Greatness of birds in Telugu
Answers
Answer:
పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరి వాటి ఆహారాన్ని అవే సమకూర్చుకునేలా తయారేంతవరకు తల్లిపక్షి వీటికి ఈ పొదిగిన గూడులోనే ఆహారాన్ని అందిస్తూ పెంచుతుంది. సాధారణంగా పక్షిగూడును గూడు అనే వ్యవహరిస్తారు. ఈ పక్షిగూళ్ళు పుల్లలు, గడ్డి, ఆకులు వంటి సేంద్రీయ పదార్థాల మిళితమై ఉండవచ్చు, ఇవి రకరకాల పరిమాణాలలోను, వివిధ ఆకారాలలోను ఉంటాయి. ఇంకా రాయి, చెట్టు, లేక భవనాలలోని రంధ్రాలు కూడా గూడులుగా ఉండవచ్చు. మానవ నిర్మిత పదార్థాలైన దారం, ప్లాస్టిక్, వస్త్రం, కాగితం వంటివి కూడా ఈ గూళ్ళ నిర్మాణంలో ఉపయోగిస్తుండవచ్చు. గూళ్ళలో నివాసాల అన్ని రకాలు చూడవచ్చు. కొన్ని గూళ్ళు గుండ్రంగా ఉండగా, కొన్ని గూళ్ళు పైకప్పు లేకుండా ఉంటాయి. కొన్ని గూళ్ళు కేవలం పుల్లలలో నిర్మితమై కఠినంగా ఉంటాయి, కొన్ని చాలా మృదువుగా ఉంటాయి. హమ్మింగ్బర్డ్ వంటి చిన్న పక్షుల గూళ్ళు కేవలం అవి పట్టేంత పరిమాణంలోనే ఉండగా, పెద్ద గ్రద్దల గూళ్ళు కారు అంత పరిమాణంలో చాలా పెద్దవిగా, చాలా బరువుగా ఉంటాయి. పక్షులు వాటి గుడ్లను, వాటి గూళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి.
here is the answer for your question
పక్షులు అంతరోష్ణ లేదా ఉష్ణ రక్త జీవులు.
ఎగరడానికి అనుకూలంగా ఉండడానికి దేహం సాధారణంగా కదురు ఆకారంలో ఉండి కుదించినట్లు అమరి ఉంటుంది. వాయుగోణులు ఉండటం వల్ల తేలికగా ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పుచెంది ఉంటాయి. చరమాంగాలు పెద్దవిగా ఉండి జీవి దేహం బరువును మోయడానికి తోడ్పడతాయి. ఆహార సంగ్రహణ, ఈదడం, చెట్టు కొమ్మలను పట్టుకోవడం మొదలయిన వాటికి చరమాంగాలు ఉపయోగపడతాయి.
External anatomy of a bird: 1 Beak, 2 Head, 3 Iris, 4 Pupil, 5 Mantle, 6 Lesser coverts, 7 Scapulars, 8 Median coverts, 9 Tertials, 10 Rump, 11 Primaries, 12 Vent, 13 Thigh, 14 Tibio-tarsal articulation, 15 Tarsus, 16 Feet, 17 Tibia, 18 Belly, 19 Flanks, 20 Breast, 21 Throat, 22 Wattle
శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది. ఇవి బాహ్య అస్థిపంజరంలో భాగంగా ఉంటాయి. ఇవి నాలుగు రకాలు. అవి: 1.కాటోర్ ఈకలు, 2. పైలోప్లూమ్ లు, 3. క్విల్ ఈకలు, 4. డేన్ ఈకలు.
వీటిలో ఒకే ఒక గ్రంథి (తైల గ్రంథి లేదా ప్రీన్ గ్రంథి) తోకపై ఉంటుంది. ఇది క్విల్ ఈకలపై మైనపు పూతను ఏర్పరుస్తాయి.
పక్షుల అస్థిపంజరంలోని ఎముకలు వాతలాస్థులు. అస్థి మజ్జ ఉండదు. మోనో కాండైలిక్ కపాలం ఉంటుంది. విషమ గర్తి కశేరుకాలు ఉంటాయి. పర్శుకలు ద్విశిరోభాగంతో ఉంటాయి. కొన్ని కశేరుకాలు కలియడం వల్ల సంయుక్త త్రికం (Synsacrum) ఏర్పడుతుంది. ఉరోస్థి ఉదర మధ్య భాగంలో కెరైనా ఉండి ఉడ్డయక కండరాలు అతుక్కోవడానికి తోడ్పడుతుంది. అంసఫలకం (Scapula) పట్టాకత్తి ఆకారపు ఎముక. జత్రుకలు రెండూ కలిసి ఫర్కులా లేదా విష్ బోన్ ఏర్పడుతుంది.
కండర వ్యవస్థ వైహాయన జీవనానికి అనుకూలంగా రూపాంతరం చెందింది. రెక్కల విధినిర్వహణలో తోడ్పడే కండరాలను ఉడ్డయక కండరాలు (Flight muscles) అంటారు.
ఆహారవాహిక అన్నాశయంగా విస్తరించి ఆహార పదార్ధాల నిల్వకు తోడ్పడుతుంది.
నాలుగు గదుల గుండె ఉంటుంది. సిరాసరణి, మూలమహాధమనులు ఉండవు. కుడి దైహిక చాపం ఉంటుంది.
ఊపిరితిత్తులు స్పంజికాయుతంగా ఉంటాయి. ఇవి 9 వాయుగోణులను కలిగి ఉంటాయి. పక్షులలో స్వరపేటిక వల్ల కాక ఉబ్బిన వాయునాళం ప్రాథమిక శ్వాసనాళికలకు మధ్య గల శబ్దిని (Syrynx) ద్వారా శబ్దం ఉత్పత్తి అవుతుంది.
మూత్రపిండాలు అంత్యవృక్కాలు. మూడు లంబికలను కలిగి ఉంటాయి. మూత్రాశయం ఉండదు. యూరిక్ ఆమ్లం విసర్జక పదార్థం.
Hope this helps you
Mark me as brainliest