India Languages, asked by amitrathor6179, 1 year ago

In the school the sports and games are also useful for us a small essay on this in Telugu

Answers

Answered by kshatrisurya
1

Answer:

school lo Attalu anduku pedetaru anta pilalu ku manchi avaganlhana untadi

Answered by dreamrob
1

పాఠశాలలో ఆటలు మరియు క్రీడలు వాటి ఉపయోగాలు:

పాఠశాలలో విద్యార్థులు మరియు చిన్న పిల్లలకు చదువు మాత్రమే కాదు ఇలా ఆటలు మరియు క్రీడలు వాటి ప్రాముఖ్యత తెలియజేయాల్సిన అవసరం స్కూల్లో ఉపాధ్యాయులకు మరియు స్కూల్ యాజమాన్యానికి ఉన్నది.

పిల్లలకి ఆటలు ఆడటం అనేది చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి ఇలా ఆటలు ఆడటం క్రీడలు ఆడటం వలన శారీరక వ్యాయామమే కాకుండా మానసిక వ్యాయామం కూడా పిల్లలలో పెంపొందించడం చేయవచ్చు.

స్కూల్లో కూడా పిల్లలకు ఖచ్చితంగా ఒక గంట ఆటలాడుకునే సమయాన్ని ఇవ్వాలి ఆటలు మరియు క్రీడలు పిల్లల్లో మానసిక ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. ఉపాధ్యాయులు మరియు స్కూల్ యాజమాన్యం ఆటలన్నీ కూడా చదువులో ఒక భాగంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఈమధ్య చాలా పాఠశాలలో క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ పోటీలు పిల్లల్లో మానసిక ఉల్లాసాన్ని శారీరక వ్యాయామాన్ని పెంపొందిస్తాయి ఉపాధ్యాయులు కూడా పిల్లలకి ఆటలు ఎలా ఆడాలి ఆడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయం పై అవగాహన కల్పించాలి.

తల్లిదండ్రులకు కూడా ఆటలు, క్రీడలు వాటి ఉపయోగాలు గురించి కూలంకషంగా వాళ్లకి వివరించడం ద్వారా వాళ్లు కూడా తమ పిల్లలని ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. క్రీడలు పిల్లల్లో శారీరక మరియు మానసిక వాళ్లు బలంగా ఉండేలా చేస్తాయి.

ఆటలు శారీరక ఎదుగుదలకు కూడా చాలా రకాలుగా తోడ్పడతాయి. ఆటలు ఆడటం ద్వారా పిల్లల్లో సమాచార నైపుణ్యాలు మెరుగుపడతాయి. క్రీడలు విద్యార్థులకు చాలా అవసరం స్కూల్లో ఆడే టువంటి ఆటల్లో విద్యార్థులకు తమ తోటి విద్యార్థులతో ఎలా స్నేహంగా మెలగాలి ఎలా తమ జట్టులోని స్ఫూర్తిగా ఉంచాలి ఎలా ఎదుటి జట్టుతో గెలవాలి ఇవన్నీ కూడా వారు నేర్చుకోటానికి వీలవుతుంది.

స్కూల్లో విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా తప్పనిసరి చేయాలి ప్రతి రోజూ ఒక గంట ఆటలకు కేటాయించడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన దేశానికి గర్వకారణం గా తయారు చేసిన వాళ్ళం అవుతాము.

Similar questions