Biology, asked by bunny3271, 1 year ago

Information about importance of yoga in Telugu

Answers

Answered by shreeya13
0
జీవితంలో కొన్ని విషయాలను కన్నుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, అవి మానవుని యొక్క జీవన శైలిని సులభతరం చేయడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆరోగ్యవంతంగా ఉంచుతాయి మరియు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఇలాంటివాటిల్లో యోగ కూడా ఒకటి.నిస్సందేహంగా మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంటుంది. ఏ వ్యాయామంతో కూడా పోల్చి చూసినప్పటికీ కూడా యోగాలో ఉన్న చాలా విశిష్టతలు యోగాని చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి.ఎవరైతే ఇప్పుడిప్పుడు యోగాని నేర్చుకుందాం అనుకుంటున్నారో, వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే యోగకు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కేవలం శరీరం పై మాత్రమే ప్రభావం చూపించదు. శరీరంతో పాటు మెదడు మరియు ఆత్మ ఇలా అన్నింటిని వృద్ధి చేయడంలో యోగ కీలక పాత్ర పోషిస్తుంది.

అంతేకాకుండా ఎవరైతే బాగా ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ కుతూహులంగా వ్యవహరిస్తారో, అటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు యోగ వైపే చూస్తున్నారు. అందుకు కారణం ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు నరాల లోపల ఏదైనా అడ్డుపడితే వాటిని తొలగిస్తుంది. క్రమం తప్పకుండా యోగ చేయడం ద్వారా వృద్యాప్యంలో వచ్చే బోలు ఎముకల వ్యాధి మరియు కీళ్ల నొప్పులకు దూరంగా ఉంచుతుంది.

ఈ వ్యాసంలో ప్రతిరోజూ యోగ చేయడం వల్ల కలిగే 15 అత్యద్భుత ఆరోగ్య లాభాల గురించి తెలుసుకోబోతున్నాం. అవేమిటో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Similar questions