India Languages, asked by chaitu8985, 1 year ago

How to prepare karapatram in telugu


Answers

Answered by poojan
23

ఒక మంచి కరపత్రం  రాయుట ఎలా ?

  • ముందుగా కరపత్రం దేని గురించి ఐతే తయారు చెయ్యాలనుకుంటున్నామో ఆ విషయం పై పూర్తి అవగాహన తెచ్చుకోవాలి.  

  • కరపత్రంకి ఒక పేరు పెట్టాలి. ఆ పేరు ఆయా సంబంధిత ప్రజలను ఆకర్షించేదిలా పెడితే మంచిది.  

  • తరువాత, ఆ పేరుకు తగ్గట్టుగా, సంబంధిత అంశం పై సమాచారం ఇవ్వాలి. అలా రాసే మాటు ఎక్కువ మోతాదులో ఉండకూడదు. చిన్నగా, తక్కువ అక్షరాలతో, సరళమైన భాషలో వీలైనంత ఎక్కువ సమాచారం ఇవ్వాలి.  

  • గుర్తుపెట్టుకోండి, ఎక్కువ రాస్తే చదివేవారు చదవరు. తక్కువలో ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడమే ఉత్తమం. పాయింట్లు వారీగా రాస్తే మరియు మంచిది. మీ ఈ కరపత్రంలో ఉన్న సమాచారం ప్రజలకు ఆ అంశం తమ రోజు వారిలో  ఎలా ఉపయోగపడుతుందో తెలియజేయండి.  

  • ఆఖరిలో మిమ్మల్ని సంప్రదించదానికి ఏయ్ సమాచారం ఐతే కావాలో అవి జత చేయండి.  

  • కరపత్రం డిజైన్ విషయానికి వస్తే ఆర్భాటంగా కాకుండా తేలికగా చూడచక్కనైనదిగా ఉండాలి. మీ కరపత్రం యొక్క డిజైన్, రంగు ఎప్పుడూ కూడా సమాచారాన్ని అధికమించినదిలా ఉండకూడదు.

Learn more :

1. Inviting my friend to sankranti holidays letter writing in telugu​

https://brainly.in/question/14590444

2. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?

brainly.in/question/16066294

Answered by AB1012
2

Explanation:

కరపత్రంను ఇంగ్లీషులో flyer, Flyer (pamphlet), flier, circular, handbill or leaflet అని అంటారు. తెలియపరచాలని భావించిన ప్రకటనను ఒక కాగితంపై ముద్రించి, దానిని ఉత్తరం ఇచ్చునట్లుగా ప్రతి ఇంటికి పంచిపెట్టడం లేదా బహిరంగ ప్రదేశాలలో పంపిణీ చేయటం చేస్తుంటారు. ఈ విధంగా పంచే కాగితాలను కరపత్రాలు అంటారు. ఈ కరపత్రంలతో ప్రచారం చాలా సులభమైనది, వేగవంతమైనది, తక్కువ ఖర్చుతో అందరికి అందుబాటులో ఉంది.వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా అభ్యర్ధనల నిమిత్తం, సమాజిక కార్యక్రమాల ఆహ్వానాల నిమిత్త ఈ కరపత్రంలను ఉపయోగిస్తుంటారు:

రెస్టారెంట్ లేదా నైట్ క్లబ్ వంటి చోట్ల వస్తువు లేదా సేవను ప్రోత్సహించడానికి.

మత ప్రచారం ద్వారా ఆ మతం యొక్క ఆదర్శ భావాలు తెలియ చేయడానికి.

రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి తరపున రాజకీయ ప్రచార కార్యకలాపాలు చేయడానికి.

కరపత్రాలను సాయుధ పోరాటంలో ఉపయోగిస్తున్నారు: ఉదాహరణకు సాయుధ పోరాట యోధులకు గాలిలో కరపత్రాలను చేరవేయడం ద్వారా వ్యూహ సమాచారాన్ని అందించి మానసికంగా చేయడానికి.

న్యూయార్క్ సిటీలో కరపత్రాలు అందజేస్తున్న చిత్రం (1973)

ఈ కరపత్రంలను ముఖ్యంగా A4, A5, DL, A6 సైజులలో ముద్రిస్తారు.

Similar questions