మీకు తెలిసిన సామాజక వ్యక్తి గురించి వ్యాసం రాయండి
i want this answer compulsorily should give answer
Answers
Answer:
chala kastam andi antha type cheyalemu
సమాజంలోని విభిన్న రంగా ల్లో పనిచేస్తున్న వారంతా తమ మను గడకు ఆధారమైన ఈ సమాజం బాగోగులను పట్టించుకోవడానికి త మ విధులు సక్రమంగా నిర్వహించ డంతోపాటు సామాజిక చింతనతో సేవా దృక్పథంను అలవర్చుకోవాల్సిన అవసరముంది. ఈనెల ఐదున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల బాధ్యతల గురించి గుర్తు చేసుకుందాం.
ఉపాధ్యాయులు-సమాజం
వ్యక్తి నిర్మాణంలో పాఠశాల విద్య క్రియాశీల పాత్ర పోషించడం, తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపుదిద్దుకోవడం అనే రెండు కారణాల వలన ఇతరులకు లేనన్ని అవకాశాలు, బాధ్యతలతోపాటు సామాజిక చింతనతో ఉపాధ్యాయులే ఆలోచన చేయవలసి రావడం గమనించదగిన విషయం. చలనశీల స్వభావంగల సమాజ మనుగడకు, సామాజిక మార్పుకు ప్రతినిధిగా గల ఉపాధ్యాయులు నిరంతరం పరిశీలనా దృక్పథంతో ప్రతిస్పందించాల్సి ఉంటుంది.
విద్య బావి జీవిత సవాళ్లను అధిగమించుటకు, వ్యక్తి సర్వతోముఖ వికాసమునకు తోడ్పడుటయే గాక, ప్రజాస్వామిక వ్యవస్థ పరిపుష్టికి, సామ్యవాద సాధనకు, సమ సమాజ స్థాపనలో, తద్వారా దేశాభివృద్ధికి దారి తీసేదిగా విద్య తన పాత్ర పోషించవలసి ఉన్నది. విద్యా లక్ష్యాల రూపకల్పన, విద్యా ప్రణాళిక రచన, బోధన పద్ధతులు, ఉపాధ్యాయుడి పాత్ర, తరగతి గది క్షమ శిక్షణ, మూల్యాంకన, ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడు తత్వవేత్తతో ఎలా పోల్చదగినవాడో పరిశీలించవలసి ఉంది.
ఉపాధ్యాయుడు-తత్వవేత్త
తత్వవేత్త నిరంతర అన్వేషకుడు, అందుకే ప్లేటో రిపబ్లిక్ గ్రంధంలో జ్ఞానాభిరుచి, అభ్యసనము పట్ల జిజ్ఞాస, ఉన్నజ్ఞానంతో ఎప్పుడూ తృప్తిచెందని నిరంతర అన్వేషకుడు తత్వవేత్త అంటారు. ఉపాధ్యాయుడు కూడా తరగతి గది బోధనతో పాటు నిరంతర అధ్యయనం ద్వారా అభ్యసన ప్రక్రియ కొనసాగిస్తూ సామాజిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనే క్రమంలో అన్వేషణ దృక్పథంతో, సామాజిక కర్తవ్యాలు నిర్వహిస్తున్నాడు. నిర్వహించాల్సిన అవసరం బలంగా ఉంది. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు విద్య-తత్వశాస్త్రాలను, మానవ సంబంధాలను సమకాలీన రాజకీయాలను, ప్రజా జీవన పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు తత్వవేత్తలాగా భవిష్యత్తు గురించి కలగంటాడు. అందుబాటులో ఉన్న జ్ఞానంతో వివిధ శాస్త్రములు అందించిన పరిజ్ఞానమునే ఇటుకలతో విద్యా సౌధాన్ని నిర్మించడానికి ఉవ్విళ్లూరుతుంటాడు. ఈ పరిణామం దీర్ఘకాలికమే అయినా ఆ తృష్ణ, ఆసక్తి లేకపోతే ఉన్నత స్థాయిలో గల ఉపాధ్యాయులకు సమాజంలో చోటు దొరకడం అనుమానమే.
లక్ష్యాల సాధనలో ఉపాధ్యాయుడి కృషి
సౌశీల్యమును పెంపొందించి, సృజనాత్మకతను మేల్కొలిపి, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తూ వ్యక్తి సాంఘిక అవసరాలు తీర్చగలిగే నేర్పుగల వాడే ఉపాధ్యాయుడు. ఈ విలువల సాధనకు ప్రధాన సూత్రదారి అయిన ఉపాధ్యాయుడు. స్వయంగా ఆదర్శంగా ఉంటూ అనేక సుగుణాలు కలిగి ఉండాల్సిన అవసరముంది. సెకెండరీ విద్యా కమిషన్, కొఠారీ కమిషన్‌తోపాటు 1979 ఎన్‌సీఈఆర్‌టీ వారి సిఫార్సులలో కూడా పని అనుభవము, శ్రమ జీవన సౌందర్యం పట్ల విద్యార్థులలో ఆరాధన భావం కల్గించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పగా, 1986 జాతీయ విద్యా విధానం, జ్ఞానం, నైపుణ్యంతోపాటు మానవతా విలువలను పెంపొందింపజేయవలసిన అవసరాన్ని గట్టిగా సూచించింది.
ఆచరించదగిన సామాజిక కర్తవ్యాలు
- కలుపుగోలు తనం, ప్రేమ, ఆత్మీయత, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పలు లక్షణాలను పిల్లల్లో వృద్ధి చేయాలి.
- సామాజిక రుగ్మతలపట్ల ఒక స్పష్టమైన అవగాహన గల ఉపాధ్యా యులుగా దేశభక్తి, విధేయత, బాధ్యతను గుర్తింపజేసి అంకితభావం తో కృషి చేసే దిశగా విద్యార్థులను సంసిద్ధులను చేయాలి.
- పాఠశాలల్లో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలి. రచన, వ్యకృత్వ, గానంలాంటి రంగాలను నిర్లక్ష్యం చేయరాదు.
- సమాజంలో జరుగుతున్న పలు సంపుటములు, అంశాలపై స్పందించాలి. మానవతా వాదాన్ని ప్రదర్శించాలి.
కష్టాల్లో, ఆపదలో, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు విద్యార్థుల కుటుంబాలను పరామర్శించి సామాజిక జీవిగా వ్యవహరించాలి.
- తమ భోదనా పాఠ్య ప్రణాళికకు అనుబంధమైన విజ్ఞాన సర్వస్వములను ఉపాధ్యాయుడు సేకరించి విజ్ఞాన భాండాగారములను ఏర్పాటు చేసి విద్యార్థుల విరామకాలాన్ని సద్వినియోగం చేయాలి.
- ప్రశ్నించడానికి, చదవడానికి, రాయడానికి, పరిశీలించడానికి వారికి ఎక్కువ అవకాశం ఇచ్చి విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా నూతన ప్రక్రియలను చేపట్టాలి.
- విద్యార్థులు, సమాజంతో బలమైన సంబంధాలు కలిగి ఉండాలి.
- వివిధ స్వచ్ఛంద, సాహితీ సంస్థలతో మమేకమై తమ ప్రతిభను చాటాలి. విద్యార్థులను ప్రయోజన కార్యక్రమాలకు తీసుకెళ్లాలి.
- మధ్యాహ్న భోజన సదుపాయం, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, అనారోగ్య అపాయ పరిస్థితుల్లో విద్యార్థులకు సహకరించాలి. తగు సూచనలు, సలహాలు ఇవ్వాలి.
- సృజనాత్మకతను పెంచేది ప్రకృతే. కాబట్టి ప్రకృతి అందచందాలు, క్షేత్ర పర్యటనలు విధిగా నిర్వహించాలి.
పిల్లలు అల్లరి చేస్తే లక్ష్యంవైపు మల్లించడానికి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వ్యక్తిగత శ్రద్ధ ద్వారా మార్పు తీసుకురావాలి.
- పాఠశాలల్లో మహానుభావుల జయంతి, వర్థంతులు, ముఖ్యమైన దినోత్సవాలు నిర్వహించడం ద్వారా ప్రేరణ కల్పించాలి. బాధ్యత గుర్తింపజేయాలి.
విద్యార్థులతో సాంగత్యం, జీవితాల పరిశీలన, మానవ విలువలపై చర్చ, సామాజిక సమకాలీన అంశాలపై స్పందన, తాత్విక ఆలోచనల పరంపర ఇవి ఉపాధ్యాయుడికి తప్పక అవసరం. బోధించేవాడు ఉపాధ్యాయుడు. స్వీకరించేవాడు విద్యార్థి. విద్యార్థి స్వీకరించాలంటే బోధించడానికి ఉపాధ్యాయుడి దగ్గర ఏదో ఉండాలి. అనుభవాలు, పరిశీలనలు, విజ్ఞానం ఏదైనా కావచ్చు. అందుకే ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని అందరూ అంటుంటారు. ఆ రకంగానైనా సమాజం ఉపాధ్యాయుడిని గౌరవించినట్టే. విద్యా లక్ష్యాల సాధనలో కృషి చేస్తూనే భావితరంలో జీవన సత్యాలను నింపి సామాజిక బాద్యతతో పురోగమ సమాజానికై ఆరాటపడే నిత్య అన్వేషి, క్రమశిక్షణగల సైనికుడే నేటి సమాజంలో ఉపాధ్యాయుడిగా (ఉత్తమ) రాణించగలడని చెప్పకతప్పదు.
Answer:
please mark as brilliant