I need two essays of any topic in telugu. Please (the first person to answer will get the brainliest answer)
Answers
Explanation:
i dont know bro about this so sorry but some one surelly give you
Explanation:
పర్యావరణ పరిరక్షణకు మరింత విలువను జోడించుదాం
ప్రతీ ఏటా ప్రపంచ దినోత్సవం దగ్గరకు రాగానే హరిత చట్టాలు మరింత కఠినింగా ఉండాలనే వాదనలు అంతటా వినిపిస్తూ ఉంటాయి. చట్టాలు ముఖ్యమే, అయతే పర్యావరణాన్ని పరరక్షించటానికి చట్టాలు మాత్రమే సరిపోవు. మన జీవన విలువలలో పర్యావరణ పరరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉంది.
ప్రాచీన సంస్కృతులన్నీ ప్రకృతిని ఆరాధిస్తూనే పెరగాయి. చెట్లు, నదులు, పర్వతాలు, ప్రకృతి వీటన్నింటిని ఎల్లప్పుడూ పూజించారు. మన దేశంలో ఒక చెట్టును నరికేముందు ఐదు మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది. అన్ని ముఖ్యమైన పండుగలు, సంప్రదాయాలలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. నదులను తల్లులుగా, భూమని దేవతగా కొలిచిన దేశం మనది. ప్రకృతిని పవిత్రంగా భావించి, ఆరాధించి, గౌరవించే ఈ సంప్రదాయాన్ని ఈనాటి నవీన సమాజంలో మరలా ప్రారంభించాల్సి ఉంది. వినూత్న విధానాలలో నీటిని పొదుపు చేయడం, రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేయడం మొదలైనవి తెలియజెప్పాలి. నదులను పునరుజ్జీవింప చేయడం, మొక్కలు పెంచడం, వ్యర్థాలు ఏమాత్రం ఉత్పత్తి చేయని జీవన విధానాలను అవలంభించడం వంటి విషయాలలో సమాజంలోని అందరినీ ముఖ్యంగా యువతను భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపట్టిన 27 నదుల పునరుజ్జీవ కార్యక్రమం సమాజంలోని అందరి భాగస్వామ్యంతో మాత్రమే మాత్రమే సాధ్యమైంది.
Adding 'value' to environment care
నిజం చెప్పాలంటే మనిషిలోని దురాశే కాలుష్యానికి మూల కారణం. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు సంపాదించాలనే దురాశ పర్యావరణాన్ని ఛిద్రం చేస్తోంది. భౌతికింగా కాలుష్యాన్ని సృష్టించడమే కాక, వ్యతిరేక భావాలను సృష్టించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తోంది. మానవులలోని ఈ మనస్తత్వాన్ని, ఈ సమస్యకు మూల కారణాన్ని మనం సరిదిద్దాల్సిన అవసరం ఉంది.
సాంకేతికాభివృద్ధి జరిగినప్పుడు పర్యావరణం నాశనమవుతుందనే తప్పనిసరి నిబంధన ఏమీ లేదు. టెక్నాలజీ (సాంకేతికత) గాని, విజ్ఞానశాస్త్రం గానీ చెత్తను సృష్టించవు. కానీ ఆ సాంకేతికతను, విజ్ఞానాన్ని వాడి మనం చేసే పనులు చెత్తను సృష్టిస్తున్నాయి. కాబట్టి ఆ చెత్తను తిరిగి వాడుకునే విధానాలను, చెత్తను ఉత్పత్తి చేయని సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసి వాడుకోవాలి. సౌరశక్తి, సహజ వ్యవసాయ పద్ధతులు వీటికి ఉదాహరణ.
ప్రకృతి వనరులను వాడుకోవడం ద్వారా ప్రజలకు విజ్ఞానాన్ని, సౌఖ్యాన్ని అందించడం సాంకేతికత ఉద్దేశ్యం. ఆధ్యాత్మికత, మానవ విలువలను మరిచిపోయినప్పుడు అదే సాంకేతికత, సుఖానికి బదులుగా వినాశనాన్ని, కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. క్షమ, సహనం, అందరి బాగోగులు కోరుకుంటూ పని చేయడం వంటి లక్షణాలు అలవర్చుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణానికీ మనకూ ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడు పర్యావరణం గురించి శ్రద్ధ తీసుకోగలుగుతాం. అందుకే పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలలో ఆధ్యాత్మిక వికాసం ఒక ముఖ్యమైన భాగమని నేను భావిస్తాను.
మనిషి తెలుసుకోగలికే అనుభవాలలో తనకూ, తన చుట్టూ ఉన్న పర్యావరణానికి గల సంబంధం మొట్టమొదటిదని మన ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానం చెబుతున్నది. మన చుట్టూ ఉన్న వాతావరణం స్వచ్ఛంగా, సకారాత్మకంగా ఉన్నప్పుడు, ఆ అనుభూతి మన జీవితంలోని అన్ని పార్శ్వాలలోనూ ప్రసవించి వాటిని ప్రభావితం చేస్తుంది. మానవుల మనస్తత్వానికి ప్రకృతితో గాఢమైన చారిత్రాత్మకమైన అనుబంధం ఉంది. ఎప్పుడైతే మనం ప్రకృతితో ఉన్న అనుబంధం నుంచి దూరంగా వెళ్లడం మొదలైంది, అప్పుడే కాలుష్యాన్ని పుట్టించడం, పర్యావరణాన్ని నాశనం చేయడం మొదలైంది.
ప్రకృతితో మనిషికి గల ఈ అనుబంధాన్ని మళ్లీ చిగురింప చేయాలి. మన మనస్తత్వాన్ని, అనూచానంగా వస్తున్న పద్ధతులను పైకి తీసి మరలా పాటించాలి. భూమిని పవిత్రంగా పూజించడం, చెట్లను, నదులను పవిత్రంగా ఆరాధించడం, ప్రజలందరినీ పవిత్రంగా భావించి ఆరాధించడం ప్రకృతిలో దైవాన్ని చూడటం అలవాటుగా చేయాలి. అది మనలో సున్నితత్వాన్ని పెంచుతుంది. సున్నితత్వమైన మనిషి ప్రకృతి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, పర్యావరణాన్ని పెంపొందించకుండా ఉండలేడు.
వీటన్నింటికి మించి, మనం మన ప్రపంచాన్ని విశాలదృష్టితో చూడాల్సిన అవసముంది. మానసికమైన ఒత్తిడి లేకుండా, ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించాలనే సదాశయంతో మనం సాగాలి. అది జరగాలంటే మానవ చైతన్యం దురాశ, స్వలాభం కోసం ఇతరులను వంచించే విధానాలను దాటి ఉన్నతంగా ఎదగాలి. మానసికమైన ఈ ఎదుగుదల ఆధ్యాత్మికత ద్వారా సాధ్యమవుతుంది. అది మన యొక్క అసలైన స్వభావాన్ని, మనకు మనతో, ఇతరులతో, పర్యావరణంతో గల అనుబంధాలను తెలుసుకునేలా చేస్తుంది. ఆధ్యాత్మికత అనేది మనలోని చైతన్యాన్ని ఉన్నతస్థాయికి తీసుకు వెళ్లి, పర్యావరణ వినాశనానికి కారణమవుతున్న అసూయ అనే గుణాన్ని తొలగించి వేస్తుంది. భూప్రపంచం అంతటినీ రక్షించగలిగే దృక్పథాన్ని మనలో కలిగిస్తుంది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలను అభివృద్ధి చేసుకుంటూనే పర్యావరణంతో సమతుల్యాన్ని పాటించడమే ఈ శతాబ్దపు సవాల్. ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడం ఒక్కటే ఈ సవాలును అధిగమించడానికి, సమతుల్యాన్ని సాధించడానికి మనకు ఉన్న మార్గం.