i want short moral story in telugu
Answers
Answer:
కుందేలు మరియు తాబేలు:
ఒక నాడు కుందేలు మరియు తాబేలు తమలో ఎవరు గొప్ప అని నిర్ణయించుకుందాం అని అనుకున్నాయి. చివరికి ఒక పరుగు పందెం ద్వారా ఎవరు గొప్ప అని తెలుసుకోవాలని నిర్ధారించుకున్నాయి. తాబేలు చాలా నెమ్మదైన జీవి మరియు కుందేలు చాలా చురుకైన మరియు ఉత్సాహవంతమైన జీవి. పరుగు పందెం మొదలవ్వకనే అయ్యింది. కుందేలు మొదట్లో చాలా వేగంగా పరిగెత్త సాగింది. మెరుపు వలే విజృంభించి పరుగు అందుకుంకుంది. తాబేలు నెమ్మదిగా అడుగు లో అడుగు వేసుకుంటూ బయలుదేరింది. కొంత దూరం వెళ్ళాక కుందేలు వెనక్కి తిరిగి చూసింది.
కుందేలుకి తన పరిసర ప్రాంతాలలో ఎక్కడ తాబేలు కనిపించలేదు. దీనితో గెలుపు తనదే అని నిర్ధారించుకున్న కుందేలు ఒక దగ్గర ఆగి విశ్రాంతి తీసుకో సాగింది. ఇంతలో తాబేలు నెమ్మదిగానే అడుగు లో అడుగు వేసుకుంటూ నిద్రపోతున్న కుందేలు ని దాటుకొని చివరికి చేరుకొని గీత దాటి పరుగు పందెం లో విజేత గా నిలిచింది.
కథ లో నీతి :- నిదానమే ప్రదానము