India Languages, asked by bhanud986, 2 months ago

it is an telugu subject


అలంకారాలు ఎన్ని రకాలు?​

Answers

Answered by Anonymous
2

అలంకారములు రెండు రకాలు అవి ఎ.శబ్దాలంకారములు బి.అర్ధాలంకారముల ఎ.శబ్దాలంకారములు - 1.వృత్యానుప్రాసము - ఒకే హల్లు అనేక పర్యాయములు తిరిగి తిరిగి వచ్చినచో అది వృత్తానుప్రాసాలంకారము అనబడును. ఉదా - అమందా నందంబున గోవిదుడు ఇందిరి మందిరంబు చొచ్చి. 2.చేకాను ప్రాసము - అర్ధ భేధముతో రెండక్షరముల పదమును వెంటవెంటనే ప్రయేగించును. ఉదా - పాప హరుహరు సేవించెదను. 3.లాటానుప్రాసము - అర్ధమునందుగాక, తాత్పర్యమందునందు మాత్రమే భేదముండునట్లు ఒక పదమును వెంటవెంటనే ప్రయొగించుట. ఉదా - శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ 4. యమకము - అర్ధభేధము గల అక్షరముల సముదాయము మరల మరల ఉచ్చరింపబడినచో యమకమగును. ఉదా - లేమ దనుజులగెలువగా లేమా 5.ముక్తపద గ్రస్తము - పాదము చివరనుండు పదముతో తరువాత పదమును ప్రారంభించుట. బి.అర్ధాలంకారములు - 1.ఉపమాలంకారము - ఉపమాన ఉపమేయాలకు గల పోలికను మనోహరముగా వర్ణించును. 2.ఉత్ప్రేక్షాలంకారము - ఉపమేయమును ఊహించుటను ఉత్ప్రేక్షాలంకారము అందురు. ఉదా - ఆ వచ్చుచున్న ఏనుగునడగొండమేమో అనునట్లున్నది. 3.రూపకాలంకారము - ఉపమాన, ఉపమేయములకు భేధమున్నను అభేధము చెప్పుటను రూపకాలంకారము అందురు. ఉదా - సంసార సాగరము నీదుట మిక్కిలి కష్టము 4.శ్లేషాలంకారము - అనేక అర్ధములు వచ్చునట్లు చెప్పుట శ్లేషాలంకారము. ఉదా - రాజు కవలయానందకరుడు. 5.అర్ధాంతరన్యాసము - సామాన్యమును విశేషము చేతను,విశేషమును సామాన్యము చేతను సమర్ధించుట. ఉదా - మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది. 6.అతిశయోక్తి - ఒక విషయము ఉన్నదానికంటే అధికము చేసి వర్ణించుట. ఉదా - ఊరియందలి భవనములు ఆకాశమును అంటుసున్నవి. 7.దృష్టాంతము - ఉపమాన ఉపమేయములకు, బింబ ప్రతిబింబ భావము ఉండునట్లు వర్ణించుట. ఉదా- ఓరాజా నీవే కీర్తిమంతుడవు. 8.స్వభావోక్తి - జాతి గుణజ్రియాదులలోని స్వభావము ఉన్నదున్నట్లు మనోహరముగా వర్ణించుట. ఉదా - అరణ్యమునందు లేళ్లు బెదురు చూపులతో చెంగు చెంగున దుముకుచు పరిగెడుతున్నవి.

hope it helps u ..

-

Similar questions