Jala samrakshana avasaram essay in Telugu up to 500 words
Answers
Answered by
5
Answer:
ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. పల్లెకైనా, నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా అనూహ్యంగా అధికమవుతోంది. రానున్న కాలంలో నీటి డిమాండ్ భారీగా ఉండే సూచనలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు భూమిపై ఉన్న నీటి వనరుల్లో సుమారు 97 శాతం సముద్రాల్లోనే ఉంది. అంటే మనకు పనికొచ్చే నీరు కేవలం 3 శాతమే. ఈ నేపథ్యంలో జల వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఈ రోజు (మార్చి 22) ‘ప్రపంచ జల దినోత్సవం’ సందర్భంగా నీటి సంరక్షణ కోసం ప్రతిన పూనాల్సిన తరుణమిదే..
మనకు తెలిసీ తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్‌ను అలాగే వదిలేస్తుంటారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకన్‌కు లీకయ్యే నీటి చుక్క.. రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. అందువల్ల ఉపయోగించిన వెంటనే ట్యాప్‌లను జాగ్రత్తగా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. మీ పిల్లలకూ ఇలాంటి అలవాట్లను నేర్పించాలి. వేసవి రాగానే తాగు నీరు లభించక పశుపక్ష్యాదులు మృత్యువాత పడే ఉదంతాలను అనేకం చూసే ఉంటారు. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన పిల్లలు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
వీలైనంతవరకూ స్నానం చేయడానికి షవర్లను ఆశ్రయించకపోవడమే ఉత్తమం. కొత్తగా నిర్మించే ఇళ్లలో విభిన్న రకాల ట్యాప్‌లను అమరుస్తున్నారు. వీటిలో కొన్ని ఆఫ్ చేయడమెలాగో.. ఆన్ చేయడమెలాగో తెలియకుండా ఉంటున్నాయి. కుళాయి నుంచి నీరు రాని సమయాల్లో.. వీటిని తిప్పి అలాగే వదిలేసి, బయటకి వెళ్లిపోతే చాలా నీరు వృథాగా పోతుంది. కాబట్టి ఆధునికత కంటే అవసరానికే ప్రాధాన్యమివ్వడం ప్రయోజనకరం.
వీలైనంతవరకూ స్నానం చేయడానికి షవర్లను ఆశ్రయించకపోవడమే ఉత్తమం. కొత్తగా నిర్మించే ఇళ్లలో విభిన్న రకాల ట్యాప్‌లను అమరుస్తున్నారు. వీటిలో కొన్ని ఆఫ్ చేయడమెలాగో.. ఆన్ చేయడమెలాగో తెలియకుండా ఉంటున్నాయి. కుళాయి నుంచి నీరు రాని సమయాల్లో.. వీటిని తిప్పి అలాగే వదిలేసి, బయటకి వెళ్లిపోతే చాలా నీరు వృథాగా పోతుంది. కాబట్టి ఆధునికత కంటే అవసరానికే ప్రాధాన్యమివ్వడం ప్రయోజనకరం. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా.. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం, వృథాను అరికట్టడం, పొదుపుగా వాడటం, పునర్వినియోగం.. తదితరాలన్నింటికీ ప్రాధాన్యమివ్వాలి. మనసుపెట్టి ఆలోచిస్తే మురుగునీటిని కూడా శుద్ధి చేసి, మళ్లీ వినియోగించుకునే మార్గాలు అనేకం కనిపిస్తాయి. అలాంటి నీటితో పూల మొక్కలు, నీడనిచ్చే చెట్లను పెంచుకోవచ్చు. తద్వారా పచ్చదనాన్ని పెంపొందించుకునే వెసులుబాటు కలుగుతుంది.
HOPE IT HELPS U DEAR...☺
Similar questions
Math,
5 months ago
Math,
5 months ago
Art,
5 months ago
India Languages,
10 months ago
India Languages,
10 months ago
Math,
1 year ago
Physics,
1 year ago