India Languages, asked by Rajeshraja5344, 8 months ago

I just want social reformer essay in 400 words in Telugu

Answers

Answered by lillymolleti492002
1

Answer:

రాజా రామ్మోహన్ రాయ్

రాజా రామ్మోహన్ రాయ్ (మే 22, 1772 – సెప్టెంబరు 27, 1833) బ్రహ్మ సమాజ్, భారతదేశములో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. అతని విశేషమైన ప్రభావము రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగముల లోనే కాకుండా హిందూ మతము పైన కూడా కనపడుతున్నది. ఇతడు గొప్ప సంఘసంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి ప్రముఖ సాంఘిక దురాచారమైన సతీసహగమనాన్ని రూపుమాపడానికి చాలా కృషిచేశాడు. వితంతు పునర్వివాహానికి కూడా మద్దతు పలికినాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి, దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.

1828 లో ఇంగ్లాండుకు వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్తో కలసి బ్రహ్మసమాజ్ ను ప్రారంభించెను. బ్రహ్మసమాజ్ ఒక ముఖ్యమైన ఆధాత్మిక, మత సంస్కరణ ఉద్యమముగా మారి బెంగాల్ లో సాంఘిక, వివేచనాత్మక సంస్కరణ లకు దారి తీసింది. వీటన్నిటి వలన రాజా రామ్మోహన్ రాయ్, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనములో ఒక ముఖ్యుడిగా భావింపబడెను

బిరుదులు : 1.రాజా ( మొగలు చక్రవర్తి 2వ అక్బర్ ఇచ్చాడు) 2.ఆధునిక భారత దేశ పితామహుడు. 3.పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా

వార్త పత్రికలు 1.మిరాత్ ఉల్ అక్బర్ 2.సంవాద కౌముది 3.బంగదూత

భారత సంఘ సంస్కరణల చరిత్ర లోనే రామ్మోహన్ రాయ్ పేరు, సతీసహగమనమును రూపుమాపడముతో ముడిపడి చిరస్థాయిగా నిలిచిపోతుంది. రామ్మోహన్ రాయ్, హిందూ పూజారుల అధికారమును ధిక్కరించి, అ కాలములో సాధారణమైన బహు భార్యత్వము నేరమని జనులకు నచ్చ చెప్పెను.జయేంద్ర ఒక్క సంగ సంస్కర్థ.

తాను సంకల్పించిన సామాజిక, న్యాయ, మతపరమైన ఉద్యమాలలో రాయ్ మానవత్వము నే ప్రధానముగా తీసుకొనెను. జనులకు తన ఉద్దేశము సమాజములో ఉన్న మంచి సంప్రదాయములను నిర్మూలించడము కాదని, కేవలము వాటిపై సంవత్సరముల పాటు నిరాదరణ వలన పేరుకు పోయిన కుళ్ళును తుడిచివెయ్యడము అని చూపించుటకు కష్టపడెను. ఉపనిషత్తులను గౌరవించి, సూత్రములను చదివెను. విగ్రహారాధనను ఖండించెను. ఆఖండానందమును పొందుటకు, అధ్యాత్మిక చింతన, భగవంతుని ధ్యానము ఉన్నత మార్గములని, ఇవి చెయ్యలేనివారికి బలులు ఇవ్వడము మార్గమని ప్రతిపాదించెను.

వితంతు పునర్వివాహము, మహిళలకు ఆస్తిహక్కు లను సమర్థించెను. బహుభార్యాత్వమును ఖండించెను.

Explanation:

please mark it as a brainliest

Similar questions