English, asked by Zack5399, 1 year ago

importance of discipline in telugu

Answers

Answered by shivam76728289
5
పిల్లలకు క్షమశిక్షణ అలవాటు చేయడమెలా...?

చాలా మంది పెద్దలు పిల్లలకి క్రమశిక్షణ నేర్పించే క్రమంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. పిల్లలకి క్రమశిక్షణ నేర్పిస్తున్నామనుకుంటారే తప్ప వారిలో మరింత మొండితనం పెంపొందిస్తున్నామన్న ఆలోచన వారిలో ఉండదు. ఇది సరైన పద్దతి కాదని నిపుణులు అంటున్నారు. ఎంత చెప్పినా అల్లరి మానరు. క్రమశిక్షణ పాటించరు. ట్యూషన్లు పెట్టించినా, ఇంట్లో కూర్చోబెట్టి చెప్పినా చదువులో వెనుకబాటే. ఇలాంటప్పుడు తల్లిదండ్రులకు ఆపుకోలేనంత కోపం రావడం సహజమే! దాన్ని అదుపు చేయలేని పరిస్థితిలో పిల్లలను దుర్భాషలాడటం, ఒక్కోసారి చేయి చేసుకోవడం చాలాచోట్ల జరిగే విషయమే. దీన్ని పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారనే విషయం అప్పటికి తట్టదు. కానీ ఆ తరవాత తల్లిదండ్రుల్ని ఆలోచనలో పడేస్తుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పసి హృదయాలు గాయపడనే పడతాయి. ఒక్కోసారి దెబ్బలకంటే కూడా మాటలే పిల్లలను ఎక్కువగా గాయపరుస్తాయి. ఈ విధంగా వారిని దండించడం వలన మేలు కన్నా కీడే అధికంగా ఉంటుందని వారు చెబుతున్నారు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పే విషయంలో కొన్ని చిట్కాలు మీకోసం...

1. ముందుగా పిల్లలకి ఎలా మాట్లాడాలో నేర్పించాలి. పెద్దలు ఆచరిస్తే పిల్లలు కూడా వారిని అనుకరించే అవకాశం ఉంది.

2. కృతజ్ఞతకు ‘థాంక్స్', చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు ‘సారీ' లాంటి చిన్న చిన్న పదాలు చెప్పడం చిన్నతనం నుండే వారికి అలవాటు చేయాలి.

3. పిల్లల ఎదుట అసభ్య పదజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. అదే విధంగా గొడవలు పడడం కూడా చేయకూడదు. ఇది వారి పసి మెదడు మీద తీవ్రంగా పనిచేస్తుంది.

4. పిల్లల్ని దండిస్తేనే వారు క్రమశిక్షణగా ఉంటారన్నది నూటికి నూరుపాళ్ళు అబద్దం. వారికి నెమ్మదిగా అర్థమయ్యేటట్లు ఒకటికి పదిసార్లు లేదా వందసార్లు అయినా ఓపికగా చెప్పాల్సిన భాద్యత మీకుంది.

5. మంచి ప్రవర్తన అనేది ఓ పాఠంలాగా వారికి రోజులో కొద్దిసేపన్నా చెప్పగలిగితే అది వారి మెదడులో బలంగా నాటుకుపోతుంది.

6. పుస్తకాలు, యానిమేటెడ్ వీడియో చిత్రాల ద్వారా వారికి క్రమశిక్షణ నేర్పే ప్రయత్నం చేయాలి. మాటలక్నా దృశ్యం వారిలో బలంగా హత్తుకుపోతుంది.

7. క్రమశిక్షణ పేరుతో ఇతర పిల్లలతో వారిని ఎప్పుడూ పోల్చకండి. ఈవిధంగా పోల్చడం వలన వారిలో ఆత్మన్యూనతా భావం నెలకొంటుంది.

Similar questions