపూర్ రాష్ట్రాంలోనే 51-65 శాతం మంది 3వ తరగతి విద్యార్థులు 1వ తరగతి లెక్కలు చేయగలుగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, సిక్కం, రాష్ట్రాల్లో ఈ సంఖ్య 41 - 50 శాతంగా ఉండగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు 0 - 10 శాతంతో అట్టడుగున ఉన్నాయి.