hi good morning dear friends
రవికాంతి రామయ్యగుప్త కవి గురించి వివరించండి
Answers
Answer:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వెలుగులోకి వచ్చిన కవులలో ముఖ్యులు కీ.శే. శ్రీ రావికంటి రామయ్య గుప్త గారు. వారు రచించిన నగ్నసత్యాలు శతకంలోని పద్యం ఏడో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో చోటు సంపాదించుకుంది. కవిరత్న, మంత్రకూట వేమన, రెడీమేడ్ పోయెట్ గా పేరు గాంచిన ఆయన పూర్వ కరీంనగర్, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన వారు. అనేక శతకాలతో పాటు వారు బుర్రకథలు, ఏకాంకికలు, గొల్లసుద్దులు, నాటకాలు, గేయకావ్యాలు, కీర్తనలు, పాటలు రచించారు. అన్యాయం, అక్రమాలపై అక్షరాస్త్రాలు సంధించే వారు. కవిత్వమే ఊపిరిగా జీవించారు. అసలు సిసలు ప్రజాకవిగా పేరుగాంచారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువరించిన పుస్తకంలో కూడా ఆయన గురించి ప్రస్తావించారు. నీతి, నిజాయతీ, నిర్భీతి, నిర్మొహమాటం, నిష్కల్మశం, నిరాడంబరం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయన సొంతం. నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయునిగా సేవలందించి వేలాదిమంది శిష్యులను తీర్చిదిద్దారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందారు.
Explanation:
pls mark as brainlist please