India Languages, asked by Angelthakkar4862, 9 months ago

How can we write a essay writing in Telugu about how to make society plastic free?

Answers

Answered by Anonymous
4

Hello!!

ప్లాస్టిక్ తో ప్రమాదమే ....

ప్లాస్టిక్ ... మన నిత్య జీవితంలో భాగమైపోయింది. బకెట్లు, డబ్బాలు, సంచులు... ఇలా ఇంట్లో ఏ మూల చూసినా కచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ కనిపిస్తూనే ఉంటుంది. అయితే ప్లాస్టిక్ వస్తువుల కన్నా ప్లాస్టిక్ సంచుల వాడకమే ప్రమాదం. పలుచగా ఉండే ఈ ప్లాస్టిక్ సంచులను అతిగా వాడి, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, వీటిని రీసైకిల్ చేసే అవకాశం లేకపోవడం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదమే ఎదురవుతుందని పర్యావరణ హితులు భయపడుతున్నారు. ప్లాస్టిక్ అనే పదం ప్లాస్టికో అనే గ్రీకుపదం నుంచి పుట్టింది.  

  దీనిని క్రూడ్ ఆయిల్ తో తయారుచేస్తారు. అంటే ముడి చమురు అన్నమాట. దీనిని సుమారు 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు బాగా వేడి చేస్తారు. అందులో దొరికే 'నాఫ్తా' అనే పదార్థాన్ని తిరిగి 800 డిగ్రీల వరకు వేడి చేసి, తరవాత మళ్లీ 200 డిగ్రీల ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు. ఇలా చేసినప్పుడు శక్తిమంతమైన 'పాలిమర్స్‌' అనే అణుగొలుసులు ఏర్పడతాయి. ఈ పాలిమర్లకు వివిధ రసాయనాలను కలపడం ద్వారా 'ప్లాస్టిక్‌ పదార్థాలు' తయారవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు వంద మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. ప్రాథమికంగా ప్లాస్టిక్ హానికరమైనది కాదు. కానీ ప్లాస్టిక్ సంచుల తయారీ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రమాదకరమైన రసాయనరంగులు, ప్లాస్టిసైజర్లు కలుపుతున్నారు. రసాయన రంగుల్లో ఆరోగ్యానికి హాని చేసే కాడ్మియం, సీసం వంటివి ఉన్నాయి. ఇవి భూమిలో కలిసిపోవు. సరికదా భూసారాన్ని కూడా నాశనం చేస్తాయి. వాటిని జంతువులు అనారోగ్యాల బారిన పడుతున్నాయి. ప్రతి ఏడాది రెండు మిలియన్ల పక్షులు, సముద్ర జీవులు కేవలం ప్లాస్టిక్ సంచుల వల్లే చనిపోతున్నాయి. అందుకే ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నిషేదించడం మంచిది. వాటి స్థానంలో జనపనార సంచుల్ వాడకాన్ని పెంచాలి.

  బ్రిటన్, జపాన్లలో ‘స్పడ్ వేర్’ గా పిలిచే బంగాళాదుంపలతో చేసిన సంచుల్ని వాడుతున్నారు. ఇది ప్లాస్టిక్‌ కంటే చాలా తక్కువ ధరకే వస్తుంది. బంగాళదుంప నుండి తయారుచేసే స్టార్చ్‌కు బయో పాలిమర్‌ ప్లాస్టిక్‌ లక్షణాలు ఉంటాయి. దీనికి భూమిలో కరిగిపోయే గుణం చాలా ఎక్కువ. కనుక హానికారకం కాదు. కావాలనుకుంటే రీసైక్లింగ్ పద్ధతిలో కొత్త వస్తువులు తయారుచేసుకోవచ్చు .

hope it helps u ....

plz mark it as brainliest

Similar questions