India Languages, asked by Tweet2560, 1 year ago

how lord rama ruled his kingdom in telugu language and the people opinions on Rama in telugu

Answers

Answered by yeshwanthkumar22
7

Answer:

              శ్రీ రాముడు రాక్షస సంహారం ఒక్క విషయం లోనే మహోన్నతి చెందలేదు. రాముడు మన చరిత్ర లోని రాజులందరిలోకి అత్యంత ఆదర్శప్రాయమైన రాజు. రాముని రాజ్యం లోని ప్రజలకి అసలు కష్టాలే ఉండేవి కాదట. ఒక వేళా ఉన్నప్పటికీ ఆ సమస్య ను పరిష్కరించే వరుకు రాముడు ఓటమి ని ఒప్పుకునే వాడు కాదట. ఒక రాజ్యం ఏదైనా సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉంది అని చెప్పడానికి ఉదాహరణ కి రామరాజ్యం అని పిలుస్తారు. రాముని రాజ్యం లోని ప్రజలు పేద, ధనిక, వర్ణ, కుల, మత భేద భావాలు లీకులేకుండా సుఖసంతోషాలతో జీవనం సాగించేవారంట. తన రాజ్యం లోని ప్రజల కష్టాలను తీర్చడానికి శ్రీ రాముడు తన శాయశక్తులా ప్రయత్నించేవాడంట.

                          శ్రీ రాముడు చాలా ఆదర్శప్రాయమైన గుణాలు కలిగినటువంటి రాజు. అతను తన జీవితకాలం మొత్తం మీద ఒక్క సారి కూడా అసత్యం పలకలేదు. తన పితృవాక్కు పరిపాలన కోసం అడవులకు వెళ్ళడానికి సైతం వెనకాడ లేదు. శ్రీ రాముడు ఏక పత్నీవ్రతుడు. అతని రాజ్యం లోని ప్రజలు అతన్ని దేవుని గా పూజించేవారు. ప్రజలు శ్రీ రాముని పట్ల అపారమైన భక్తి భావాలు కలిగి ఉండేవారంట. అందువలనే శ్రీ రాముని దేవుడు గా పోలుస్తారు అనడానికి ఎటువంటి సందేహం లేదు.

Similar questions