I.
| విని, అర్థంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. త్యాగం అంటే ఏమిటి? త్యాగంలోని గొప్పతనం ఏమిటి?
ఇతరులకోసం, సమాజంకోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పండి.
2.
Answers
Answered by
8
- త్యాగమనేది ఒక గొప్ప శక్తి. ఈ శక్తి కలిగినవారు ఎంతో గొప్పవారవుతారు. చాలామంది త్యాగం చేయటం ఒక పిరికితనంగా భావిస్తారు. సహనాన్ని కూడా పిరికితనమనుకొని తమను తాము వంచన చేసుకుంటారు. త్యాగంతో పాటు సహనం కూడా ఎంతో గొప్ప శక్తి, త్యాగమంటే వస్తువైభవాలు, వ్యక్తులు, పరిస్థితులపైన మన అధికారాన్ని వదిలిపెట్టడం. ఎన్నోసార్లు ఈ అధికారాన్ని వదిలిపెడతాం కానీ ఇష్టంతో సంతోషంతో ఇతరుల సుఖాన్నాశించి సమాజ శ్రేయస్సు కోసం చేస్తే అది సత్వ గుణమనబడుతుంది. భయం, స్వార్థం, మొండితనాలతో బలవంతంగా చేసిన త్యాగం రజోగుణం, తమోగుణాలతో కూడిన త్యాగమనబడుతుంది. చాలాసార్లు వ్యక్తి స్వార్థానికి లోబడి త్యాగం చేస్తాడు. నేను కొద్దిగా త్యాగం చేస్తే ఎంతో గొప్ప లాభం దొరుకుతుందనుకోవడం రజోగుణ త్యాగం. కొన్నిసార్లు వ్యక్తి మొండితనంగా త్యాగం చేస్తాడు.
- నిజానికి త్యాగమనేది ఎంతో లోతైనది, విలువైనది. ఒకసారి త్యజించిన వస్తువు గురించి మనసులో ఆలోచన కూడా రాకపోవడమే త్యాగానికి సరైన అర్థం. అంటే త్యాగాన్ని కూడా త్యజించాలి. ఒకవేళ ఎవరికైనా త్యాగం చేసి నేనేమైనా తక్కువగా త్యాగం చేశానా ఏమిటి? అనే సంకల్పమొచ్చినా కూడా చేసిన త్యాగానికి ఫలితముండదు. నిజమైన సుఖాన్ని పొందాలంటే త్యాగమే ఆధారం. మోహాలోభాలలో దేనికైనా లోబడి ఉన్నవారు మనస్ఫూర్తిగా త్యాగం చేయడం వారి భాగ్యానికి నిదర్శనం. ఇందులో కష్టమనేమీ ఉండదు. ఎందుకంటే దీని ఆధారంతో ఆత్మకు అసలైన సుఖం లభిస్తుంది. విషయ వికారాలను, చెడు అలవాట్లను, వస్తువైభవాలు, సంబంధాలను మనసావాచాకర్మణా త్యాగం చేయడమనేది సత్యమైన త్యాగంలో భాగమే. అప్పుడే మనకు సత్యమైన శాంతి అనుభవమవుతుంది. కోరికలను త్యజించిన వారే శ్రేష్ఠాత్మలనబడతారు.
- త్యాగం చాలా గొప్ప శక్తి కావటం వల్ల వ్యక్తి ఎంతో శక్తివంతుడవటమే గాక ఎందరో ఆత్మలకు ప్రేరణ నిచ్చినవాడవుతాడు. రాజయోగ సాధనచేసే ఆత్మలో త్యాగమనే శక్తి నిండుతూ ఉంటుంది. వారి మనసు బుద్ధిలో ఎల్లప్పుడూ నేనొక పవిత్రమైన ఆత్మననే శ్రేష్ఠ చింతన ఉంటుంది. ఈశ్వరుని పట్ల నిజమైన ప్రేమ ఉన్నవారు దేన్నైనా సహజంగానే త్యాగం చేస్తారు.
- ఈ ప్రపంచాన్ని వదిలి సన్యసించడం అనేది పిరికితనం లేక పలాయనవాదం. రాజయోగం మనకిచ్చే శిక్షణ ఏమంటే ఈ సమస్తమైన వస్తువైభవాలు, వ్యక్తులు మన మధ్య ఉన్నప్పటికీ మన దృష్టి వాటిని ఆకర్షించరాదు. వేటిపైనా లోభమోహాలు ఉత్పన్నంకానపుడే సాత్విక త్యాగం చేయగలం. తనను తాను సుఖంగా ఉంచుకోవడానికి ఎందరినో బాధ పెట్టడం నిజమైన సుఖం కాదు. ఇతరుల సుఖంలోనే మన సుఖముందని గ్రహించి మనం ఇతరులకు సుఖాన్ని ఇవ్వగలిగితే మనం వారి ఆశీస్సులను పొందగలం. మనమిపుడు వ్యసనాలు విషయవికారాలు మొదలైన అపవిత్రతను త్యజించాలనే దృఢ సంకల్పం చేసి ప్రతిజ్ఞ చేద్దాం. ఈ త్యాగం ఆధారంగా మనకు ఉజ్జ్వలమైన భాగ్యం తయారవుతుంది
ఇది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను.... నన్ను అనుసరించండి... .. నన్ను బ్రెయిన్‌లిస్ట్‌గా గుర్తించండి
Similar questions