శ్రీరాముడు సైన్యంతో లంకా నాగరాన్ని చేరిన వృతంతాన్ని వివరించండి
give me a short answer
Answers
Answered by
1
Answer:
- శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.
- విశ్వకర్త కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు.
- వందయోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.
- శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
- సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు.
- లంకను నాలుగువైపుల నుండీ సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు.
- అంగదుని చేతిలో రావణకుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
- ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు.
- ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు లక్ష్మణుడు.
- సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్లాడు.
- ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది.
- ‘నా వంశ ప్రతిష్ఠ నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెరనుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన . ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహముంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చు’నని శ్రీరాముడు అన్నాడు.
- శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే శరణ్యమని భావించింది.
- అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు.
- ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు.
Similar questions