farmer importance in telugu
Answers
వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇంకా ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని కౌలు రైతులనీ అంటారు. పొలం పనుల్లో భాగంగా తాను పనిలో పెట్టుకునే ఉద్యోగులను రైతుకూలీలు అంటారుమన దేశంలో, రాష్ట్రంలో సారవంతమైన భూ ములు, అనుభవజ్ఞులైన కష్టపడే రైతులు, ఆదాయాలు పెరిగిన ప్రజా ప్రభుత్వాలు ఉండి కూడా అసంఖ్యాక రైతులు ఎందుకు అధోగతి పాలవుతున్నారు? అన్ని రంగాలు దినదినాభివృద్ధి సాధిస్తున్నా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే ఎందుకు కుచించుకుపోతున్నది? ఆర్థికాభివృద్ధి ఎగసిపడుతున్నదని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు వ్యవసాయాభివృద్ధిపై నీళ్ళు నమలడం ఎందుకు? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకకు తగ్గకుండా మొండి ధైర్యంతో రైతులు సేద్యం కొనసాగిస్తున్నారు కాబట్టే ఈ మాత్రం అన్నమైనా జాతికి దొరుకుతున్నది. వారు కూడా విరక్తితో ఒక ఏడాది కాడి పడేస్తే, మన దేశంలో ఉన్న 120 కోట్ల జనాభా గతి అధోగతి కాక తప్పదు. వ్యవసాయ రంగాన్ని ఇతర పరిశ్రమలతో సమానంగా పరిగణించి రైతుకు ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించి పెద్ద ఎత్తున నిధులు ప్రవ
మభ్యపెడుతున్నాయి. అలుపెరుగని శ్రామికుల్లా రైతులు బతుకు పోరు చేస్తూ జాతికి ఆహారాన్ని అందిస్తుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారిని బిచ్చగాళ్ళుగా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు సంఘటితమై ఉద్యమించవలసిన తక్షణావసరం నేడు ఎదురయ్యింది. ప్రభుత్వ విధానాలు ఏ రాజకీయ పార్టీ నాయకులకో సంబంధించినవి కావు. దేశంలో, రాష్ట్రంలో రైతాంగం దయనీయ దుస్థితిపై ప్రతి ఒక్కరూ జాలి ఒలకబోస్తున్నారు. కాని కనికరం లేని ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టడంలో కాఠిన్యం ప్రదర్శిస్తున్నాయి. అందుకే తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, రైతాంగ సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి, వ్యవసాయ రంగంపై జాతీయ స్థాయి చర్చ జరిగేలా చేశారు. ఆయన చేపట్టిన దీక్షకు పది పన్నెండు జాతీయ స్థాయి పార్టీల నేతలు మద్దతు తెలిపి రైతుల ఇబ్బందులపై దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇది మన రాష్ట్రంనుంచి మొదలు కావడం హర్షించదగిన పరిణామం.
, అందుకు తగ్గ వ్యూహం కేంద్ర, రాష్ట్ర పాలకులకు లేదు. విత్తనాల సేకరణనుంచి, పంటలను మార్కెట్ చేసే వరకూ రైతులకు రక్షణ కల్పించవలసిన రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. కానీ ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వంపై నెట్టింది. ఏడాదికి లక్ష 13 వేల కోట్ల రూపాయల బడ్డెట్ రూపొందించుకున్న, ధాన్యాగారంగా పేరు పొందిన ఈ ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? మన రాష్ట్రంలో సగటున రోజుకు 30 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితిలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల ఆత్మహత్యలకు వేరే కారణాలు ఉన్నాయంటూ వక్రభాష్యం చెబుతున్నారు.
hope it helps you ☺️♥️
Answer:
మనకు తినటానికి అవసరమయ్యే ఆహారాన్ని పండించే వ్యక్తే రైతు.
రైతు రాత్రి పగలు కష్టపడి పంటల్ని పండించి మనకు ఆహారాన్ని అందిస్తాడు.
రైతు కు మరో పేరు వ్యవసాయదారుడు.పంటల్ని పండించే విధానాన్ని వ్యవసాయం అంటారు అందుకే రైతును వ్యవసాయదారుడు అంటారు.
పంటల్ని పండించేవారినే కాకుండా కోళ్ళని , పశువుల్ని , చేపల్ని ,తేనెటీగల్ని , సిల్క్ పురుగుల్ని పెంచే వారిని కూడా రైతులనే అంటారు.
రైతు ధాన్యాన్నే కాకుండా పాలను కూడా ఉత్పత్తి చేస్తాడు.
చేపల్ని ,కోళ్ళని పెంచుతాడు రైతు.
ఈ విధంగా రైతు తన కుటుంబానికి కావాల్సిన ఆదాయాన్ని సంపాదించుకుంటాడు.
Explanation: