India Languages, asked by ithisisme, 10 months ago

few lines on I love my mother in telugu​

Answers

Answered by Anonymous
64

Answer:

నా జీవితంలో నా తల్లి అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఆమె పేరు మీనా. ఆమె చాలా అందమైన మరియు దయగల హృదయపూర్వక మహిళ. ఆమె మన అందరిని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఉదయాన్నే ఆమె పెరిగి, ఆమె ఇంటిని పూర్తయింది. ఆమె మాకు రుచికరమైన ఆహారాన్ని ఉడికించింది. ఆమె ఇంటిని చూసుకుంటుంది. నా ఇంటి పనిని చేయటానికి ఆమె నాకు సహాయం చేస్తుంది. ఆమె నాకు పాఠశాల కోసం సిద్ధంగా ఉంది. రాత్రి నా తల్లి నాకు మనోహరమైన కథ చెబుతుంది. క్రమశిక్షణలో ఉండి, మర్యాదగా ప్రవర్తించేలా ఆమె నాకు బోధిస్తుంది. ఆమె నా మొదటి గురువు. ఆమె నా అనారోగ్యం మరియు ఇతర చెడు రోజులలో ఆమె నిద్రలేకుండా రాత్రులు గడిపే వ్యక్తి. ఆమె సంతోషంగా నా సంతోషకరమైన క్షణాలలో ఉంటుంది మరియు నా ఇష్టాలు మరియు అయిష్టాలు అర్థం. నేను ఆమెతో నా మనస్సులో ఏమైనా భావాలను వ్యక్తపరుస్తాను. ఆమె చాలా మంచి గాయకుడు. ఉదయం 'భజన' పాడుతూ, నాకు సంతోషం కలిగించేది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక తల్లి మాత్రమే ఒకటి, వీరిలో మరొకరు మన హృదయాల్లో భర్తీ చేయలేరు.

<marquee behavior-move><font color="blue pink"><h1>hope it helps u...........</ht></marquee>

Answered by rambabu3956
3

Explanation:

అమ్మ...! ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో... ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ‘అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో’ అని ఒకరు, ‘ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ అమ్మా అనురాగం తీయని రాగం’అంటూ మరొకరు అమ్మ గొప్పదనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు. అమ్మను మించి దైవం ఉందా? అవును మరి అవతారమూర్తి కూడా అమ్మకు కొడుకే కదా.

అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్మ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకోని మనం జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం.

బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు. అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? మన భారతీయ సమాజం సైతం ‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు.. కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. నాన్నా అని అనం.. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి... ఓ అనుబంధం... ఓ ఆప్యాయత...ఓ ఆత్మీయత.

బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మన కంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మే పసిగడతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది... అందుకే అమ్మ పిచ్చి తల్లి. మనం తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తుంది.... ఏం నాన్నా ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏెమైపోతుంది..రా.. ఓ ముద్ద తిందువుగాని అంటుంది తప్ప, అర్ధరాత్రిదాకా ఎక్కడ తిరిగొస్తున్నావురా అని ప్రశ్నించదు... అందుకే అమ్మ ఓ అమాయకురాలు. పరీక్షల్లో తప్పామనే కోపంతో నాన్న తిడుతుంటే, పోనీలే ఈ సారి కాకపొతే వచ్చే ఏడాది చదివి పాసవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది. అందుకే అమ్మ మనకు కంచుకవచం.

మనకు ఏమాత్రం ఒంట్లో నలతగా ఉందంటే చాలు విలవిల్లాడిపోతూ, నిమిషానికోసారి బుగ్గల మీద, పొట్టమీద చెయ్యి పెట్టి చూస్తూ అమ్మో బిడ్డ వళ్లు కాలిపోతుందంటూ అంత మాత్రానికే ప్రార్థించని దేవుడుండడు. అందుకే అమ్మ చాదస్తపురాలు. సంగీత, సాహిత్య పరంగా, మాధుర్యంలోనూ అమ్మ లాలి పాటకు మించింది ఏముంది? ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్ర పుచ్చగలడు? అందుకే అమ్మ సంగీత కళానిధి. స్కూలు ఫీజులు కట్టాలన్నా, మనకు ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా, బలాదూర్ తిరుగుళ్లకు డబ్బు కావాలన్నా మన తరఫున నాన్నతో నానా తిట్లు తిని అవసరాలు, సరదాలు తీరుస్తుంది... అందుకే అమ్మ రాయబారి.

అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది ఆమె ప్రేమలా. ఎప్పుడూ మన గురించే ఆలోచన, మనమీదే ధ్యాస. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు. అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం. అందుకే అమ్మ ఓ ఐ స్పెషలిస్ట్. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేని వాడు కాదు అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. బిడ్డను ప్రేమగా చూసే ప్రతి తల్లి ‘మదర్ థెరిసా’యే. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ.. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఆప్యాయంగా అమ్మ కళ్లలోకి ఒక్కసారి చూస్తే సమస్త లోకాలు కనిపిస్తాయి. మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.

Similar questions