World Languages, asked by rishu111, 1 year ago

information about bear in telugu

Answers

Answered by gujral
7

ఎలుగు, ఎలుగుబంటి లేదా భల్లూకము (ఆంగ్లం: Bear) ఒక క్రూరమృగము. ఇవి అర్సిడే (Ursidae) కుటుంబానికి చెందిన క్షీరదాలు. వీటిని కానిఫార్మిస్  ఉపక్రమంలో కుక్క వంటి మాంసాహారులుతో చేర్చారు. ఎలుగుబంట్లలో ఎనిమిది జాతులు జీవించి, ప్రపంచమంతటా విస్తరించాయి.

ఆధునిక ఎలుగుబంట్లకు సామాన్యంగా భారీ శరీరం, బలమైన కాళ్ళు, పొడవైన మూతి, గరుకైన వెండ్రుకలు మరియు పొట్టి తోకను కలిగివుంటాయి. వీటి పంజాకు ఐదు పదునైన గోర్లుంటాయి. ధృవపు ఎలుగుబంటి మాంసాహారి కాగా పాండా శాఖాహారిగా వెదురు చిగుళ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. మిగతా జాతులు సర్వభక్షకాలుగా మొక్కల్ని మరియు ఇతర జీవుల్ని తింటాయి.

ఎలుగుబంట్లు ఒంటరిగా జీవించి రాత్రి సమయంలో చురుకుగా తిరుగుతాయి. ఇవి మంచి ఘ్రాణశక్తిని కలిగియుండి భారీగా ఉన్నా కూడా చలాకీగా పరుగెత్తగలవు. ఇవి చెట్లు ఎక్కగలవు మరియు ఈదగలవు. కొన్ని జాతులు చలికాలం కోసం పండ్లను దాచుకుంటాయి.[1] ఇవి గుహలు మరియు పెద్ద గోతులలో నివసిస్తాయి.

ఎలుగుబంట్లు చరిత్రపూర్వం నుండి వీటి మాంసం మరియు చర్మం కోసం వేటాడబడ్డాయి. ఇవి ప్రాచీనకాలం నుండి సంస్కృతి మరియు కళలు మొదలైన వాటిలో ముఖ్య పాత్రను పోషించాయి. ఆధునిక కాలంలో వివిధ కారణాల మూలంగా వీటి ఉనికికి ఆటంకం కలుగుతుంది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సమితి ఆరు జాతుల ఎలుగుబంట్లను అంతరించిపోయే అవకాశం ఉన్నట్లు గుర్తించింది.

Similar questions