India Languages, asked by khankarim5402, 1 year ago

grandhalayam avashyakta essay in telugu matter

Answers

Answered by ragasanjana06
1

Explanation:

దేవుళ్ళను పూజించే చోటు ఆలయం. ఆలయం పవిత్రమైన చోటు. గ్రంథాలయం కూడా పవిత్రమైనది. అక్కడ గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలలో ఎంతో నిగూఢమైన జ్ఞానం దాచి ఉంటుంది. గ్రంథాలయాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

గ్రంథాలయాలలో ప్రతి ఒక్కరు గ్రంథాలను చదవి తమ జ్ఞానాన్నిపెంపొందించుకోవచ్చు. మన ముందు తరాలవారు తమ జ్ఞానం తమతోనే ఆగిపోకుండా ఉండటానికి గ్రంథాలు రచించారు. జ్ఞానం మనకు ఎన్నో విధాలుగా మనకి ఉపయోగపడతుంది. మన జీవితంలో ఉన్న పరిసస్థితులను ఎలా ఎదుర్కోవాలో మనకు నేర్పిస్తుంది. జ్ఞానం మనకు మార్గదర్శనం చేస్తుంది.

గ్రంథాలయాలు అందరిని గ్రంధాలను చదవమని ప్రోత్సహిస్తుంది. పేదవారికి ఎంతో సహాయం చేస్తుంది. ధనవంతులు అన్ని గ్రంధాలు కొనుక్కోరు కనుక గ్రంథాలయలు వారికి కూడా సహాయపడుతుంది. జాతి కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు గ్రంథాలను చదువుకోవచ్చు.

చదవడమనే అనే మంచి లక్షణాన్ని అలవర్చుకోవటానికి సహాయపడతుంది. ఏ రోజు పుస్తకం మనల్ని చెడు మాట్లాడమని గాని చెడు చూడమని గాని చెడు వినమని గాని చెడు చేయమని గాని పుస్తకం మనల్ని ప్రోత్సహించదు. పుస్తకం మనకు మంచి స్నేహితుడు. చిరిగిపోయిన చొక్కానైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోమని పెద్దలు అందుకే అన్నారు.

గ్రంథాలు చరిత్ర యొక్క భాగాలు. వాటి ద్వారా పూర్వంలో జరిగిన సంఘటలను తెలుసుకోవచ్చు. ఈనాటికి ఆనాటికి జరిగిన మార్పులను గ్రంథాలను చదవడం ద్వారా తెలుసుకోవచ్చు.

pls make it as the brainliest

Similar questions