few lines on plastic advantages and disadvantages in telugu
Answers
Answer:
no i know only English & Hindi
please follow me on Brainly & Instagram
Answer:
ప్లాస్టిక్ అంటే పోలిమర్లు -మోనోమర్లు అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో, పునరుక్తమయ్యే యూనిట్లు “ఎథిలిన్”. పోలి ఎథిలిన్ ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినపుడు, అవి పొడవైన కర్బన అణువుల చెయిన్లను ఏర్పరుస్తాయి. ఇందులో ప్రతి కార్బన్ రెండు హైడ్రోజన్ పరమాణువులతో బంధం ఏర్పరచుకుంటుంది.
ప్లాస్టిక్ స్వతహాగా విషపూరితం లేదా హానికరం కాదు. కాని సేంద్రీయ మరియు రసాయనాల రంగులు, పిగ్ మెంట్లు, ప్లాస్టిసైజర్లు, యాంటి ఆక్సిడెంట్లు, స్టెబిలైజర్లు మరియు ధాతువులు వంటి ఎడిటివ్లతో ప్లాస్టిక్ సంచులు తయారుచేస్తారు. ప్లాస్టిక్ సంచులకి తళతళ లాడే రంగుని ఇవ్వడానికి ఉపయోగించే రంగులు మరియు పిగ్ మెంట్లు, పారిశ్రామిక ఎజోడైలు. ఇందులో కొన్ని కేన్సరు కలుగచేసే పధార్థాలు ఉన్నాయి. ఈ సంచులలో ఆహార పదార్థాలు కట్టినప్పుడు అవి కలుషితమౌతాయి. పిగ్మెంట్లలో ఉండే కాడ్మియం వంటి బరువైన ధాతువులు కూడా చేరి ఆరోగ్యానికి హానికరమౌతాయి
ప్లాస్టిసైజర్లు అనేవి తక్కువ బాష్పశీల స్వభావముగల సేంద్రీయ ఎస్టర్లు. అవి, ఆహార పదార్థాలకి శ్రవించిడం ద్వారా వలస పోగలుగుతాయి. ప్లాస్టిసైజర్లలో కూడా కేన్సరు కలుగ చేసే పదార్థాలని కలిగి ఉంటాయి. యాంటి ఆక్సిడింట్లు మరియు స్టెబిలైజర్లు సేంద్రీయ మరియు అసేంద్రీయ రసాయనాలు. ఇవి మేన్యుఫేక్చరింగు విధాన సమయంలో, ఉష్ణ వియోగం చెందకుండా రక్షిస్తాయి.
కాడ్మియం మరియు సీసం వంటి విషపూరిత ధాతువులు, ప్లాస్టిక్ సంచుల తయారీలో ఉపయోగించినప్పుడు కూడా స్రవించి ఆహార పదార్ధాలను కలుషితం చేస్తాయి. కాడ్మియం చిన్న మోతాదులలో శోషించినపుడు, వాంతులు కలుగజేస్తుంది. గుండె పెద్దది కావడానికి కూడా కారణమౌతుంది. ఎక్కువ కాలం సీసానికి గురైతే, మెదడు టిష్యూలు క్షీణించి పోతాయి.
ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార లేదా క్లాత్ సంచులని వినియోగించడాన్ని జనరంజకం చేయాలి మరియు ఆర్ధికపరమైన ఇన్సెంటివ్లతో ప్రేరేపించాలి. అయినప్పటికీ, పేపరు సంచులు తయారీలో చెట్లని కొట్టి వాటిని ఉపయోగించడం జరుగుతుంది, కాబట్టి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ముఖ్యముగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులని మాత్రమే ఉపయోగించాలి, మరి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ని అభివృద్ధి చేయడానికి పరిశోధన జరుగుతుంది.ఇదీ నేటి ప్రపంచానికి చాలా హానికరం . అందుకోసం జనపనారతో తయారు చేసిన సంచులను ఉపయోగించాలి. ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో కరిగిపోవుటకు 10లక్షల సంవత్సరాలు పడుతుంది. కావున వీలైనంతవరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి.(మార్పు చేసింది