India Languages, asked by Anonymous, 11 months ago

hey guys..

ᴏɴʟʏ ᴛᴇʟᴜɢᴜ ᴘᴇᴏᴘʟᴇ ᴀɴsᴡᴇʀ ᴛʜɪs.....

అలంకారాలు ఎన్ని..? వాటిని వివరించండి.....

don't give unnecessary answers plzz ...​

Answers

Answered by madhav93930
5

HEY BUDDY

HERE'S YOUR ANSWER

HOPE IT HELPS YOU MARK IT AS A BRAINLIST

Attachments:
Answered by Anonymous
8

1. శబ్దాలంకారములు

శబ్దమాత్ర ప్రధానములయినవి శబ్దాలంకారములు.

వృత్త్యానుప్రాసాలంకారము : ఒక హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడింది.

ఛేకానుప్రాసాలంకారము : అర్థ భేదము గల రెండేసి అక్షరములు వ్యవధానము లేకుండా వెనువెంటనే వచ్చుట.

లాటానుప్రాసాలంకారము : అర్థభేధము లేక తాత్పర్య భేదము కలుగునట్లు ఒక పదము రెండు సార్లు ప్రయోగింపబడిన అది లాటానుప్రాసము.

యమకాలంకారము : అర్థభేదముగల అక్షరముల సమూహమును మరల మరల ప్రయోగింపబడినచో దానిని యమకము అంటారు.

ముక్తపదగ్రస్తాలంకారము : విడిచిన పద భాగము అవ్యవధానముగా మరల గ్రహించుచు వ్రాయబడిన అది ముక్తపదగ్రస్తము.

అంత్యప్రాసాలంకారము : మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్య ప్రాసం అవుతుంది.

2. అర్థాలంకారములు

అర్థ విశేషములను బట్టి వచ్చునవి అర్థాలంకారములు

*ఉపమాలంకారం:ఉపమానానికి, ఉపమేయానికి సామ్య రూపమైన సౌందర్యాన్ని సహృదయ రం చెప్పడం ఉపమాలంకారం.

*ఉపమాలంకారం: ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని అరోపించడం రూపకాలంకారం. ఉపమేయమునకు ఉపమానం తోటి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించటం రూపకం. ఒకటి అభేద రూపకం, రెండవది తాద్రూప్య రూపకం.

*అతిశయోక్త్యలంకారము : చెప్పవలసిన దానిని ఎక్కువ చేసి చెప్పడం, గొప్పగా చెప్పడం అతిశయోక్తి అలంకారం

*అర్థాంతరన్యాసాలంకారం : సామాన్యం చేత విశేషం గాని, విశేషం చేత సామాన్యం గాని సమర్థింప బడితే అది అర్థాంతరన్యాసాలంకారం

*యథాసంఖ్య అలంకారం : ఒక దాని తరువాత ఒకటిగా వరుసగా సమాన సంఖ్యాకాలయ్యే వాటి యొక్క సముదాయం యథాసంఖ్య లేదా క్రమ అలంకారం.

HOPE IT HELPS U...

Ekkuva ardhalankarale vadatharu.

Vruthyanuprasa and Anthya prasa appudappudu chekanuprasa vadatharu.

Upto 10th idhi .Ivi vaste chalu.

Explanation:

Similar questions