లండమ్మ అంటారు.
ఇంతకుము
పరిస్థితులు
జీవగడియా
H77289
ఇంతకూ ఈ గడియారాలను
Answers
Answer:
గడియారం (ఆంగ్లం: Watch) మనకు సమయం తెలుసుకోవడానికి ఉపయోగపడే యంత్రము, నిత్యావసర వస్తువు.
ఇవి చిన్నవిగా సులువుగా మనతో ఉండేటట్లుగా తయారుచేస్తారు. కొన్ని గడియారాలలో సమయంతో సహా రోజు, తేదీ, నెల, సంవత్సరము వంటి వివరాలు కూడా తెలియజేస్తాయి. ఆధునిక కాలంలో ఎక్కువమంది గడియారాన్ని చేతికి పెట్టుకొనడం మూలంగా వీటిని చేతివాచీ అంటారు. కొన్ని గోడ గడియారాలు ప్రతి గంటకి శబ్దం చేస్తాయి.
పాతకాలంలోని యాంత్రికమైన గడియారాలు స్ప్రింగ్ తో తిరిగేవి. వీటికి రోజూ లేదా రెండురోజుల కొకసారి 'కీ' ఇవ్వాల్సి వచ్చేది. కొన్ని రకాలలో ధరించిన వాని చేతి కదలికల నుండి తయారైన యాంత్రిక శక్తిని ఉపయోగించి పనిచేస్తాయి. ఆధునిక కాలంలో ఇవి ఎక్కువగా బాటరీలతో నడుస్తున్నాయి.
కొన్ని గడియారములలో మనము ఎప్పుడు అవసరము అనుకుంటే అప్పుడు గంట మోగే సదుపాయం కూడా ఉంటుంది. ఉదాహరణకు మనము నిద్ర లేవడానికి అలారం పెట్టడం.
పూర్వము ఎండ-నీడల సహాయముతో కాలమును గణించేవారు. అంతే కాక ఇసుక గడియారాలు కూడా వాడుకలో ఉండేవి. ఈ ఇసుక గడియారాల్లో రెండు బాగాలుగా ఉంటాయి. ఒక భాగంలో ఇసుక నింపబడి ఉంటుంది. మొత్తం ఇసుక ఒక భాగం నుంచి మరొక భాగానికి రాలడానికి ఒక నిర్దిష్టమైన సమయం పడుతుంది.
ప్రస్తుత కాలంలో ముల్లులు లేకుండా అంకెల గడియారములు (డిజిటల్ గడియారాలు) కూడా ఉన్నాయి. వీటిలో అంకెలను డిస్‌ప్లే చేయడానికి ఎలక్ట్రానిక్ లెడ్ లను ఉపయోగిస్తారు. వీటికి చాలా తక్కువ విద్యుత్తు ఖర్చవుతుంది. అలాగే సమయాన్ని మాటలలో కూడా చెప్పే సౌకర్యం కూడా ఉంటుంది. ఇటువంటివి అంధులకు చాలా ఉపయోగకరము.
Explanation: